OTT: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?-tamil action thriller movie rathnam trending in ott vishal rathnam ott release on amazon prime rathnam digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT: ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 10:30 AM IST

Rathnam Movie OTT Response: విశాల్ హీరోగా చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రత్నం ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా టాప్ 1 ట్రెండింగ్ ఓటీటీ సినిమాగా రికార్డుకెక్కింది. అయితే ఇదే సినిమా థియేటర్లలో మాత్రం యావరేజ్‌గా నిలవడం గమనార్హం.

ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Rathnam OTT Release: యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రత్నం. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వీటి తర్వాత మూడో చిత్రంగా రత్నం సినిమా రావడంతో అభిమానులు, ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ రత్నం సినిమాకు కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేశారు. రత్నం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రత్నంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాకు తెలుగు సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడంతో టాలీవుడ్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక రత్నం మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ప్రశంసించారు. అయితే విడుదలైన తర్వాత సినిమా ఫలితం మాత్రం మరోలా వచ్చింది.

రత్నం సినిమా తెలుగు, తమిళంలో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, రత్నం సినిమా ఏమాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో యావరేజ్‌గా నిలిచింది. అలాంటి రత్నం మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే 23 నుంచి రత్నం మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అది కూడా తెలుగు భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఓటీటీలోకి వచ్చిన రోజు నుంచే రత్నం సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో ఈ యాక్షన్ థ్రిల్లర్ రత్నం ట్రెండ్ అవుతూ కొనసాగుతోంది. థియేటర్లలో దాదాపుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రత్నం సినిమా ఓటీటీలో మాత్రం అన్నింటిని దాటి టాప్‌లో ఉండటం ఆశ్చర్యంగా, విశేషంగా మారింది.

అమెజాన్ ప్రైమ్‌లో రత్నం తర్వాత మడగావ్ ఎక్స్‌ప్రెస్, మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం, హిందీ యాక్షన్ ఫిల్మ్ యోధ, సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్, విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్, హీరో సత్యదేవ్ కృష్ణమ్మ, షాహిద్ కపూర్-కృతి సనన్ తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా వరుసగా ఉన్నాయి.

వీటిలో మలయాళంలో సుమారు వంద కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆవేశం సినిమాను దాటి రత్నం ముందంజలో ఉండటం విశేషంగా మారింది. అలాగే హిందీలో సూపర్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన మడగావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాను కూడా వెనక్కి నెట్టడం మరో ఇంట్రెస్టింగ్ విషయం.

ఇదిలా ఉంటే, రత్నం సినిమాలో హీరో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేసింది. ఇంకా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమెడియన్ యోగిబాబు, మురళి శర్మ, సముద్ర ఖని, హరీష్ పేరడి, రాజేంద్రన్, వీటీవీ గణేష్, ఢిల్లీ గణేష్, నటి తులసి, గణేష్ వెంకట్రామన్, జయప్రకాష్, మోహన్ రమన్, జీవా రవి ఇతర పాత్రల్లో నటించారు.

Whats_app_banner