Kajal Aggarwal: పెళ్లయ్యాకా అలాంటివి అడుగుతారు.. కాజల్ అగర్వాల్‌పై బాలకృష్ణ కామెంట్స్
Balakrishna Comments On Kajal Aggarwal Marriage: కాజల్ అగర్వాల్ పెళ్లిపై, వివాహం అనంతరం సినిమాలో వచ్చే క్యారెక్టర్స్‌పై నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సత్యభామ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కాజల్ అగర్వాల్‌ను ప్రశంసిస్తూ బాలయ్య వ్యాఖ్యలు చేశారు.
Balakrishna Kajal Aggarwal Satyabhama: టాలీవుడ్ చందమామ, క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ. వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ తెలుగులో చేసిన రెండో సినిమా. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
అంతకుమంచి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ రావడం మరింత విశేషంగా మారింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సత్యభామ సినిమా జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే మే 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో భగవంత్ కేసరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే కాజల్ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ట్రైలర్ లాంచ్ వేడుకలో కాజల్ అగర్వాల్‌పై హీరో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
"సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మరి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది" అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
"హీరోయిన్స్‌కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్‌తో నటించాలని ఉండేది. కానీ, ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పని చేయడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. భగవంత్ కేసరిలో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది" అని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు.
"సత్యభామ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్‌లో చూడండి" అని బాలకృష్ణ కోరారు. అలాగే ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "సత్యభామ ఒక మల్టీ ఫోల్డెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు ఎడిటింగ్‌తో పాటు కాజల్ అగర్వాల్‌కు అసిస్టెంట్ రోల్‌లో నటించాను. సుమన్ చిక్కాల డైరెక్టర్ కావాలనే తన కలను ఈ మూవీతో తీర్చుకుంటున్నారు. ఈ టీమ్ నాకొక ఫ్యామిలీ లాంటిది. మా ఫ్యామిలీ మెంబర్స్‌కు సత్యభామ బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అని తెలిపారు.
"బాలకృష్ణ గారు త్వరగా వస్తున్నారని తెలిసి పరుగెత్తుకుంటూ ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఆయన నా కెరీర్ బిగినింగ్‌లో గుంటూరు టాకీస్ సినిమా టైమ్‌లో ఆడియో రిలీజ్‌కు గెస్ట్‌గా వచ్చి నన్ను బ్లెస్ చేశారు. నలభై సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌కు వచ్చారు. సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మాట్లాడుతాను" అని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల అన్నారు.