చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.  

pexels

By Bandaru Satyaprasad
Nov 26, 2024

Hindustan Times
Telugu

పెదవులను తరచూ తడపొద్దు-చలికాలంలో పెదవులు పొడిబారుతుంటాయి. తరచూ పెదవులను తడుపుతుంటాం. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని అందించవచ్చు. కానీ అది పెదవుల పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.  

జెంటిల్ ఎక్స్ ఫోలియేషన్- పెదవుల మృత చర్మ కణాలను తొలగించి మృదుత్వాన్ని పెంచేలా సున్నితమైన స్రబ్ తో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మీ పెదాలను ఎక్స్ ఫోలియేట్ చేయండి.  

pexels

లిప్ బామ్ - పెదవులు తేమ కోల్పోకుండా ఉండేందుకు కొబ్బరి నూనె పదార్థాలతో తయారు చేసిన మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ను అప్లై చేయండి.  

pexels

హైడ్రేషన్ -రోజులో తగినంత నీరు తాగడం ద్వారా మీ పెదాలను హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.  

సమతుల్య ఆహారం - విటమిన్లు, మినరల్స్ తో కూడిన ఆహారాన్ని తీసుకోండి. పోషక ఆహారం మీ పెదవులతో సహా చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.  

pexels

సహజ నూనెలు - బాదం లేదా జోజోబా నూనె వంటివి మీ పెదవులకు రాయండి. ఈ నూనెలు పెదవుల తేమ శాతాన్ని పెంచుతాయి.  

pexels

ఇండోర్ హ్యూమిడిఫైయర్ - ఇంట్లోని గాలికి తేమను జోడించడానికి హ్యుమిడిఫైయర్ ను ఉపయోగించండి. ఇది మీ పెదవులు పొడిబారకుండా గాలిలో తగిన తేమశాతం ఉండేలా చేస్తుంది.  

pexels

కెఫిన్, ఆల్కహాల్ పరిమితం- కెఫిన్, ఆల్కహాల్ డీహైడ్రేషన్ కు దారితీస్తాయి. చలికాలంలో వీటిని పరిమితంగా తీసుకుంటే మంచిది.  

pexels

చలి నుంచి రక్షణ - చల్లటి గాలుల నుంచి మీ పెదాలను రక్షించడానికి కండువా లేదా హైకాలర్ జాకెట్ ను ఉపయోగించండి. అవి పెదాలను పొడిగా మారకుండా నిరోధిస్తాయి.  

pexels

చలికాలంలో మొలకెత్తిన పెసర్లు తింటే ఇంత మంచిదా..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com