Maruti Suzuki Alto K10: సూపర్ లుక్‌లో మారుతి ఆల్టో కె10.. ధరెంతంటే
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి తన కొత్త సరికొత్త మోడల్ Alto K10ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతుంది. ఆగస్టు 18, 2022న కారునులాంచ్ చేయనున్నారు.
మారుతి సుజుకి (Maruti Suzuki) ఆగస్టు 18, 2022న భారత మార్కెట్లోకి తన న్యూ జనరేషన్ కారు ఆల్టో కె10 (Alto K10 ) విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, మారుతి సుజుకి ఆల్టో కె10 2022 అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందే, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ చిత్రాలు, స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ సరికొత్త మారుతి సుజుకి ఆల్టో K10 కారు నాలుగు ట్రిమ్ స్థాయిలో, 6 పెయింట్ స్కీమ్‌లతో రూపొందించారు.
6 కలర్ ఆప్షన్స్
కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో K10 భారతదేశంలో ఆరు రంగు ఆప్షన్‌లలో అందించబడుతుంది. సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్ రంగులలో ఆల్టో K10 లభించనుంది. అదనంగా, ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ నాలుగు ట్రిమ్ స్థాయిలతో వస్తుంది. Std (STD), LXi (LXi), VXi (VXi), VXi+ (VXi+) ఇవి 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.
ఇంజిన్, గేర్‌బాక్స్
కొత్త-తరం మారుతి సుజుకి ఆల్టో K10 అప్‌డెట్ వెర్షన్‌తో K-సిరీస్ 1.0-లీటర్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ కొత్త S-ప్రెస్సోతో పిక్స్ చేశారు. ఈ ఇంజన్ 65.7 బిహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, AMT (AGS)తో జత చేయబడింది.
డిజైన్, పరిమాణం
కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో K10 కారు గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లతో ఎక్స్టర్నల్ లుక్ ఆకట్టుకుంటుంది. కొన్ని విజువల్ అప్‌డేట్‌లతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. హార్ట్‌టెక్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా కారును డిజైన్ చేశారు. సైజ్ పరంగా, కొత్త ఆల్టో K10 2,380 mm పొడవు గల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. మెుత్తంగా 3,530 mm పొడవు, 1,490 mm వెడల్పు, 1,520 mm ఎత్తును కలిగి ఉంది. కారు మొత్తం బరువు 1,150 కిలోలు. కొత్త ఆల్టో కె10 ఈ పరిమాణంతో ఆల్టో కంటే 85 మిమీ పొడవు, 45 మిమీ ఎక్కువ, మరియు వీల్‌బేస్ కూడా 20 మిమీ పొడవుగా ఉంది.
ధర ఎంతంటే
2022 మారుతి సుజుకి ఆల్టో K10 ఆగస్ట్ 18న భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది. ఆ తర్వాత మాత్రమే అధికారిక ధర తెలుస్తుంది. ఇది ఆల్టో 800 కంటే హైగా ఉంటుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షలుగా ఉండవచ్చని అంచనా. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 రెనాల్ట్ క్విడ్ (Renault Kwid), మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) లకు పోటీగా ఉంటుంది.