AP Central University : ఏపీ సెంట్రల్ వ‌ర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌- ద‌ర‌ఖాస్తులకు డిసెంబ‌ర్ 8 చివరి తేదీ-ap central university recruitment teaching non teaching posts dec 8th last date for application ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Central University : ఏపీ సెంట్రల్ వ‌ర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌- ద‌ర‌ఖాస్తులకు డిసెంబ‌ర్ 8 చివరి తేదీ

AP Central University : ఏపీ సెంట్రల్ వ‌ర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌- ద‌ర‌ఖాస్తులకు డిసెంబ‌ర్ 8 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu
Nov 26, 2024 05:14 PM IST

AP Central University Jobs : ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 8వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీచింగ్ పోస్టులు -4, నాన్ టీచింగ్ పోస్టులు-4 మొత్తం 8 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఏపీ సెంట్రల్ వ‌ర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌- ద‌ర‌ఖాస్తులకు డిసెంబ‌ర్ 8 చివరి తేదీ
ఏపీ సెంట్రల్ వ‌ర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌- ద‌ర‌ఖాస్తులకు డిసెంబ‌ర్ 8 చివరి తేదీ

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ (అనంతపురం)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు డిసెంబ‌ర్ 8న ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. అర్హులు, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. టీచింగ్ పోస్టులు -4, నాన్ టీచింగ్ పోస్టులు-4 మొత్తం 8 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసేందుకు డిసెంబ‌ర్ 8 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. అయితే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసిన త‌రువాత, దాన్ని ప్రింట్ తీసి, దానికి సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి యూనివ‌ర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. అప్లికేష‌న్ హార్డ్ కాపీలు పంప‌డానికి డిసెంబ‌ర్ 18 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

టీచింగ్ పోస్టులు

టీచింగ్ పోస్టులు మొత్తం 4 ఉన్నాయి. అందులో ప్రొఫెస‌ర్-1, అసోసియేట్ ప్రొఫెస‌ర్-3 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ప్రొఫెస‌ర్ పోస్టు ఎక‌నామిక్స్ స‌బ్జెక్ట్ కాగా, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టు సైకాల‌జీ, ఇంగ్లీష్, మేనేజ్‌మెంట్ స‌బ్జెక్ట్‌లో ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెస‌ర్ మాత్రమే ఓబీసీ రిజ‌ర్వ్డ్ కాగా, మిగిలిన ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు మూడూ అన్ రిజర్వ్డ్‌లో ఉన్నాయి.

టీచింగ్ పోస్టుల‌కు అర్హత‌లు

1. ఎక‌నామిక్ ప్రొఫెస‌ర్ పోస్టుకు పీహెచ్‌డీ పూర్తి చేయాలి. యూనివ‌ర్సిటీ, కాలేజీల్లో క‌నీసం ప‌దేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

2. ఇంగ్లీష్‌, సైకాల‌జీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. పీజీలో 55 శాతం మార్కులు రావాలి. క‌నీసం ఎనిమిదేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

3. మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుకు పీహెచ్‌డీ పూర్తిచేయాలి. పీజీ, డిగ్రీల్లో అదే స‌బ్జెక్ట్ ఉండాలి. క‌నీసం ఎనిమిదేళ్ల టీచింగ్‌, రీసెర్చ్ అనుభ‌వం ఉండాలి.

అప్లికేష‌న్ ఫీజు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు, మ‌హిళ‌కు ఫీజు లేదు. టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు, అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://curec.samarth.ac.in/index.php/search/site/index ద్వారా చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసిన త‌రువాత హార్డ్ కాపీల‌ను “I/c Selection Committee Section, Central University of Andhra Pradesh, JNTU Incubation Centre, JNTU Road, Chinmaya Nagar, Anantapur – 515 002, Andhra Pradesh” అడ్రస్‌కు స్పీడ్ పోస్టు చేయాలి.

నాన్ టీచింగ్ పోస్టులు

నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం నాలుగు భ‌ర్తీ చేస్తున్నారు. అందులో జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌)-1, సెక్యూరిటీ అసిస్టెంట్‌- 2, ఫైనాన్స్ ఆఫీస‌ర్‌-1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ నాలుగు పోస్టులు అన్ రిజ‌ర్డ్వ్ కేట‌గిరీలోనే ఉన్నాయి.

వ‌యో ప‌రిమితి

జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టుకు వ‌య‌స్సు 35 ఏళ్ల దాట కూడ‌దు. సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల‌కు వ‌య‌స్సు 32 ఏళ్ల దాట కూడ‌దు. ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టుకు వ‌య‌స్సు 57 ఏళ్లు దాట‌క కూడదు. ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టు మూడేళ్ల కాల ప‌రిమితి ఉంటుంది.

అర్హత‌లు

1. జూనియ‌ర్ ఇంజ‌నీర్ పోస్టుకు సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేయాలి. లేదా మూడేళ్ల అనుభ‌వంతో డిప్లొమా ఇంజ‌నీరింగ్ చేయాలి.

2. సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఎల్ఎంవీ, మోట‌ర్ సైకిల్‌ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

3. ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టుకు 55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా క‌నీసం 15 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.

జూనియ‌ర్ ఇంజ‌నీర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల‌కు అప్లికేష‌న్ ఫీజు రూ.1,000, ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టుకు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు, మ‌హిళ‌కు ఫీజు లేదు. టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు, అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cuapnt.samarth.edu.in/index.php/site/login ద్వారా చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసిన త‌రువాత హార్డ్ కాపీల‌ను “I/c Selection Committee Section, Central University of Andhra Pradesh, JNTU Incubation Centre, JNTU Road, Chinmaya Nagar, Anantapur – 515 002, Andhra Pradesh” అడ్రస్‌కు స్పీడ్ పోస్టు చేయాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం