AP TG School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్, డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు
AP TG School Holidays : డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు రానున్నాయి. వచ్చే నెలలో దాదాపుగా 9 రోజులు హాలీడేస్ వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో 7 రోజులు ప్రభుత్వ సెలవులు కాగా...మిగిలినవి ఐచ్ఛిక సెలవులు. ఇక క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు భారీగా సెలవులు రానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో దసరా నుంచి స్కూళ్లకు సెలవులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో దసరా సెలవులు వచ్చాయి. దీపావళి కూడా అక్టోబర్ నెలలోనే వచ్చింది. దీంతో అక్టోబర్ లో స్కూళ్లకు ఎక్కువగానే సెలవులు వచ్చాయి. నవంబర్ లో పండుగలు లేకపోవడంతో పూర్తిగా బడికి వెళ్లిన స్టూడెంట్స్ కు మళ్లీ సెలవుల సీజన్ ప్రారంభం అయ్యింది. డిసెంబర్ నెలలో దాదాపుగా 9 రోజులు సెలవులు వస్తున్నాయి. వీటిల్లో 7 సెలవులు ప్రభుత్వ హాలీడేస్ కాగా... రెండు ఐచ్ఛిక సెలవులుగా ఉన్నాయి. ఇక మిషనరీ స్కూల్స్ లో 10 రోజులు హాలీడేస్ ఇచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా మిషనరీ పాఠశాలల్లో అదనపు సెలవులు ఉంటాయి.
ఆ పాఠశాలలకు 10 రోజుల సెలవులు
డిసెంబర్ నెలలో పాఠశాలలకు భారీగా రానున్నాయి. డిసెంబర్ లో 5 ఆదివారాలు, ఒక రెండో శనివారం, క్రిస్మస్ హాలీడే కలిపి 7 రోజులు హాలీడేస్ ఉన్నాయి. కొన్ని పాఠశాలలకు క్రిస్మస్ ముందు లేదా తర్వాత రోజు కూడా సెలవు ప్రకటిస్తారు. దీంతో సెలవులు 8 రోజులకు చేరాయి. మిషనరీ పాఠశాలలకు విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 5 రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులు హాలీడేస్ మంజూరు చేశారు. డిసెంబర్ లోని 5 ఆదివారాలు కలిపి మొత్తం 10 రోజులు మిషనరీ పాఠశాలలకు సెలవులు రానున్నాయి. రెండో శనివారం సెలవుతో కలిపితే వీటి సంఖ్య 11కు చేరుతుంది. ఇక జనవరిలో సంక్రాంతి సెలవుల సందడి ఉంటుంది. డిసెంబర్, జనవరి సెలవులు పూర్తైన తర్వాత విద్యార్థులు పరీక్షల సన్నద్ధత మొదలవుతుంది. ఏపీలో క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
- ఆదివారాలు : డిసెంబరు 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాధారణ సెలవులు
- క్రిస్మస్: డిసెంబర్ 25న ప్రభుత్వ సెలవు
- క్రిస్మస్ ఈవ్: డిసెంబర్ 24న సెలవు(ఐచ్ఛికం)
ఏపీలో మరోసారి స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. వర్షాకాలంలో భారీ తుపానులు, వరదల కారణంగా భారీగా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఏపీకి తుపాను ముప్పు పొంచివుండటంతో అప్రమత్తం ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో వర్షప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం వుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీ, తమిళనాడుతో అండమాన్ నికోబార్ దీవులపై ఎక్కువగా ఉంటుదని ఐఎండీ తెలిపింది. ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.