Anjali Intimate Scenes: ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ అంజలి ఆన్సర్ ఇదే!-anjali reacts to intimate scenes in bahishkarana telugu bold web series bahishkarana ott streaming on zee5 ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anjali Intimate Scenes: ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ అంజలి ఆన్సర్ ఇదే!

Anjali Intimate Scenes: ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ అంజలి ఆన్సర్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Aug 20, 2024 03:10 PM IST

Anjali About Intimate Scenes In OTT Web Series Bahishkarana: ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ బహిష్కరణ‌లో చేసిన సెక్స్ సీన్లపై హీరోయిన్ అంజలికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి అంజలి ఇచ్చిన ఆన్సర్ వైరల్‌గా మారింది.

ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ అంజలి ఆన్సర్ ఇదే!
ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ అంజలి ఆన్సర్ ఇదే!

Anjali About Sex Scenes In Bahishkarana: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది బ్యూటిఫుల్ అంజలి. 50కిపైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడమే కాకుండా పలు విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించింది అంజలి. అయితే, ఇటీవల ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో రత్న అనే వేశ్య పాత్రలో అలరించింది హీరోయిన్ అంజలి. సినిమాలో మాత్రమే కాకుండా ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో కూడా అంజలి వేశ్య పాత్ర చేసింది. ఆ తెలుగు వెబ్ సిరీసే బహిష్కరణ. ఇందులో పుష్ప అనే వేశ్య క్యారెక్టర్ చేసింది హీరోయిన్ అంజలి. బహిష్కరణ వెబ్ సిరీస్‌‌లో పలు శృంగార సన్నివేశాల్లో నటించి ఆకట్టుకుంది అంజలి.

ఇదే విషయంపై బహిష్కరణకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో అంజలికి ప్రశ్న ఎదురైంది. దానికి అంజలి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. "చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. శ్రీతేజ్‌తో ఇబ్బంది పడ్డారా? శివయ్య (రవీంద్ర విజయ్)తోనా?" అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. "అవును, ఇబ్బంది గురించి అడుగుతున్నారా.. ఇబ్బంది పుష్పకు ఉండదు కానీ, అంజలికి ఉంటుంది" అని అంజలి ఆన్సర్ ఇచ్చింది.

"నేను అడుగుతుంది పుష్పను కాదు అంజలిని" అని రిపోర్టర్ అన్నారు. దానికి "అంజలి విషయానికొస్తే.. శ్రీతేజ్‌తో కలిసి నటించినా.. రవీంద్ర విజయ్‌తో నటించినా ఇబ్బందే. ఎందుకంటే ఏ సీన్ చిత్రీకరణ అయినా కనీసం 20 మంది సెట్‌లో ఉంటారు. మేల్ యాక్టర్స్ అయినా అలాంటి సన్నివేశాల్లో నటించడం తేలిక కాదు" అని అంజలి చెప్పుకొచ్చింది.

"నా కెరీర్‌ ప్రారంభంలో మంచి పాత్రలు వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్స్‌నే సెలెక్ట్ చేసుకుంటా. కొన్ని సినిమాల కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తా. నవరస అనే వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు" అని హీరోయిన్ అంజలి తెలిపింది.

"బహిష్కరణలో ఇంటిమేట్ సీన్లలో నటించడంతో కాస్తా గందరగోళానికి గురయ్యా. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు అందరినీ బయటకు పంపి చిత్రీకరించారు. నేను ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. బహిష్కరణలో ఇంటిమేట్ సీన్స్‌కు నేనే కాదు విజయ్ గారు కూడా ఇబ్బంది పడ్డారు" అని అంజలి చెప్పుకొచ్చింది.

దాంతో నటుడు రవీంద్ర విజయ్‌ను "ఇబ్బంది పడ్డారా" అని రిపోర్టర్ అడిగారు. అందుకు "అలాంటి సీన్స్‌లో నటించడం ఎవరికైనా ఇబ్బందే. ఎంజాయ్ చేస్తూ నటించేదైతే కాదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో.. నేను ఇలా అంటాను.. మీరు అలా అనండి అని ముందుగానే మాట్లాడుకున్న తర్వాత నటిస్తాం. సో ఇంటిమేట్ సీన్స్ నాట్ సో ఎంజాయ్‌బుల్" అని రవీంద్ర విజయ్ తెలిపాడు.

కాగా అడల్ట్ సన్నివేశాల మేళవింపుతో రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్‌గా తెరకెక్కింది బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్‌ బహిష్కరణ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.