OTT Time Travel Movie: టైమ్ ట్రావెల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ- ఓటీటీలోకి వచ్చిన న్యూ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ-telugu scientific time travel movie aarambham ott streaming on etv win aarambham digital premiere mohan bhagat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Time Travel Movie: టైమ్ ట్రావెల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ- ఓటీటీలోకి వచ్చిన న్యూ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ

OTT Time Travel Movie: టైమ్ ట్రావెల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ- ఓటీటీలోకి వచ్చిన న్యూ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 02:32 PM IST

Aarambham OTT Streaming Now: తెలుగులో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా టైమ్ ట్రావెల్, లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ఆరంభం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా 13 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. మరి అదిరిపోయే ట్విస్టులు ఉన్న ఈ ఆరంభం సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదని చూస్తే..

టైమ్ ట్రావెల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ- ఓటీటీలోకి  వచ్చిన న్యూ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ
టైమ్ ట్రావెల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ- ఓటీటీలోకి వచ్చిన న్యూ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ

Aarambham OTT Release: తెలుగులో సైన్స్ ఫిక్షన్, సైంటిఫిక్, టైమ్ ట్రావెల్ వంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో నూతన దర్శకనిర్మాతలు సరికొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని మాత్రం ఫట్టుమంటున్నాయి.

పెద్ద హీరోలకే

కథ బాగుండి, టెక్నికల్ అంశాలు బాగున్నప్పటికీ కొన్ని చిత్రాలు ఏదో కారణాలతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోతున్నాయి. ప్రమోషన్స్ సరిగా లేకనో.. థియేటర్స్ అంటే పెద్ద హీరోలకే అనే భావన తెలుగు ప్రేక్షకుల్లో ఉండటం వల్లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తెలుగు చిత్రాలకు థియేటర్లలో ఆదరణ కరవు అవుతోంది.

ప్రయోగాత్మక చిత్రం

అలాంటి సినిమాలకు మంచి వేదికగా ఓటీటీలు మారాయి. అందుకే థియేట్రికల్ రిలీజ్‌కు వారం, పది, నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలను దించేస్తున్నారు. అలా తాజాగా పదమూడు రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది ప్రయోగాత్మక తెలుగు చిత్రం ఆరంభం. లూప్ సిద్ధాంతం, టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సైంటిఫిక్ సినిమా మే 10న థియేటర్లలో విడుదలైంది.

తెలియకుండా పోయింది

ఈ సినిమాకు దాని స్టాండర్డ్స్‌ను బట్టి ప్రమోషన్స్ చేసిన ఆడియెన్స్‌కు పెద్దగా రీచ్ కానట్టు తెలుస్తోంది. అందుకే థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది.. పోయింది పెద్దగా తెలియకుండా పోయింది. అదిరిపోయే ట్విస్టులతో ఊహించని కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలోకి

తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్‌లో మే 23 అంటే గురువారం అర్థరాత్రి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది ఆరంభం సినిమా. ఈ సినిమాలో మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏవీటీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు.

డిటెక్టివ్ రోల్స్

సైంటిఫిక్, టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ జోడించి ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆరంభంతోనే అజయ్ నాగ్ వి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఇక కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ భగత్ ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. ఇక ప్రముఖ నటుడు రవీంద్ర విజయ్, భూషణ్ కల్యాణ్ ఇందులో డిటెక్టివ్స్ రోల్స్ చేశారు.

ఎలా తప్పించుకున్నాడు

ధూత, మంగళవారం, కీడా కోలా, ఇష్క్, యాంగర్ టేల్స్ వంటి సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీసులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆరంభం సినిమా కథ విషయానికొస్తే.. జైలులోని ఓ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు అనే అంశం చుట్టూ సాగుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీ వాడిన టెక్నిక్స్ హైలెట్‌గా ఉంటాయని తెలుస్తోంది.

కన్నడ నవల ఆధారంగా

ఒక ఊరిలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్, మరోవైపు తప్పించుకున్న ఖైదీని పట్టుకునేందుకు డిటెక్టివ్స్ చేసే ఇన్వెస్టిగేషన్‌ ఎమోషనల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ మూవీని నీను నిన్నొలాగే ఖైదీ అనే కన్నడ నవల ఆధారంగా తెరకెక్కించారు.

Whats_app_banner