Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్-anand devarakonda comments on gam gam ganesha movie at pichiga nachheshave song release in mallareddy college ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 05, 2024 10:38 AM IST

Anand Devarakonda About Gam Gam Ganesha: బేబి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మరో చిత్రం గం.. గం.. గణేశా. ఇటీవల ఈ సినిమా నుంచి పిచ్చిగా నచ్చేశావే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్
బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Anand Devarakonda About Gam Gam Ganesha: బేబి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా "గం.. గం.. గణేశా". ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల అంటే మే 31న "గం.. గం.. గణేశా" సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల "గం.. గం.. గణేశా" సెకండ్ సింగిల్ 'పిచ్చిగా నచ్చాశావే' పాటను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ నయన్ సారిక, నిర్మాత వంశీ కారుమంచి, డైరెక్టర్ ఉదయ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, నటుడు కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి, సింగర్ అనురాగ్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

"నేను కొన్నేళ్ల కిందట స్పోర్ట్స్ ఆడేందుకు మీ కాలేజ్‌కు వచ్చాను. ఇంత పెద్ద కాలేజ్ చూసి ఆశ్చర్యపోయాను. మన సొసైటీకి రేపటి ఫ్యూచర్ మీరే. మీలో చాలా మంది బాగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని విన్నాను. మీ అందరి సమక్షంలో మా "గం..గం..గణేశా" సినిమా పిచ్చిగా నచ్చాశావే సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది" అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపాడు.

"బేబి సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగా, విజయ్ దేవరకొండ తమ్ముడిగానే తెలుసు. బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా స్టోరీ సెలక్షన్స్ బాగుంటాయని చెబుతుంటారు" అని ఆనంద్ దేవరకొండ అన్నాడు.

"గం.. గం.. గణేశాలో స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. క్రైమ్, కామెడీ, యాక్షన్‌తో మీరంతా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మే 31న థియేటర్స్‌కు వెళ్లండి. చేతన్ భరద్వాజ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ ఎక్స్ 100, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలకు చేతన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ బృందావనివే వంటి చాట్ బస్టర్ అందించాడు" అని ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

"అనురాగ్ కులకర్ణి నాకు అమేజింగ్ సాంగ్స్ పాడాడు. బేబిలో ప్రేమిస్తున్నా సాంగ్‌ను సురేష్ బనిశెట్టి అన్న రాశారు. ఈ పిచ్చిగా నచ్చాశావే సాంగ్ కూడా బ్యూటిఫుల్‌గా రాశారు. ఉదయ్ శెట్టి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌తో ఓపికగా ట్రావెల్ చేస్తూ ఎంతో కష్టపడి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. మనకు అతను ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు" అని ఆనంద్ దేవరకొండ చెప్పాడు.