Baby Movie Controversy: కాపీ కొట్టి బేబి అనే బూతు మూవీ తీశాడు.. సాక్ష్యాలతో సాయి రాజేష్‌పై బేబీ లీక్స్‌ బుక్: శిరిన్-preminchoddu director shirin sriram filed case on baby director sai rajesh and release baby leaks book ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baby Movie Controversy: కాపీ కొట్టి బేబి అనే బూతు మూవీ తీశాడు.. సాక్ష్యాలతో సాయి రాజేష్‌పై బేబీ లీక్స్‌ బుక్: శిరిన్

Baby Movie Controversy: కాపీ కొట్టి బేబి అనే బూతు మూవీ తీశాడు.. సాక్ష్యాలతో సాయి రాజేష్‌పై బేబీ లీక్స్‌ బుక్: శిరిన్

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 06:46 AM IST

Baby Movie Controversy Director Shirin Sriram Sai Rajesh: ఆనంద్ దేవరకొండ హిట్ మూవీ బేబి వివాదాల్లో చిక్కుకుంది. తన ఐడియాను కాపీ కొట్టి డైరెక్టర్ సాయి రాజేష్ బేబి సినిమాను తీసినట్లు ప్రేమించొద్దు చిత్రం దర్శకుడు శిరిన్ శ్రీరామ్ ఆరోపించారు. సాక్ష్యాలతో బేబి లీక్స్ బుక్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

కాపీ కొట్టి బేబి అనే బూతు మూవీ తీశాడు.. సాక్ష్యాలతో సాయి రాజేష్‌పై బేబీ లీక్స్‌ బుక్: శిరిన్ శ్రీరామ్
కాపీ కొట్టి బేబి అనే బూతు మూవీ తీశాడు.. సాక్ష్యాలతో సాయి రాజేష్‌పై బేబీ లీక్స్‌ బుక్: శిరిన్ శ్రీరామ్

Anand Deverakonda Baby Movie Controversy: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) కెరీర్‌లో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబి సినిమా (Baby Movie) ఇప్పుడు వివాదస్పదమైంది. తన ఐడియాను కాపీ కొట్టి బేబి తెరకెక్కించారంటూ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రేమించొద్దు (Preminchoddu Movie). శిరిన్ శ్రీరామ్ (Shirin Sriram) దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ (Sai Rajesh) చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను (Baby Leaks Book) మీడియా ముందుంచారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు.

"రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ గారితో ఏడాది ప్రయాణం చేశాను" అని డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ తెలిపారు.

"నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే (సాయి రాజేష్) సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడు" అని శిరిన్ శ్రీరామ్ ఆరోపించారు.

"2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ, నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం" అంటూ బేబి డైరెక్టర్ సాయి రాజేష్‌పై శిరిన్ శ్రీరామ్ ఫైర్ అయ్యారు.

"ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్‌ మాధ్య‌మంలో పీడీఎఫ్ కూడా ఉంది. వెబ్ సైట్ కూడా ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు" అని శిరిన్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

మీడియా సమావేశంలో ప్రేమించొద్దు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ అండ్ టీమ్
మీడియా సమావేశంలో ప్రేమించొద్దు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ అండ్ టీమ్