Budget Cars : రూ.5 లక్షల ధరతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు.. లిస్టులో ఎలక్ట్రిక్ కారు కూడా
Budget Cars Under 5L : బడ్జెట్ ధరలో కారు కొనాలని అందరూ అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్లకి ఇది ఎక్కువగా ఉంటుంది. మంచి ఫీచర్లతో తక్కువ ధరలో కొనేందుకు కొన్ని కార్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది.
మధ్యతరగతి వారు కారు కొనేటప్పుడు ఎక్కువగా చూసేది బడ్జెట్, ఫీచర్లు. ధర తక్కువ ఉండటంతోపాటుగా మంచి ఫీచర్లు ఉన్న కారును తీసుకోవాలని అనుకుంటారు. మీరు కూడా అలాంటి కారు ప్లాన్ చేస్తే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. భారతీయ మార్కెట్లో రూ. 5 లక్షల కంటే తక్కువ ఎక్స్ షోరూమ్ ధరలో లభిస్తాయి. ఇందులో ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ ఇండియా దేశీయ మార్కెట్లో తమ చౌకైన కారును కేవలం రూ.4.69 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయిస్తోంది. ఇది 68పీఎస్ పవర్, 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ సహజసిద్ధమైన పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో లభిస్తుంది. క్విడ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను వస్తుంది. స్టైలిష్ డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, స్మార్ట్ స్టోరేజ్ స్పేస్, సౌకర్యవంతమైన సీట్లతో ఉంటుంది.
మారుతి సుజుకి ఆల్టో కె10
మారుతి సుజుకి ఆల్టో కె10 కారు కేవలం రూ. 3.99 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో విక్రయిస్తోంది. ఈ పవర్‌ట్రెయిన్ 67.1 హెచ్‌పీ పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 24.9 కేఎంపీహెచ్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.39 కేఎంపీహెచ్ మైలేజీని ఇస్తుందని మారుతి సుజుకి తెలిపింది. సీఎన్జీ మోడ్‌లో ఇది కిలోకు 33.85 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఎంజీ కామెట్ ఈవీ
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ ఈవీ లాంచ్‌తో BaaS(Battery-as-a-Service) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద మీరు ఎంజీ కామెట్ ఈవీని కేవలం రూ. 4.99 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో బ్యాటరీ ఖర్చు ఉండదు. ఈ సరసమైన ఎంజీ ఈవీ ఒక ఛార్జ్‌పై 230 కి.మీల వరకు డ్రైవ్ రేంజ్‌ను అందించగలదు. ఎంజీ కామెట్‌ను నడపడానికి మీరు కిలోమీటరుకు రూ. 2.5 బ్యాటరీ అద్దె చెల్లించాలి. ఇది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ, క్లైమేట్ కంట్రోల్‌ని పొందుతుంది.
టాపిక్