OTT Crime Thriller: ముఖాలను గుర్తు పట్టని వ్యాధి.. ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?
Prasanna Vadanam OTT Streaming: ఓటీటీలోకి ప్రసన్నవదనం సినిమా వచ్చేసింది. ముఖాలను గుర్తు పట్టని వ్యాధి (ఫేస్ బ్లైండ్‌నెస్) వంటి సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ప్రసన్నవదనం మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి సుహాస్ నటించిన ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూడాలంటే..
Prasanna Vadanam OTT Release: ఓటీటీలో వచ్చే డిఫరెంట్ కంటెంట్ వీక్షించేందుకు మూవీ లవర్స్ ఎప్పటికప్పుడు కాచుకుని కూర్చుంటారు. అలాంటి వారికోసం ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ వచ్చేస్తూనే ఉంటుంది. ఇంతకుముందు ఎక్కువగా మలయాళం, హాలీవుడ్ చిత్ర పరిశ్రమల నుంచి సినిమాలు వచ్చేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.
విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, హారర్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, సర్వైవల్ వంటి జోనర్లలో తెలుగు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడని వారుండరు. ఒక క్రైమ్ చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్, పాత్రలు ప్రవర్తించే తీరుతో ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతుంటాయి.
వాటిని ఎంత విభిన్నంగా తెరకెక్కిస్తే అంతగా వర్కౌట్ అవుతాయి. అలా ఇటీవల తెలుగులో వచ్చి మంచి సూపర్ హిట్ కొట్టిన సినిమా ప్రసన్నవదనం. యంగ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన ఈ యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మే 3న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. టెక్నికల్‌గా కొన్ని నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఓవరాల్‌గా సినిమాకు మంచి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది.
ఈ ప్రసన్నవదనం సినిమాతో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె దర్శకత్వం వహించారు. అంటే ఈ మూవీతోనే ఆయన తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇక ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా నటించారు.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసన్నవదనం మే 23 నుంచి అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను ఆహా సబ్‌స్క్రైబర్స్ చూడలేరు. కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు మాత్రమే చూసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే అధికారికంగా మే 24 నుంచి ఓటీటీలోకి రానున్న ఈ సినిమాను ఒక రోజు ముందే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్ డిజిటల్ ప్రీమియర్ చేశారు.
కాబట్టి ఆహా గోల్డ్ వాళ్లు ఇప్పుడే చూడొచ్చు. కానీ, సాధారణ ఆహా సబ్‌స్క్రైబర్స్ మాత్రం ఇంకా ఒక రోజు ఆగాల్సిందే. ఇకపోతే ప్రసన్నవదనం సినిమా థియేట్రిలక్ రిలీజ్ తర్వాత 20 రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. సుహాస్ చిత్రాల్లో ఇది కూడా ఒక స్పెషల్ మూవీగా నిలిచింది.
కాగా మొహాలు గుర్తు పట్టని వ్యాధితో (ఫేస్ బ్లైండ్‌నెస్) హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రసన్నవదనం తెరకెక్కించారు. సినిమాలో నటీనటులందరీ యాక్టింగ్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా రాశి సింగ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. మరోసారి తన నటనతో మెప్పించాడట సుహాస్. అయితే, రిపీటెడ్ లొకేషన్స్‌లో సినిమా చిత్రీకరణ ఉండటంతో టెక్నికల్ పరంగా మైనస్ అని రివ్యూలు వచ్చాయి.
Prasanna Vadanam OTT Streaming: ఇకపోతే.. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మౌత్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న సుహాస్ సినీ కెరీర్‌లో ప్రసన్నవదనం కూడా ఒక డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 7 రోజుల్లోనే రూ. 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చినట్లు సమాచారం.