Guru Pradosha Vratham: మరో రెండు రోజుల్లో ప్రదోష వ్రతం, ఈ సమయానికి శివుని ముందు దీపం పెట్టండి
Pradosha vratam 2024: హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రదోష వ్రతం రోజున శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుందని, ధన సంబంధ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. నవంబర్ నెలలో చివరి ప్రదోష వ్రతం మరో రెండు రోజుల్లో ఉంది.
గురు ప్రదోష వ్రతం 2024 నవంబర్: మార్గశిర మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతం నిర్వహించాలి. ఇది నవంబర్ నెలలో చివరి ప్రదోష ఉపవాసం కూడా అవుతుంది. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేశారు. ఈ రోజున శివపార్వతులను పూజించడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ప్రదోష ఉపవాసం పాటించడం ద్వారా పాపాలు తొలగిపోయి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. నవంబర్ నెలలో చివరి ప్రదోష ఉపవాసం ఎప్పుడో, ఏ సమయంలో పూజ చేయాలో తెలుసుకోండి.
త్రయోదశి తేదీ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది - త్రయోదశి తేదీ 28 నవంబర్ 2024 ఉదయం 06:23 గంటలకు ప్రారంభమవుతుంది. త్రయోదశి 29 నవంబర్ 2024 ఉదయం 08:39 గంటలకు ముగుస్తుంది.
గురు ప్రదోష వ్రతం ఎప్పుడు?
2024 నవంబర్ 28న గురు ప్రదోష వ్రతాన్ని నిర్వహించుకోవాలి.
గురు ప్రదోష వ్రతం పూజా సమయం ఇదే
ప్రదోష వ్రత పూజ ముహూర్తం సాయంత్రం 05:23 నుండి 08:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రదోష కాలం ఉంటుంది. ప్రదోష కాలంలో శివుని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పూజించడం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఆ సమయంలో శివ లింగానికి నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది. మీ కోరికలన్నింటినీ ఆ శివుడు తీరుస్తాడు.
గురు ప్రదోష వ్రతాన్ని చేసి ఉపవాసం పాటించడం వల్ల కీర్తి, సంతోషం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి. ఆ వ్యక్తికి శారీరక సుఖాలు పెరుగుతాయి. గురువారం వచ్చే ప్రదోష వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువారం విష్ణువుకు అంకితమైనది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున శివుడితో పాటు విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
ప్రదోషమంటే?
ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థం. నిజానికి ప్రతిరోజూ ప్రదోషకాలం ఉంటుంది. కానీ అన్నింటికీ విలువుండదు. కేవలం చతుర్థి, సప్తమి, త్రయోదశిలలోని ప్రదోష కాలానికి ఎక్కువ విలువ ఉంటుంది. ప్రదోష సమయంలో శివుడిని పూజిస్తే ఎంతో మంచిది.ప్రదోష కాలంలో మహా శివుడు తన ప్రమథ గణాలతో పూజలు అందుకునేందుకు సిద్ధంగా ఉంటాడు.
ఈసారి గురువారం ప్రదోష వ్రతం వచ్చింది. ఆరోజు చేసిన పూజలకు ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. గురు అనుగ్రహం కూడా దక్కుతుంది. గురువు బుద్ధిని, ధనాన్ని ఇచ్చేవాడు. ప్రదోష వ్రతకాలంలో నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివుడు ఆనందపడతాడు.
ప్రదోష వ్రతం నాడు ఉపవాస దీక్ష చేస్తే ఎంతో మంచదని ప్రాచీనకాలం నుంచి రుషులు చెబుతున్నారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి, తెల్లని వస్త్రాలు ధరించాలి. విభూతిని బొట్టుగా పెట్టుకోవాలి. శివ లింగం ముందు కూర్చుని ఓ నమ:శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఆలయంలో కూడా శివ మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి.