X Movie Review: ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్ మూవీ రివ్యూ.. భార్యాభర్తల ముందు సెక్స్ సినిమాలు తీస్తే?-x movie review in telugu ott horror crime thriller x movie ott streaming amazon prime ott movies x review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  X Movie Review: ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్ మూవీ రివ్యూ.. భార్యాభర్తల ముందు సెక్స్ సినిమాలు తీస్తే?

X Movie Review: ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్ మూవీ రివ్యూ.. భార్యాభర్తల ముందు సెక్స్ సినిమాలు తీస్తే?

Sanjiv Kumar HT Telugu
May 24, 2024 11:12 AM IST

X Movie Review In Telugu: ఓటీటీలో క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ ఈ మధ్య కాలంలో స్పెషల్‌గా మారింది. 2022లో వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వికృత వృద్ధ జంట (భార్యాభర్తలు) ముందు సెక్స్ సినిమాలు తీసిన ఆరుగురి పరిస్థితి ఏమైందో ఎక్స్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

ఓటీటీ హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్ మూవీ రివ్యూ.. వికృత ముసలి జంట ముందు సెక్స్ సినిమాలు తీస్తే?
ఓటీటీ హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్ మూవీ రివ్యూ.. వికృత ముసలి జంట ముందు సెక్స్ సినిమాలు తీస్తే?

X Movie Review Telugu: ఓటీటీలోకి అనేక సినిమాలు వచ్చి పడుతుంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రైమ్, హారర్ థ్రిల్లర్ సినిమాలను ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది క్రైమ్ హారర్ థ్రిల్లర్ అంశాలతో వచ్చిన ఓ సినిమా ఇప్పుడు స్పెషల్‌గా మారింది. ఆ మూవీ పేరే ఎక్స్ (X Movie 2022).

2022 సంత్సరంలో మార్చి 18న అమెరికాలో విడుదలైన ఈ సినిమా బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. టి వెస్ట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఐమ్‌డీబీ పదికి 6.5 రేటింగ్ ఇచ్చింది. సుమారు వన్ మిలియన్ డాలర్ల (రూ. 8.22 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 1.51 కోట్ల యూఎస్ డాలర్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి హారర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ ఎక్స్ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి సెక్స్ సినిమాలు (పోర్న్ చిత్రాలు) తెరకెక్కించి బాగా ఫేమస్ అవ్వాలని, డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అందుకోసం సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లోకి అద్దెకు దిగుతారు. ఆ ఇల్లు వికృతంగా కనిపించే ఓ వృద్ధ జంటది. అద్దెకు దిగడంతోనే ఇంట్లో పోర్న్ సినిమాలు చిత్రీకరించడం మొదలు పెడతారు.

అయితే ఇంటి ఓనర్ అయిన వృద్ధురాలికి సెక్స్ పిచ్చి. వయసు, గుండె సమస్య సహకరించకపోవడంతో లైంగిక చర్యకు ఆమె భర్త ఒప్పుకోడు. అలాంటి సమయంలో ఈ యువకుల జంట సెక్స్ సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తారు. ఆ షూటింగ్ అంతా ఆ పండు ముసలావిడ చూస్తుంది. ఆ తర్వాత పోర్న్ సినిమాలు తీసే బ్యాచ్‌లో ఒక్కొక్కరిని ఆ వృద్ధ జంట చంపడం మొదలుపెడుతుంది.

ట్విస్టులు

అద్దెకు వచ్చిన వాళ్లను ఆ వృద్ధ జంట ఎందుకు చంపుతుంది? అసలు నడవటానికే అవస్థలు పడే వాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నవాళ్లను ఎలా చంపారు? ఏ విధంగా హత్య చేశారు? అసలు ఆ వృద్ధ జంట కథేంటీ? పోర్న్ సినిమా బ్యాచ్ నుంచి ఎవరైనా తప్పించుకున్నారా? అనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా ఎక్స్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఓ ఇంట్లో వరుస డెడ్ బాడీలు ఉండటం, ఆ హత్యలు ఎలా జరిగాయో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశంతో ఎక్స్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇదొక కొద్దిపాటి హార్రిఫిక్ అంశాలు మిక్స్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. పోర్న్ సినిమాలు తీయాలనుకునే పాత్రల పరిచయం, వారి గోల్ ఏంటో చెబుతూ సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత సిటీలోకి ప్రవేశించడం, అక్కడ వృద్ధ జంట ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలు అవుతుంది.

సెక్స్ సీన్స్-రక్తపాతం

పోర్న్ సినిమాలు చిత్రీకరించడం, వారిని అనుమానాస్పదంగా ఇంటి ఓనర్ గమనించడం థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇక పోర్న్ బ్యాచ్‌లోని లవ్ రిలేషన్‌షిప్, సెక్స్‌కి లవ్‌కి మధ్య వ్యత్యాసం చెబుతూ ఒకట్రెండు సీన్స్ ఉన్నాయి. వాళ్లందరినీ వృద్ధ జంట చంపే తీరు ఆకట్టుకుంటుంది. వారు ఏమాత్రం తప్పించుకోని విధంగా ప్లాన్ చేసి చంపుతారు. ఓవరాల్‌గా సినిమాలో సెక్స్ సీన్స్, క్రైమ్, రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. ఒకట్రెండు ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి.

వృద్ధురాలిలో సెక్స్ కోరికలు

సినిమా విజువల్స్ బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తగినట్లుగా సినిమాటోగ్రఫీ ఉంది. ముఖ్యంగా ఈ కథంతా 70స్‌లో జరిగినట్లు చూపించారు. దానికితగినట్లుగా విజువల్స్ ఉన్నాయి. బీజీఎమ్ కూడా బాగుంది. కాకపోతే ఇంట్లో అందరిని చంపడం వంటి సినిమాలు ఇదివరకు చాలానే వచ్చాయి. కానీ ఈ స్టోరీ మాత్రం డిఫరెంట్. వృద్ధురాలిలో సెక్స్ కోరికలు ఉండటం, సైకోగా మారి ఇతరులను చంపడం కాస్తా కొత్త కాన్సెప్టే. సాంకేతిక అంశాలు బాగానే ఉన్నాయి.

పోర్న్ కంటెంట్

X Movie Explained In Telugu: ఫైనల్‌గా చెప్పాలంటే సుమారు 2 గంటల పాటు ఉన్న క్రైమ్ థ్రిల్లర్‌ను టైమ్ పాస్‌కి చూడొచ్చు. కానీ ఫ్యామిలీతో ఏమాత్రం చూడలేం. సినిమాలో పోర్న్ కంటెంట్ చాలా ఉంటుంది. కాబట్టి, ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడటం బెటర్.

టీ20 వరల్డ్ కప్ 2024