Sri Ranga Neethulu: అంథాలజీ సినిమాగా శ్రీరంగనీతులు.. బేబి, కలర్ ఫొటో, కంచరపాలెం హీరోలతో క్రేజీగా!-sri ranga neethulu trailer released anthalogy movie suhas viraj ashwin karthik ratnam ruhani sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sri Ranga Neethulu Trailer Released Anthalogy Movie Suhas Viraj Ashwin Karthik Ratnam Ruhani Sharma

Sri Ranga Neethulu: అంథాలజీ సినిమాగా శ్రీరంగనీతులు.. బేబి, కలర్ ఫొటో, కంచరపాలెం హీరోలతో క్రేజీగా!

Sanjiv Kumar HT Telugu
Mar 30, 2024 11:25 AM IST

Sri Ranga Neethulu Trailer Released: కలర్ ఫొటో హీరో సుహాస్, బేబి హీరో విరాజ్, కేరాఫ్ కంచెరపాలెం కథనాయకుడు కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా శ్రీరంగనీతులు. తాజాగా శ్రీరంగంనీతులు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ విశేషాల్లోకి వెళితే..

అంథాలజీ సినిమాగా శ్రీరంగనీతులు.. బేబి, కలర్ ఫొటో, కంచరపాలెం హీరోలతో క్రేజీగా!
అంథాలజీ సినిమాగా శ్రీరంగనీతులు.. బేబి, కలర్ ఫొటో, కంచరపాలెం హీరోలతో క్రేజీగా!

Sri Ranga Neethulu Trailer: కలర్ ఫొటో హీరో సుహాస్‌, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తీక్‌ర‌త్నం, బేబి సినిమా హీరో విరాజ్ అశ్విన్‌తోపాటు హిట్ బ్యూటి రుహానిశ‌ర్మ‌ ముఖ్య‌ తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ్రీరంగనీతులు సినిమాను ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

కాగా తాజాగా శ్రీరంగనీతులు సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమాన్ని శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో అజ‌య్ అర‌సాడ‌, శ‌శాంక్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి, రుహాని శ‌ర్మ‌, ప్ర‌వీణ్‌కుమార్, విరాజ్ అశ్విన్‌, కార్తీక్ రత్నం, సుహాస్, కిర‌ణ్, రుహాని శర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా "ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ నా స్నేహితుడు, ద‌ర్శ‌కుడు అన్ని విభాగాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను" అని నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు అజ‌య్ అర‌సాడ మాట్లాడుతూ "శ్రీ‌రంగ‌నీతులు సినిమా క్లోజ్ టు మైహార్ట్‌. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను" అని మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ అన్నారు. "నాకు ఈ అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ఇది అంద‌రికి న‌చ్చే సినిమా. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు" అని డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. "నాకు న‌చ్చిన పాత్ర‌ను ఇందులో చేశాను. నాకు న‌చ్చిన ఆర్టిస్టుల‌తో ప‌నిచేశాను. సినిమా చాలా బాగుంది. అంద‌రూ థియేటర్‌లో త‌ప్ప‌కుండా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను" అని కార్తీక్ రత్నం పేర్కొన్నాడు.

"చాలా రోజులుగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి మూవీలో నేను న‌టించినందుకు చాలా హ్య‌పీగా ఉంది. ఇది అంద‌రిక‌థ. అన్ని పాత్ర‌ల‌తో అంద‌రూ క‌నెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్న‌ప్పుడు చాలా మంది వాళ్ల‌ను వాళ్లు అద్దంలో చూసుకంటున్న‌ట్లుగా ఉంటుంది. ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌. ఇలాంటి సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయి" అని హీరోయిన్ రుహాని శర్మ తెలిపింది.

"ఈ సినిమాకు క‌థే హీరో. ప్ర‌వీణ్ మంచి ద‌ర్శ‌కుడితో పాటు మంచి ర‌చ‌యిత‌. చాలా మంచి క‌థ‌. ఇందులో నేను న‌టించినందుకు ఆనందంగా ఉంది. శ్రీరంగనీతులు సినిమాలో ఉన్న అన్ని విభిన్న పాత్ర‌లు చూడ‌బోతున్నారు. బ‌స్తీ నుంచి బంగాళాలో ఉన్న అంద‌రికి క‌నెక్ట్ అయ్యే క‌థ ఇది" అని బేబి నటుడు విరాజ్ అశ్విన్ తెలిపాడు. "ప్ర‌వీణ్ చాలా క‌ష్ట‌ప‌డి చేశాడు. త‌న జ‌ర్నీ నాకు తెలుసు. ఇదొక ఆంథాల‌జి సినిమా. మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంద‌రూ మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని అనుకున్నాను. నిర్మాత ఎంతో అభిరుచి గల వ్య‌క్తి. మంచి సినిమాను నిర్మించాడు" అని కలర్ ఫొటో హీరో సుహాస్ అన్నాడు.

IPL_Entry_Point