Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు-preminchoddu teaser 2024 release and supervising producer nikhilesh thogari comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Sanjiv Kumar HT Telugu
May 17, 2024 06:40 AM IST

Preminchoddu 2024 Teaser Released: ప్రేమించొద్దు మూవీ పిల్లలకు తల్లిదండ్రులు చూపించే సినిమా అని సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి చెప్పారు. అలాగే తల్లిదండ్రులకు ప్రతి పిల్లవాడు చూపించే చిత్రంగా ఇది ఉంటుదన్నారు.

పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు
పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Preminchoddu 2024 Teaser Out Now: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’ (Preminchoddu 2024 Movie). శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో ఆ సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

పాన్ ఇండియా చిత్రంగా

పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో ప్రేమించొద్దు సినిమాను నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. అలాగే తెలుగులో విడుదల చేసిన తర్వాత త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం (మే 16) నాడు ప్రేమించొద్దు మూవీ టీజర్‌ను (Preminchoddu Teaser) లాంచ్ చేశారు.

శిరీన్ ఏడ్పించేశాడు

అనంతరం చిత్రయూనిట్ తమ అభిప్రాయాలను తెలిపింది. "నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది" అని సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి అన్నారు.

అలానే గుర్తుండిపోతారు

"కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది" అని నిఖిలేష్ తొగరి తెలిపారు.

ప్రతీ పిల్లవాడు చూపించేలా

"ఈ సినిమా పిల్లలకు ప్రతీ తల్లిదండ్రులు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి" అని ప్రేమించొద్దు సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి చెప్పుకొచ్చారు. "మూవీ చాలా బాగా వచ్చింది. నాకు మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. హీరో, దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు" అని నటి సంతోషి తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు

నటి సోనాలి గర్జె మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్‌గా నటించడమే కాకుండా దర్శకత్వ శాఖలో పని చేశాను. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మూవీ ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా

"షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నాకు ఈ చిత్రంలో మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. మెచ్యూర్డ్ అమ్మాయి, కష్టాల్లో తోడు ఉండే స్నేహితురాలి పాత్రలో కనిపిస్తాను. మా చిత్రం జూన్ 7న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి" అని యాక్ట్రస్ మానస తెలిపారు.

IPL_Entry_Point