Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు 440 కోట్ల నష్టం- ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకోని వెబ్ సిరీస్- డబ్బుతో కార్లు కొన్న డైరెక్టర్-netflix ott spent rs 440 cr on conquest web series but still not completed one episode director carl rinsch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు 440 కోట్ల నష్టం- ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకోని వెబ్ సిరీస్- డబ్బుతో కార్లు కొన్న డైరెక్టర్

Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు 440 కోట్ల నష్టం- ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకోని వెబ్ సిరీస్- డబ్బుతో కార్లు కొన్న డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 02:21 PM IST

Netflix Spent 440 Crores On Conquest: ఒక్క వెబ్ సిరీస్ కోసం ఏకంగా 440 కోట్లు ఖర్చు చేసింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. అయినా కూడా ఆ టీవీ షోకు సంబంధించి ఇంకా ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేయలేకపోయింది. మరి ఆ టీవీ షో, నెట్‌ఫ్లిక్స్‌కు నష్టమెంతో అనే వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్‌కు 440 కోట్ల నష్టం- ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకోని వెబ్ సిరీస్- డబ్బుతో కార్లు కొన్న డైరెక్టర్
నెట్‌ఫ్లిక్స్‌కు 440 కోట్ల నష్టం- ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకోని వెబ్ సిరీస్- డబ్బుతో కార్లు కొన్న డైరెక్టర్

Netflix Spent 440 Crores On Conquest Web Series: ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్‌ చూసే వీక్షకులు ఎక్కువైపోయారు. దాంతో ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. విభిన్నమైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఉత్తమమైన, అతిపెద్ద ప్రాజెక్ట్‌లను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాయి.

బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే, ప్రతిసారీ తాము అనుకున్నట్లుగా వెబ్ సిరీలు, సినిమాలను తెరకెక్కించలేవు ఓటీటీలు. ఓసారి ఖర్చు అమాంతం పెరిగిపోవచ్చు. అయినా కూడా అనుకున్నట్లుగా షూటింగ్, అవుట్ పుట్ రాకపోవచ్చు. అలా సరిగా అవుట్ పుట్ రాక ఓ టీవీ షోకు నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 440 కోట్లు ఖర్చు చేసింది.

న్యూయార్క్ టైమ్స్ కొత్త నివేదిక ప్రకారం 2018లో సైన్స్ ఫిక్షన్ డ్రామా కాంక్వెస్ట్ అనే సైన్స్ ఫిక్షన్ టీవీ షోను ప్రారంభిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. దాంతో ఈ వెబ్ సిరీస్ హైలెట్‌ అవడమే కాకుండా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ కోసం ఇప్పటివరకు ఏకంగా 55 మిలియన్ డాలర్లు (రూ. 440 కోట్లు) నెట్‌ఫ్లిక్స్ ఖర్చు చేసిందని ఎన్‌వైటీ సంస్థ నివేదించింది.

ఈ వెబ్ సిరీస్ ఖర్చు కోసం అంత మొత్తాన్ని దర్శకుడు కార్ల్ రిన్స్చ్‌కు ఇచ్చేసినట్లు తెలిపింది. అయితే, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను రిన్ష్ వంటి కొత్త డైరెక్టర్‌కు నెట్‌ఫ్లిక్స్ అప్పగించడం పట్ల సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ రిన్స్చ్ ఈ కాంక్వెస్ట్‌ వెబ్ సిరీస్‌కు ముందు కేవలం ఒకే ఒక సినిమాను డైరెక్టర్ చేశాడు. అదే 47 రోనిన్.

హాలీవుడ్ యాక్షన్ హీర్, జాన్ విక్ ఫేమ్ కీను రీవ్స్ నటించిన ఈ 47 రోనిన్ సినిమాను 175 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అంతటి బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మొత్తంగా 151.8 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే, కాంక్వెస్ట్ వెబ్ సిరీస్ ప్రారంభానికి ముందు తన విచిత్రప్రవర్తనతో డైరెక్టర్ కార్ల్ రిన్స్చ్ వార్తల్లో నిలిచాడు. దాంతో అతనిపై దర్శకత్వంపై అందరికీ అనుమానం మొదలైంది.

అలా షో ప్రారంభ సమయంలో కొన్ని వారాల షెడ్యూల్ వెనుకపడిపోయింది. అంతేకాకుండా కోవిడ్-19 సమయంలో కార్ల్ రిన్స్చ్ క్రూరమైన కుట్ర సిద్ధాంతాలతో అపఖ్యాతి పాలయ్యాడు. అప్పుడు, దర్శకుడు విడాకుల కేసులో చిక్కుకున్నాడు. అందులో అతను తన భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నాడు. అలా వరుస వివాదాలతో సతమతమైన కార్ల్‌పై కాంక్వెస్ట్ మిగతా యూనిట్ నెట్‌ఫ్లిక్స్‌కు ఫిర్యాదు చేసింది.

దాంతో ఈ స్ట్రీమింగ్ దిగ్గజం చివరికి ఆ ప్రాజెక్ట్‌ నుంచి కార్ల్‌ను తీసేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంక్వెస్ట్‌కు 440 కోట్లు ఖర్చు అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క ఎపిసోడ్‌ కూడా పూర్తి కాలేదు. కాగా ఈ సిరీస్ కోసం కార్ల్ రిన్స్చ్ రూ. 90 కోట్ల పారితోషికం అందుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఆ డబ్బును డైరెక్టర్ కార్ల్ డాగ్‌ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు NYT తెలిపింది.

ఆ పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో రిన్స్చ్ ఐదు రోల్స్ రాయిస్ కార్లు, ఒక ఫెరారీ, ఫర్నిచర్ అండ్ డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే రిన్స్చ్, నెట్‌ఫ్లిక్స్ మద్య వివాదం కొనసాగుతోంది. అతను ఇప్పటికీ $14 మిలియన్లు (రూ. 115 కోట్లు) నెట్‌ఫ్లిక్స్‌కు బకాయిపడ్డాడు.

టీ20 వరల్డ్ కప్ 2024