Aarambham: ఆ సినిమాలన్నీ ఓటీటీలోకే.. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లతో ఆరంభం: నటుడు రవీంద్ర విజయ్
Aarambham Trailer Launch: సైన్స్ ఫిక్షన్, క్రైమ్, సస్పెన్స్ ఇలా అన్ని జోనర్లతో తెరకెక్కిన సినిమాగా వస్తోంది ఆరంభం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమాపై నటుడు రవీంద్ర విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Ravindra Vijay About Aarambham: మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన "ఆరంభం" సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
మే 1న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని నటీనటులందరూ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
"నవలను బేస్ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టిన సినిమాలు తప్పకుండా బాగుంటాయి. ఆరంభం సినిమాకు మా డైరెక్టర్ అజయ్ కథా కథనాల మీద అలాంటి గుడ్ వర్క్ చేశాడు. ఈ మూవీలో నేను డిటెక్టివ్ క్యారెక్టర్లో కనిపిస్తాను" అని పపులర్ యాక్టర్ రవీంద్ర విజయ్ తెలిపారు.
"ఈ మూవీలోని ప్రతి క్రాఫ్ట్ పనితనం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కంప్లీట్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే సినిమా ఇది. డ్రామా, సస్పెన్స్, హ్యూమన్ ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ వంటి అంశాలు మెప్పిస్తాయి. మే 10న థియేటర్స్ కు వెళ్లి ఆరంభం మూవీని ఎంజాయ్ చేయండి" అని రవీంద్ర విజయ్ అన్నారు.
"మనం లాక్ డౌన్ టైమ్‌లో చిన్న సినిమాలన్నీ ఓటీటీకి వస్తాయి. పెద్ద సినిమాలు థియేటర్స్‌లో చూడాలి అనుకున్నాం. కానీ, ఈ ఏడాది మీరు గమనిస్తే చాలా చిన్న సినిమాలు కంటెంట్ బాగున్నవి థియేటర్‌లో మంచి వసూళ్లు సాధించాయి. ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుంది" అని రవీంద్ర విజయ్ థియేటర్లలోను చిన్న సినిమాలు ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
"ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ గారికి, ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయినప్పుడు అంతా కొత్త వాళ్లు ఎలా ఉంటుందో షూటింగ్ అనుకున్నా. కానీ ఫిలిం మేకింగ్ లో వాళ్ల పట్టుదల, ప్యాషన్ చూసి నేను హ్యాపీగా ఫీలయ్యా. మంచి సినిమా ఇది. ఈ సినిమాకు మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా" నటి సురభి ప్రభావతి అన్నారు.
"ఆరంభం సినిమాకు పనిచేసిన వాళ్లలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నా రూమ్ మేట్స్ ఉన్నారు. ఈ టీమ్‌లో ఎవరూ ఏ ఒక్క పనికీ పరిమితం కాలేదు. అందరం అన్ని విభాగాల్లో పనిచేశాం. టీమ్ వర్క్ చేశాం. ఆరంభంలో నాకు రవీంద్ర విజయ్ గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది. మీరంతా ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. సక్సెస్ చేయండి" అని నటుడు అభిషేక్ బోడెపల్లి తెలిపారు. అన్నారు.
టాపిక్