Bigg Boss Ticket To Finale: బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి మానస్- టికెట్ టు ఫినాలే రేస్- ఫైనల్స్‌లోకి ఫస్ట్ వెళ్లింది ఎవరంటే?
Bigg Boss Telugu 8 Ticket To Finale Task: బిగ్ బాస్ తెలుగు 8లో టికెట్ టు ఫినాలే రేస్‌ను ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు టికెట్ టు ఫినాలే టాస్క్‌లను నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్స్ అయిన బ్రహ్మముడి మానస్, జబర్దస్త్ పింకీ, అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక హౌజ్‌లోకి వెళ్లారు.
Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 క్లైమాక్స్‌కు చేరుకుంది. రెండు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారానికి బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌లోకి వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్‌ను హౌజ్ కంటెస్టెంట్స్ మధ్య నిర్వహిస్తారు.
టికెట్ టు ఫినాలే టాస్క్
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 టికెట్ టు ఫినాలే టాస్క్‌లను మాజీ కంటెస్టెంట్స్‌తో నిర్వహించనున్నారు. ప్రస్తుత హౌజ్ మేట్స్ మధ్య బిగ్ బాస్ 8 తెలుగు టికెట్ టు ఫినాలే రేస్‌ను నిర్వహించేందుకు సంచాలక్‌లుగా ఎక్స్ కంటెస్టెంట్స్ ఉండనున్నారు. ఈ క్రమంలో ఇదివరకే బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ నుంచి అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 26 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో అలేఖ్య, అఖిల్‌ను చూసి కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా శివంగివి అని రోహిణిని అఖిల్ మెచ్చుకున్నాడు. ఏంటీ బ్రో నీ ఫొటో నా ఫొటో వేసి మీమ్స్ చేస్తున్నారు జనాలు అని అఖిల్ అంటే.. అవునా అని పృథ్వీ అన్నాడు.
మొదటి ఫైనలిస్ట్
"టికెట్ టు ఫినాలే పొంది మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీ కోసం మీరు కంటెండర్స్‌ని ఎంపిక చేయాల్సి ఉంటుంది" అని అఖిల్, హారికతో బిగ్ బాస్ అనౌన్స్ చేసి చెప్పాడు. దాంతో టేస్టీ తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియ నలుగురికి ఒక టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న చిన్న కలర్ బాక్స్‌లను రాడ్‌తో తీసుకొచ్చి రెయిన్ బోలా టేబుల్‌పై పేర్చాలి. దీనికి అఖిల్ అండ్ హారిక సంచాలక్‌లుగా ఉన్నారు.
ముందు రోహిణి అన్ని బాక్స్‌లను సరిగ్గా పెట్టింది. కానీ, అవి పడిపోయాయి. ఆ తర్వాత పెట్టాడు. కానీ, అతనివి కూడా పడిపోయాయి. తర్వాత రోహిణి కరెక్ట్‌గా పేర్చి వచ్చి బెల్ కొట్టింది. కట్ చేస్తే హారికను రోహిణి ఎత్తుకుని తిప్పింది. అయితే, టికెట్ టు ఫినాలే ద్వారా బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌లోకి మొదటగా వెళ్లిన కంటెస్టెంట్ రోహిణి సమాచారం. బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం రోహిణినే మొదటి బిగ్ బాస్ 8 తెలుగు ఫైనలిస్ట్ అని తెలిసింది.
ప్రయత్నాలతోనే
టాస్క్ అనంతరం అవినాష్, టేస్టీ తేజ మాట్లాడుకున్నారు. ఓడిపోయినందుకు తేజ చాలా ఫీల్ అయ్యాడు. అన్నీ ప్రయత్నాలతోనే అయిపోతున్నాయి. దేనికైనా సపోర్ట్ కావాలన్నో అని బాధపడ్డాడు తేజ. ఎవరు కూడా సొంతగా ఆడలేదు. ప్రతి ఒక్కరికి చెబితేనే పర్ఫెక్ట్‌గా షేప్‌లు పెట్టారు అని అవినాష్ అన్నాడు. అక్కడితో బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
అయితే, ఇవాళ హౌజ్‌లోకి బ్రహ్మముడి ఫేమ్ మానస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. అతనితోపాటు జబర్దస్త్ పింకీ (ప్రియాంక సింగ్) కూడా జోడీగా అడుగుపెట్టనుందట. మానస్, ప్రియాంక సింగ్ బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా రాణించారు. అఖిల్, అలేఖ్యలాగే మానస్, ప్రియాంక కూడా కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించనున్నారని సమాచారం.