Anjali: నన్ను అలాగే చూడాలనుకుంటారు.. కానీ, గేమ్ చేంజర్‌లో అలాంటి పాత్రే: హీరోయిన్ అంజలి
Anjali About Game Changer Gangs Of Godavari: రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది హీరోయిన్ అంజలి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనను ఆడియెన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో తెలిపింది.
Anjali About Her Roles In Movies: హీరోయిన్ అంజలి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి హారర్ కామెడీ సినిమాతో అలరించింది. ఇప్పుడు త్వరలో విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేసేందుకు రెడీగా ఉంది. అలాగే రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న గేమ్ చేంజర్ సినిమాలోనూ నటిస్తోంది బ్యూటిఫుల్ అంజలి.
ఇదిలా ఉంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari Movie) సినిమా మే 31న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి (Anjali) సినిమాల్లో తన పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
రత్నమాల పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు?
ఈ తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్లినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు. కానీ వాళ్ల మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.
ఈ సినిమాలో మీరు రత్నమాల పాత్రను అంగీకరించడానికి ప్రధాన కారణం?
పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ, ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నాకు నచ్చదు. ఈ పాత్రలోని వైవిధ్యమే నన్ను ఈ సినిమా చేయడానికి అంగీకరించేలా చేసింది.
విశ్వక్ సేన్, మీరు పోటీపడి నటించారా?
నిజంగానే మా పాత్రలు పోటా పోటీగానే అనిపిస్తాయి. సినిమాలో విశ్వక్ ఎంత గట్టిగా మాట్లాడతారో.. అంతకంటే గట్టిగా నేను మాట్లాడతాను. ట్రైలర్‌లో గమనిస్తే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లేదా ఫలానా పాత్ర అని కాకుండా.. అన్ని పాత్రలు బలంగా, కథలో కీలకంగా ఉంటాయి.
కథానాయికగా కాకుండా మీరు ఈ మధ్య ఎక్కువగా కీలక పాత్రలలో నటించడానికి కారణం?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi Movie) అనేది నా సినిమా. నేను ప్రధాన పాత్ర పోషించిన సినిమా. అలాగే 'గేమ్ చేంజర్' (Game Changer Movie) చిత్రంలో కూడా నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర.
రామ్ చరణ్ గారితో 'గేమ్ చేంజర్' చేయడం ఎలా ఉంది?
రామ్ చరణ్ (Ram Charan) గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. పాత్ర కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తారు. ఆయన తన పాత్ర విషయంలోనే కాకుండా.. సినిమాలోని ఇతర పాత్రధారులకు కూడా అంతే సహకారం అందిస్తారు.
టాపిక్