Baby Leaks: హాట్ టాపిక్‌గా 'బేబి లీక్స్' బుక్.. ఆనంద్ దేవరకొండ మూవీపై లాయర్ చెప్పిన సంచలన నిజాలు
Sai Rajesh Baby Leaks Book: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబి సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ అసలు రైటర్ తానంటూ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ రచ్చకెక్కారు. ఈ క్రమంలో బేబి లీక్స్ బుక్, ఈ చీటింగ్‌కు సంబంధించిన విషయాలను లాయర్ నిఖిలేష్ తొగరి చెప్పారు.
Baby Leaks Book: ఆనంద్ దేవరకొండ సినీ కెరీర్‌లో కల్ట్ మూవీగా నిలిచింది బేబి సినిమా. ఇందులో ఆనంద్‌తోపాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. తన ఐడియాను కాపీ కొట్టి బేబి అనే బూతు సినిమా తీశాడంటూ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌పై ఫైర్ అయ్యారు ప్రేమించొద్దు చిత్ర దర్శకుడు శిరిన్ శ్రీరామ్. తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటే, అనవసరంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదులు చేస్తున్నట్లు, అది తట్టుకోలేక ఇలా బేబి లీక్స్ బుక్ గురించి బయటపెట్టినట్లు శిరిన్ శ్రీరామ్ తెలిపారు.
తన ఐడియాను బేబి డైరెక్టర్ సాయి రాజేష్ కాపీ కొట్టాడని, ఆయన వెన్నుపోటు పొడిచే రకం అని, నోటీసులు పంపిస్తే సాయి రాజేషే ఆ కథను తనకు చెప్పినట్లు రిప్లై ఇస్తున్నట్లు ఇటీవల మీడియా ప్రెస్ మీట్‌లో శిరిన్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఇదే ప్రెస్ మీట్‌లో లాయర్ నిఖిలేష్ తొగరి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు.
"ఫేస్ బుక్ ద్వారా శిరీన్ పరిచయం. ఆయన తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఒకసారి ఆయన ఫోన్ చేసి ఈ బేబి కాపీ గురించి చెప్పాడు. సాక్ష్యం ఎలా పట్టుకొస్తావ్ అని అడిగితే.. ప్రతీ దాన్ని డేట్‌తో సహా భద్రపర్చుకున్నాడు. ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. ఇంత పకడ్బందీగా దాచుకోవడం ఆశ్చర్యమేసింది" అని లాయర్ నిఖిలేష్ తొగరి తెలిపారు.
"ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు ఇష్టం. క్రియేటివ్ పర్సన్‌కు ఇలా జరగడం బాధగా ఉంది. పోలీసులు కూడా ఈ సాక్ష్యాలు చూసి షాక్ అయ్యారు. చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిరసీ, కాపీ రైట్ యాక్ట్‌కి సంబంధించిన పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీన్ తన ప్రమోషన్స్‌లో తాను ఉంటే ఛాంబర్లకు లేఖలు రాస్తున్నారట. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలను బుక్ రూపంలో తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాడు" అని నిఖిలేష్ పేర్కొన్నారు.
"పోలీసులు, కోర్టు, మీడియా వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతాం. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం. అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్సు చేశాను. 2015లో పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశా. ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ కాల్ చేశాడు. స్టోరీగా మార్చి సినిమా తీద్దామని అన్నాడు" అని శిరిన్ శ్రీరామ్‌కు పాయింట్ చెప్పిన రవి కిరణ్ తెలిపారు.
"అమ్మాయి ఇద్దర్ని ప్రేమించింది. ఆ ఇద్దరూ కలిసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు అనే పాయింట్‌తో కథను రాసుకున్నాడు. స్కూల్ ఏజ్ అమ్మాయితే బాగుంటుందని ఆ స్టోరీని అలా అల్లుకున్నాడు. అబ్బాయిల్లో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయితే బాగుంటుందని శిరీన్ ఆ రోజే నాకు చెప్పాడు" అని శిరిన్ శ్రీరామ్‌కు స్నేహితుడు రవి కిరణ్ అన్నారు.
"నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?.. నేను సాయి రాజేష్‌ని పదేళ్ల క్రితమే బ్లాక్ చేశా. జూన్ 7న ప్రేమించొద్దు రాబోతోంది. శిరీన్ డ్రీమ్‌ను సాయి రాజేష్ నాశనం చేశాడు. మీడియానే న్యాయం చేయాలి" అని రవి కిరణ్ కోరారు. ఇలా ఈ బేబి లీక్స్ బుక్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా బేబీ లీక్స్ బుక్ లింక్‌ను (https://babyleaks2023.blogspot.com/)శిరిన్ శ్రీరామ్ అందుబాటులో ఉంచారు.