Gangs Of Godavari OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఇదే నెలలో స్ట్రీమింగ్! ఎక్కడంటే?
Gangs Of Godavari OTT Release: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన న్యూ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపిస్తోంది. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ ప్లాట్ ఫామ్, డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారాయి.
Gangs Of Godavari OTT Streaming: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
బాలకృష్ణ రావడంతో
కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్‌గా చేశారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడంతో సినిమాపై హైప్ పెరిగింది.
ఓటీటీ రిలీజ్ కూడా
పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు యావరేజ్ టాక్ నడుస్తోంది. కానీ, విశ్వక్ సేన్ నటన బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, సినిమాకు యావరేజ్ టాక్‌తో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్ కూడా ఆసక్తిగా మారింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్, డిజిటల్ ప్రీమియర్ విషయాలపై క్యూరియాసిటీ నెలకొంది.
ఓటీటీ హక్కులకు కోట్లల్లో ఖర్చు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మంచి ధర పెట్టి కొనుక్కున్నట్లు సమాచారం. కోట్లల్లో ఖర్చు చేసి సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అలాగే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని డీల్ ఫిక్స్ అయిందట. అంటే మే 31న రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూలైలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇదే నెలలో ఓటీటీ రిలీజ్
కానీ, సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ మౌత్ టాక్ బట్టి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా మొత్తానికి ఇదే నెలలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని టాక్ వినిపిస్తోంది. జూన్ చివరి వారంలోనే విశ్వక్ సేన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. పాత స్టోరీని రొటీన్‌గా తీసినట్లుగా టాక్ వినిపించింది.
కొత్త సీసాలో పాత సరుకు
అలాగే ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో బాలకృష్ణ పాత సినిమాను టైపులో ఉందని, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని పొగిడినట్లు విశ్వక్ సేన్ చెప్పాడు. కానీ, అది ప్రశంస కాదని, సినిమా అంతంతమాత్రంగానే ఉందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పినట్లు పలువురు రివ్యూవర్స్ రివ్యూలో చెప్పారు. ఇక సినిమా టైటిల్‌కు తగినట్లే మూవీని యాక్షన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు.
రాజకీయాలను వాడుకుని
90ల్లో గోదావరి జిల్లాలోని ఓ లంక ప్రాంతంలో జరిగే కథగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కించారు. ఒక యువకుడు రాజకీయాలను వాడుకుని ఎలా పైకి ఎదిగాడు అనేది సినిమా కథ అని నిర్మాత నాగవంశీ తెలిపారు. అలాగే ఇది గ్యాంగ్‌స్టర్ మూవీ కాదని డైరెక్టర్ కృష్ణ చైతన్య క్లారిటీ ఇచ్చారు.