OTT Trending: 950 కోట్ల బడ్జెట్.. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-super hero movie madame web ott trending in netflix madame web ott release ott movies dakota johnson 950 cr flop movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending: 950 కోట్ల బడ్జెట్.. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Trending: 950 కోట్ల బడ్జెట్.. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 25, 2024 10:41 AM IST

OTT Trending Movie Madame Web: ఓటీటీ టాప్‌లో దూసుకుపోతోంది రూ. 950 కోట్ల డిజాస్టర్ మూవీ మేడమ్ వెబ్. సూపర్ హీరో జోనర్‌లో వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు చీదరించుకున్నారు. కానీ ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. మరి ఈ మేడమ్ వెబ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడని చూస్తే..

950 కోట్ల బడ్జెట్.. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
950 కోట్ల బడ్జెట్.. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Madame Web OTT Streaming: సినిమాల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమాత్రం అంచనా వేయలేం. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్స్‌గా మారుతాయి. లక్షల్లో రూపొందిన సినిమాలు కోట్లల్లో కలెక్షన్స్ తీసుకొస్తుంటాయి. ఇక ఈ మధ్య ఓటీటీల హవా పెరగడంతో థియేటర్ ప్లాప్ సినిమాలు సైతం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

థియేటర్లలో ప్రేక్షకులు చీదరించుకున్న సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అలాగే థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఓటీటీలో యావరేజ్‌గా మిగులుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సినిమాల ఫలితం ఎందులో ఎలా ఉంటుందో ఊహించలేకుండాపోయింది. దీనికి ఉదాహరణగా తాజాగా మరో మూవీ నిలిచింది. అదే మేడమ్ వెబ్ సినిమా (Madame Web Movie).

సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలు మనం ఎన్నో చూశాం. ఈ కాన్సెప్ట్‌తో ఇటీవల తెలుగులో హనుమాన్ (Hanuman Movie) వచ్చి బీభత్సం సృష్టించింది. కానీ, హాలీవుడ్‌లో ఈ సూపర్ హీరో మూవీస్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వీటిని మార్వెల్ (Marvel), డీసీ (DC) సంస్థలు తెరకెక్కిస్తుంటాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe/MCU), డీసీ సినిమాటిక్ యానివర్స్‌లో అనేక సూపర్ హీరో, సూపర్ వుమెన్ చిత్రాలు వచ్చి అలరించాయి.

ఇవే కాకుండా హాలీవుడ్‌లో మరో సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉంది. అదే సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ (Sony Spider-Man Universe). ఇందులో కేవలం స్పైడర్ మ్యాన్‌కు సంబంధించిన సినిమాలు మాత్రమే తెరకెక్కిస్తుంటారు. అలా రూపొందిందే మేడమ్ వెబ్ మూవీ. అయితే, ఈ సినిమాను కొలంబియా పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

ఫిబ్రవరి 16న మేడమ్ వెబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సుమారు 80 నుంచి 100 మిలియన్ డాలర్లు, అన్ని ఖర్చులతో చూసుకుంటే దాదాపుగా 115 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా అతి తక్కువ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. మొత్తంగా ఈ మూవీ 10.03 కోట్ల యూఎస్ డాలర్స్ మాత్రమే రాబట్టగలిగింది.

అంటే, 950 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే ఈ సినిమాకు దారుణమైన మౌత్ టాక్ వచ్చింది. సోనీ స్పైడర్ యూనివర్స్‌లో మోర్బియస్ మూవీ (Morbius Movie) దారుణమైన సినిమాగా అభివర్ణించారు. దానికంటే ఘోరమైన సినిమాగా మేడమ్ వెబ్ అని రివ్యూలు వచ్చాయి. మోర్బియస్‌కు 5.1 ఐమ్‌డీబీ రేటింగ్ ఉంటే.. మేడమ్ వెబ్‌కు 3.9 రేటింగ్ ఉంది.

ఇలా థియేటర్లలో చీదరించుకున్న మేడమ్ వెబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో (Madame Web OTT) అదరగొడుతోంది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో (Netflix OTT) స్ట్రీమింగ్ అవుతోన్న మేడమ్ వెబ్ టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచింది. ఓటీటీ రిలీజ్‌కు వచ్చినప్పటినుంచి ఈ సినిమా నెంబర్ 2 స్థానంలో టాప్‌లో ఉంటోంది. మొదటి స్థానంలో లపాటా లేడీస్ నిలుస్తోంది.

మేడమ్ వెబ్ నెట్‌ఫ్లిక్స్‌లోనే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) కూడా ప్రసారం అవుతోంది. అయితే ఇక్కడ రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. కాగా మేడమ్ వెబ్ మూవీలో డకోటా జాన్సన్ (Dakota Johnson), సిడ్నీ స్వీనీ, ఇసబెల్లా మెర్సెడ్, సెలెస్టే ఒకానర్, ఇమ్మా రాబర్ట్స్, ఆడమ్ స్కాట్ ఇతరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎస్‌జే క్లార్కన్స్ దర్శకత్వం వహించారు. లారెంజో డీ బోనావెంచురా నిర్మాతగా వ్యవహరించారు.

Whats_app_banner