NNS November 11th Episode: పిల్లలను మోసం చేసిన రాథోడ్.. భాగీని తీసుకొచ్చేందుకు ఒప్పుకున్న అమర్.. కిందపడిపోయిన మనోహరి-nindu noorella saavasam serial november 11th episode amar agree to bring back bhagi zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 11th Episode: పిల్లలను మోసం చేసిన రాథోడ్.. భాగీని తీసుకొచ్చేందుకు ఒప్పుకున్న అమర్.. కిందపడిపోయిన మనోహరి

NNS November 11th Episode: పిల్లలను మోసం చేసిన రాథోడ్.. భాగీని తీసుకొచ్చేందుకు ఒప్పుకున్న అమర్.. కిందపడిపోయిన మనోహరి

Sanjiv Kumar HT Telugu
Nov 11, 2024 06:41 AM IST

Nindu Noorella Saavasam November 10th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 11 ఎపిసోడ్‌‌లో ఇంట్లో టిఫిన్స్ చూసి బాగా లేదని పిల్లలు సెటైర్లు వేస్తారు. స్కూల్‌కు వెళ్లేదారిలో బయట టిఫిన్ చేయాలని అనుకుంటారు. తర్వాత భాగీని ఇంటికి తీసుకొచ్చేందుకు అమర్ ఒప్పుకుంటాడు. అది విని కిందపడిపోతుంది మనోహరి.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 11th November Episode)లో భాగీ లేని లోటు ఇంట్లో అందరిలోనూ కనిపిస్తుందని బాధపడుతుంది అరుంధతి. మరోవైపు ఎలాగైనా అమర్​ని మార్చి భాగీని తిరిగి తీసుకువచ్చేలా చేయాలనుకుంటాడు శివరామ్​. పిల్లలు మాత్రం మిస్సమ్మను తీసుకు రావాల్సిన అవసరం లేదని అంటారు.

వంట బాగోలేదని

దాంతో నిర్మల, శివరామ్​ బాధపడతారు. ఉదయాన్నేటిఫిన్‌ చేయడానికి కిందకు వచ్చిన పిల్లలు ఇడ్లీలు, చట్నీ చూసి భయపడిపోతారు. అసలు ఇవి ఇడ్లీలేనా..? అసలు ఇది చట్నీ కాదు సాంబారు లాగా ఉందని సెటైర్లు వేస్తుంటే.. నిర్మల తిడుతుంది. ఇన్నాళ్లు మిస్సమ్మ చేతి వంట తిని ఇప్పుడు నా చేతి వంట బాగాలేదని పేర్లు పెడుతున్నారా..? అంటుంది. దీంతో పిల్లలు వెంటనే స్కూల్‌‌కు వెళ్ధామని మధ్యలో టిఫిన్‌ చేసి వెళ్దామని ప్లాన్‌ చేస్తారు.

అమర్‌ రాగానే స్కూల్‌‌కు టైం అవుతుందని అంటారు. అమర్‌ రాథోడ్‌ను పిలిచి పిల్లలను స్కూల్‌లో వదిలేసిరా అని చెప్తాడు. అలాగేనని బయటకు వెళ్లగానే పిల్లలు మంచి టిఫిన్‌ సెంటర్‌ దగ్గర ఆపమని అడుగుతారు. సరేనని డైరెక్టుగా స్కూల్‌‌కు తీసుకెళ్తాడు రాథోడ్. నేను చెప్పానా.. స్కూల్ వచ్చే వరకు ఈ రాథోడ్ కారు అపడని.. నేను చెప్పానా..? అంటుంది అంజు.

