OTT Releases: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!-ott movies releases on this friday bujji and bhairava digital premiere amazon prime project z ott aha today ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!

OTT Releases: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!

Sanjiv Kumar HT Telugu
Jun 01, 2024 12:08 PM IST

OTT Movies Releases Friday: ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వచ్చి పడుతుంటాయి. అయితే, కేవలం ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటిలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ బుజ్జి అండ్ భైరవతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.

ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!
ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!

Today OTT Releases: ఎప్పటికప్పుడు ఓటీటీలో డిఫరెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వాటికోసం ఓటీటీ ఆడియెన్స్ కాచుకుని కూర్చుంటారు. అయితే, ఈ వారం ఓటీటీలోకి 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి విడుదల కాగా ఒక్క రోజునే ఏకంగా 10 రిలీజ్ అయ్యాయి.

ఈ శుక్రవారం మే 31న (Friday OTT Release) ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 10 విడుదల అయ్యాయి. అలాగే ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలు సైతం ఉన్నాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31

రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31

లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ చిత్రం)- జూన్ 1

జియో సినిమా ఓటీటీ

దేద్ బిగా జమీన్ (హిందీ మూవీ)- మే 31

లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 31

ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

ఏలీన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 1

బుజ్జి అండ్ భైరవ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మే 31

ప్రాజెక్ట్ జెడ్ (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- మే 31

హౌజ్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- మే 31

పొంబలై ఒరుమై (మలయాళ చిత్రం)- సైనా ప్లే ఓటీటీ- మే 31

జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- మే 31

ఇలా మే 31 అంటే మే నెల చివరిరోజున 10 సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. జూన్ 1 అంటే ఇవాళ రెండు చిత్రాలు మాత్రమే డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఒకటి జపనీస్ మూవీ అయితే, మరొకటి ఇంగ్లీష్ చిత్రం ఏలీన్. ఇక మే 31న స్ట్రీమింగ్‌కు వచ్చినవాటిలో కూడా రెండే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

అవే ప్రభాస్ క్రేజీ మూవీ కల్కి 2898 ఏడీకి ప్రీల్యూడ్‌గా వచ్చిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ బుజ్జి అండ్ భైరవ, సందీప్ కిషన్ నటించిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ. ప్రభాస్ భైరవగా, బుజ్జిగా కీర్తి సురేష్, మరో పాత్రలో బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ బుజ్జి అండ్ భైరవ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సిరీస్‌తో కల్కి 2898 ఏడీ నాటి వరల్డ్ బిల్డింగ్, డిజిటల్ లైఫ్ ఎలా ఉంటుందో ముందే హింట్ ఇవ్వనున్నారు.

ఇక రెండోది ప్రాజెక్ట్ జెడ్. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా కూడా చూడదిగినదే. బుజ్జి అండ్ భైరవ, ప్రాజెక్ట్ జెడ్ ఈ రెండు ఏ మాత్రం మిస్ అవకూడని సినిమా అండ్ సిరీస్.

టీ20 వరల్డ్ కప్ 2024