Horror Movie: శ్రీ గాంధారిగా రాబోతున్న హన్సిక - హారర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
Horror Movie: హారర్ మూవీతో డిసెంబర్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది హన్సిక. శ్రీ గాంధారి పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హన్సిక డ్యూయల్ రోల్ చేస్తోంది. ఈ హారర్ మూవీకి ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
Horror Movie: హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది హన్సిక. శ్రీ గాంధారి పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
గంధర్వ కోట రహస్యం...
శ్రీ గాంధారి మూవీలో హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా కనిపించబోతున్నది. గంధర్వ కోట పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలుంటాయి. ఆ రహస్యాల్ని ఎలా బయటకు వచ్చాయి? గాంధారి ఎవరు? ఆ కోటలోని ఓ ఆత్మ కొందరిపై పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? ప్రాజెక్ట్ కోసం కోటలో అడుగుపెట్టిన బృందానికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి అనే అంశాలతో శ్రీ గాంధారి మూవీ తెరకెక్కుతోంది.
డ్యూయల్ రోల్...
శ్రీ గాంధారి మూవీలో హన్సిక డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నది. ఆధునిక కాలం నాటి యువతిగా, ఓ మహారాణిగా రెండు కోణాల్లో ఆమె క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం.
మెట్రో శిరీష్...
ఇటీవల శ్రీ గాంధారి మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హారర్ అంశాలతో ఈ ట్రైలర్ ఉత్కంఠను పంచుతోంది. ట్రైలర్‌లో తెలుగులో కాకుండా మరో భాషలో హన్సిక డైలాగ్స్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది. శ్రీ గాంధారి మూవీలో మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, బ్రిగిడా సాగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
త్వరలో రిలీజ్ డేట్ ఫైన్...
శ్రీ గాంధారి కథను తొల్కప్పియన్, స్క్రీన్ ప్లేని ధనంజయన్ అందించారు. ఎల్వీ గణేష్ ముత్తు మ్యూజిక్ అందిస్తోన్నాడు వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) సమర్పణలో రాజునాయక్ శ్రీ గాంధారి మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోన్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని నిర్మాత అన్నారు.
అగ్ర హీరోయిన్‌గా...
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నది హన్సిక. దేశముదురు, కందీరిగ, బిల్లా తో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విజయ్, ధనుష్, శింబు వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసింది.
వెబ్‌సిరీస్...
నవతరం హీరోయిన్ల దూకుడుతో కొన్నాళ్లుగా అవకాశాలు రేసులో వెనుకబడిపోయింది హన్సిక. రీసెంట్‌గా తెలుగులో మై నేమ్ ఈజ్ శృతితో పాటు 105 మినిట్స్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు హన్సికకు హిట్టును తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో నషా పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.