Anjali Vishwak Sen: అంజలి కంటే విశ్వక్ సేన్ జూనియర్ ఆర్టిస్ట్.. హీరో రిప్లై ఏంటంటే?
Vishwak Sen Junior Artist Than Anjali: హీరోయిన్ అంజలి కంటే విశ్వక్ సేన్ జూనియర్ ఆర్టిస్ట్ అని స్టేజీ మీదే యాంకర్ అడిగిన ప్రశ్నకు మాస్ కా దాస్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్స్‌లో తనకు ఎదురైన ప్రశ్నకు విశ్వక్ సేన్ ఏం సమాధానం ఇచ్చాడంటే..
Anjali Vishwak Sen Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే గామి సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. గామి మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందింది. గామి తర్వాత విశ్వక్ సేన్ హీరోగా చేసిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో అలరించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో హీరోయిన్‌గా అంజలి చేసింది. మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
అయితే, మూవీ విడుదలకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ జోరుగా చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్‌తోపాటు పలు ప్రచార కార్యక్రమాలతో మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఇదే ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి విశ్వక్ సేన్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషనల్ ఈవెంట్‌లో "సర్.. మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్.. ఐ మీన్.. చాలా చాలా" అని విశ్వక్ సేన్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దాంతో అక్కడున్న వాళ్లు షాక్ అయ్యారు. ముఖ్యంగా అంజలి అయితే అవాక్కయింది. కాకపోతే ఈ ప్రశ్నకు విశ్వక్ సేన్ ఇచ్చిన ఆన్సర్ చాలా మందిని ఇంప్రెస్ చేసింది.
రిపోర్టర్ అడిగినదానికి "వాస్తవమే.. సీనియర్ నా కంటే.. మీరు గట్టిగా అడిగితే తిను (నేహా శెట్టి) సీనియరే. మెహబూబా మూవీ వచ్చినప్పుడు నేను.. ఊ.." అని తను ఆ సమయంలో బచ్చ గాన్ని అన్న విధంగా ఊ కొట్టాడు విశ్వక్ సేన్. అంజలి కంటే జూనియర్ అని విశ్వక్ ఒప్పుకోవడం పట్ల నెటిజన్స్, పలువురు ప్రశంసిస్తున్నారు. హానెస్టీ పర్సన్ అంటూ కామెంట్స్ చేస్తూ పొగుడుతున్నారు.
కాగా నేహా శెట్టి 1994 జూన్ 20న జన్మిస్తే.. విశ్వక్ సేన్ 1995 మార్చి 29న పుట్డాడు. అంటే నేహా శెట్టి కంటే విశ్వక్ సేన్ సుమారుగా సంవత్సరం చిన్నవాడు. మెహబూబా మూవీతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సమయంలో నేహాకు 24 కాగా విశ్వక్‌కు 23 ఏళ్లు. అందుకే అప్పుడు తాను బచ్చా అన్నట్లుగా విశ్వక్ మాట్లాడినట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇక హీరోయిన్ అంజలి ఫొటో అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2006లో వచ్చింది. అప్పుడు విశ్వక్ సేన్‌కు కేవలం 11 ఏళ్లు మాత్రమే. నందు హీరోగా తెరకెక్కిన ఫొటో సినిమా సమయంలో అంజలి వయసు 20 ఏళ్లు. విశ్వక్ సేన్, అంజలి మధ్య ఏజ్ గ్యాప్ 9 ఏళ్ల వరకు ఉందని తెలుస్తోంది.
అందుకే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్ సేన్ చాలా పాజిటివ్‌గా స్పందించాడు. కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాపిక్