Vaishnavi Chaitanya: సింగర్‌గా మారిన బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. హారర్ మూవీ లవ్ మీతో డెబ్యూ!-vaishnavi chaitanya become singer with raavaali ra song from love me ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vaishnavi Chaitanya Become Singer With Raavaali Ra Song From Love Me

Vaishnavi Chaitanya: సింగర్‌గా మారిన బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. హారర్ మూవీ లవ్ మీతో డెబ్యూ!

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 06:20 AM IST

Vaishnavi Chaitanya Sung Raavaali Raa Song: బేబి మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సింగర్‌గా మారింది. తను నటిస్తున్న కొత్త చిత్రం లవ్ మీలోని రావాలి రా సాంగ్‌ను విడుదల రోజు స్టేజీపై నిర్మాత దిల్ రాజుతో కలిసి పాడింది. ఈ సినిమా పాటతో సింగర్‌గా వైష్ణవి డెబ్యూ చేసిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సింగర్‌గా మారిన బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. హారర్ మూవీ లవ్ మీతో డెబ్యూ!
సింగర్‌గా మారిన బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. హారర్ మూవీ లవ్ మీతో డెబ్యూ!

Vaishnavi Chaitanya Love Me Song: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన సినిమా లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. రీసెంట్‌గా లవ్ మీ లోని రావాలి రా అనే పాటను విడుదల చేశారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య రావాలి రా సాంగ్ పాడింది. స్టేజీపై దిల్ రాజుతో కలిసి సింగ్ చేసింది. అయితే, ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చైతన్యతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాట పాడించారని దిల్ రాజు పేర్కొన్నారు. అంటే స్టేజీపై కాకుండా నిజంగానే పాటను వైష్ణవి చైతన్య పాడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే లవ్ మీ సినిమాతో సింగర్‌గా వైష్ణవి చైతన్యకు డెబ్యూ అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. "ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణి గారు ఈ పాటను పాడించారు. నేను కూడా ఇంతలా హమ్ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి గారు ఎంతో మెలోడియస్‌గా ట్యూన్ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. చాలా ఎగ్జైటింగ్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను" అని దిల్ రాజు అన్నారు.

"అన్నీ కొత్త కథలు దొరకవు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ ఆడుతుండాలి. ఇది చాలా కొత్త కథ అని మాత్రం నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు. సినిమా అంతా అయ్యాకే ఆడియెన్స్‌కు అర్థం అవుతుంది. ఇది చాలా న్యూ అటెంప్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కొత్తగా ట్రై చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేశారని ఆశిష్‌కు సలహా ఇచ్చాను. ముందు నటుడిగా ఎదగమని సూచించాను. నా ఆలోచనను ఆశిష్ అర్థం చేసుకున్నారు"అని దిల్ రాజు తెలిపారు.

"ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు" అని దిల్ రాజు చెప్పారు.

"సెల్లార్‌లో అద్భుతమైన సెట్ వేసి ఈ పాటను షూట్ చేశారు. ఆ రోజు బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే నాకు ఎంతో భయం వేసింది. ఇంత మంచి పాటను ఇచ్చిన చంద్రబోస్ గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మేం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమాను థియేటర్లో చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండిద. మీకు కచ్చితంగా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది" అని హీరోయిన్ వైష్ణవి చైతన్య తెలిపింది.

IPL_Entry_Point