Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ది బెస్ట్ 6 సినిమాలు.. ఫ్యామిలీతో చూస్తూ ఈ వారం ఎంజాయ్ చేయొచ్చు!-ott netflix top 6 trending movies on this week crew digital premiere laapataa ladies ott atlas movie ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ది బెస్ట్ 6 సినిమాలు.. ఫ్యామిలీతో చూస్తూ ఈ వారం ఎంజాయ్ చేయొచ్చు!

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ది బెస్ట్ 6 సినిమాలు.. ఫ్యామిలీతో చూస్తూ ఈ వారం ఎంజాయ్ చేయొచ్చు!

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 11:35 AM IST

Netflix Trending Movies This Week: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను తన ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. వాటిలో ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేసే ది బెస్ట్ 6 సినిమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ది బెస్ట్ 6 సినిమాలు.. ఫ్యామిలీతో చూస్తూ ఈ వారం ఎంజాయ్ చేయొచ్చు!
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ది బెస్ట్ 6 సినిమాలు.. ఫ్యామిలీతో చూస్తూ ఈ వారం ఎంజాయ్ చేయొచ్చు!

Netflix OTT Trending Movies: ఓటీటీ ప్రేక్షకులు టేస్ట్‌కు తగినట్లుగా విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రీమింగ్ కంటెంట్ తీసుకొచ్చి టాప్ పొజిషన్‌లో ఉంటోంది. హారర్, థ్రిల్లర్, క్రైమ్, ఫాంటసీ, అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ ఇతర జోనర్లతో ఎంటర్టైన్‌మెంట్ అందించే నెట్‌ఫ్లిక్స్ ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాను ఓటీటీ యాప్‌లో చూపించింది.

వాటిలో 6 సినిమాలు ది బెస్ట్‌గా ఉన్నాయి. ఈ ఆరు సినిమాలు ప్రతిదీ ప్రత్యేకమే. అంతేకాకుండా వీటిని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఫ్యామిలీతో సరదాగా గడుపాలనుకునేవారు ఈ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయండి. మరి ఆ సినిమాలు ఏంటో చూస్తే..

క్య్రూ ఓటీటీ

బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్, టబు, కృతి సనన్ కలిసి నటించిన లేడి ఒరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్య్రూ. మార్చి 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. రూ. 75 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 157.08 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ క్య్రూ సినిమా (Crew OTT) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలో రిలీజైన మొదటి రోజు నుంచి క్య్రూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో మొదటి స్థానంలో ఉంటూ సత్తా చాటుతోంది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మల హాట్ అండ్ గ్లామర్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంట్లో ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

లాపటా లేడీస్ ఓటీటీ

బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో లాపటా లేడీస్ ఒకటి. అందరూ కొత్త నటీనటులతో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత మహిళల జీవితాలు ఎలా మారుతాయి, ఎలా ప్రభావితం అవుతాయనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా (Laapataa Ladies OTT) నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

కాగా ఈ సినిమా 4 నుంచి 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 23.29 కోట్లు కలెక్ట్ చేసింది. మహిళల కోసమే ప్రత్యేకంగా తీసిన ఈ సినిమాను కచ్చితంగా ఫ్యామిలీతో చూసేందుకు మంచి ఆప్షన్.

అట్లాస్ ఓటీటీ

హాలీవుడ్ నుంచి రీసెంట్‌గా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ అట్లాస్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 24న డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చింది అట్లాస్ మూవీ (Atlas Movie OTT). ఐఎమ్‌డీబీ 5.6 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే మూడో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ కూడా ఈ వారం మంచి ఎంపికే.

మేడమ్ వెబ్ ఓటీటీ

సోనీ స్పైడర్ మ్యాన్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సూపర్ హీరో మూవీ మేడమ్ వెబ్. రూ. 950 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచింది. డకోటా జాన్సన్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో (Madame Web OTT) మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ మేడమ్ వెబ్‌ టాప్ 4 ట్రెండింగ్‌లో ఉంది.

సైతాన్ ఓటీటీ

అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ ప్లే చేసిన హారర్ మూవీ సైతాన్. మే 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సైతాన్ (Shaitaan OTT) ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతూ టాప్ 5వ స్థానంలో నిలిచింది.

ఆర్టికల్ 370 ఓటీటీ

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, బ్యూటిఫుల్ ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆర్టికల్ 370. ఏప్రిల్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆర్టికల్ 370 సినిమా (Article 370 OTT) ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో ఉంది. ఈ ఆరు సినిమాలను రోజుకోటి చొప్పున ఈ వారం ఫ్యామిలీతో కలిసి చూసేయండి మరి.

టీ20 వరల్డ్ కప్ 2024