
(1 / 6)
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. దీనికి గోత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.

(2 / 6)
ఏప్రిల్ 5న ఎన్నో అంచనాలతో విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. మొదటి రెండు రోజులు పర్వాలేదనిపించుకున్న తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి.

(3 / 6)
ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ మాత్రం చెప్పారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఫలితం వేరేలా ఉందని, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్‌గా నిలిచిందని తెలుస్తోంది.

(4 / 6)
ఉగాది, సమ్మర్ హాలీడేస్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ స్టార్ యావరేజ్‌గా నిలిచిందని టాక్దాం వస్తోతోంది. దాంతో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారని ఓ వార్త వైరల్ అవుతోంది.

(5 / 6)
నిర్మా దిల్ రాజును డిస్టిబ్యూటర్స్ అంతా కలిసి తమకు నష్టపరిహారం అడిగారని, దానికి దిల్ రాజు ఒకే చెప్పినట్లు సమాచారం. వాళ్లను ఆదుకోడానికి రెడీ అయిన దిల్ రాజు సినిమా కొన్న ధరలో కొంత వరకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు టాక్.

(6 / 6)
ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.
ఇతర గ్యాలరీలు