Gayathri Gupta: బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటివాడు.. నేనే హీరోయిన్ అన్నాడు.. గాయత్రి గుప్తా కామెంట్స్-gayathri gupta comments on baby director sai rajesh shirin sriram baby movie controversy baby leaks book ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gayathri Gupta: బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటివాడు.. నేనే హీరోయిన్ అన్నాడు.. గాయత్రి గుప్తా కామెంట్స్

Gayathri Gupta: బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటివాడు.. నేనే హీరోయిన్ అన్నాడు.. గాయత్రి గుప్తా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 30, 2024 10:57 AM IST

Gayathri Gupta Baby Director Sai Rajesh: బేబి మూవీ కాంట్రవర్సీ మరింత ముదురుతోంది. తాజాగా ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా డైరెక్టర్ సాయి రాజేష్‌పై తను పాములాంటివాడు అని ఆరోపణలు చేసిందు. ముందుగా బేబి సినిమాలో తననే హీరోయిన్‌గా అనుకున్నారని చెప్పింది.

బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటివాడు.. నేనే హీరోయిన్ అన్నాడు.. గాయత్రి గుప్తా కామెంట్స్
బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటివాడు.. నేనే హీరోయిన్ అన్నాడు.. గాయత్రి గుప్తా కామెంట్స్

Gayathri Gupta Baby Controversy: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబి సినిమా కాంట్రవర్సీ (Baby Movie Controversy) అయిన విషయం తెలిసిందే. బేబి మూవీ కథ తనదేనంటూ, సాయి రాజేష్ తన దగ్గరి నుంచి కాపీ కొట్టాడని ప్రేమించొద్దు మూవీ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా సాయి రాజేష్ మోసాన్ని బేబి లీక్స్ అనే బుక్ ద్వారా బయటపెట్టాడు.

ఈ బుక్‌కు సంబంధించిన లింక్‌ను https://babyleaks2023.blogspot.com/ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ చేశాడు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్. అయితే ఇప్పుడు బేబి సినిమా వివాదం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ సాయి రాజేష్‌పై ఫిదా నటి, కొబ్బరిమట్ట హీరోయిన్ గాయత్రి గుప్తా షాకింగ్ ఆరోపణలు చేసింది.

"బేబి సినిమా స్టోరీని ప్రేమించొద్దు అనే టైటిల్‌తో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్‌గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్సులో ఉన్న ఆ ఫొటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను" అని గాయత్రి గుప్తా తెలిపింది.

"సాయి రాజేష్‌తో నాకు ఇబ్బందులు కొత్తేం కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు రూ. 3 లక్షల పారితోషికం ఇస్తానన్నాడు. కానీ, కేవలం రూ. 25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబి కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ స్టోరీని తానే క్రియేట్ చేశానంటాడు" అని గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది.

"సాయి రాజేష్, శిరిన్ ఇద్దరు కలిసి ఆ కథతో మూవీ చేద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి గీతా ఆర్ట్స్‌తో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాములాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి" అని గాయత్రి గుప్తా వివరించింది.

"బేబీ మూవీ కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబి పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబి స్టోరీ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరగాలి" అని గాయత్రి గుప్తా కోరింది.

ప్రస్తుతం సాయి రాజేష్‌పై గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గాయత్రి గుప్తా స్కూల్ డ్రెస్సులో ఉన్న ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. బేబి కథను తన ఫ్రెండ్ రవికిరణ్ చెప్పిన ఒక పాయింట్‌తో రాసుకున్నట్లు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఇదివరకు చెప్పారు. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం, ఆమెను ఇద్దరు చంపడం అనే పాయింట్‌తో బేబి స్టోరీ చిత్రీకరించుకున్నట్లు చెప్పారు.

బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇక గాయత్రి గుప్తా ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట, ఫిదా సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఆ మధ్య బిగ్ బాస్ విభేదాలతో కూడా వైరల్ అయింది.

టీ20 వరల్డ్ కప్ 2024