ఆకలితో ఉండనిస్తుందా

రాథోడ్‌ నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నీవల్ల ఇవాళ మేము అంతా ఆకలితో ఉండాలి అంటుంది అమ్ము. పిల్లలు ఆగండి.. మిస్సమ్మ ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తుందా..? అదే నేను ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తానా..? మీరు లోపలికి వెళ్లి క్లాస్‌ రూంలో బ్యాగ్స్ పెట్టే లోపు నేను వెళ్లి టిఫిన్స్ పార్శిల్ తీసుకుని వస్తాను అంటాడు రాథోడ్​. నువ్వు కనక టైంకి రాకపోతే.. అంటాడు ఆనంద్​.

వెళ్లేటప్పుడు మేము నలుగురం కలిసి నాలుగు లాంగ్వేజ్‌‌ల్లో ఒక్కటే సినిమా చూపిస్తాము అంటాడు ఆకాష్. దాంతో రాథోడ్ వెళ్లిపోతాడు. పోతూ పోతూ గేటు దగ్గర రామ్మూర్తికి సైగ చేసుకుంటూ వెళ్లిపోతాడు.

స్కూల్‌లోకి వచ్చిన రామ్మూర్తి టిఫిన్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయడానికి ప్రత్నిస్తుంటాడు. చేతికి దెబ్బ తగిలించుకుంటాడు. పిల్లలు పరుగెత్తుకొచ్చి తాతయ్యా ఏమైంది తాతయ్యా.. అంటారు.

బాక్స్‌ తీస్తుంటే వేలు నలిగింది అంటాడు రామ్మూర్తి. చూసుకుని తీయాలి కదా..? అయినా మీకు రానప్పుడు ఎవరి సాయం అయినా తీసుకోవాలి కదా..? అంటాడు ఆకాష్. స్కూల్‌‌లో ఈ ముసలోడికి ఎవరు సాయం చేస్తారు బాబు అని రామ్మూర్తి చెప్పగానే అమ్ము బాక్స్‌ ఓపెన్ చేస్తుంది. అందులో వెజిటేబుల్‌ ఉప్మా చూసి నా పేవరేట్‌ ఉప్మా అనగానే.. రామ్మూర్తి ఎవరి ఫేవరేట్‌ ఫుడ్‌ వాళ్లకు ఇస్తాడు.

పిల్లలపై భాగీ ఆరా

అందరూ బాక్సులు ఓపెన్‌ చేసి ఆశగా చూస్తుంటారు. అంజలి వద్దని చెప్తున్నా.. ముగ్గురు కలిసి తింటుంటే అంజు కూడా తింటుంది. చాటు నుంచి చూసిన రాథోడ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. రామ్మూర్తి భాగీకి ఫోన్‌ చేస్తాడు. నాన్న పిల్లలు తిన్నారా..? టిఫిన్స్ నచ్చాయంటనా..? వాళ్లు ఎలా ఉన్నారు. రాత్రి బాగా పడుకున్నారటన అని అడుగుతుంది భాగీ.

అమ్మా భాగీ నీ పిల్లలు చాలా బాగా ఉన్నారమ్మ. కడుపునిండా మనఃస్పూర్తిగా తిన్నారు. నీ లాగే వాళ్లు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు అమ్మ. బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ, ముఖంలో కనిపిస్తున్నాయి. అమ్మా.. నీ పిల్లలు తినేశారు అమ్మా.. నువ్వు రాత్రి కూడా తినలేదు. ఇప్పుడైనా తిను తల్లి అని రామ్మూర్తి చెప్పగానే భాగీ సరే అంటుంది.

మరోవైపు అమర్‌ గార్డెన్‌‌లో కూర్చుని ఏదో భాగీ గురించి ఆలోచిస్తుంటాడు. ఆరు.. అమర్‌‌నే గమనిస్తుంది. మిస్సమ్మ లేదని మా ఆయన బాగా బాధపడుతున్నట్టున్నారు. ఆయన అలా ఫీలవుతుంటే చూడలేకపోతున్నాను అంటుంది అరుంధతి. బాలిక.. అని గుప్త పిలవగానే.. ఏంటి గుప్త గారు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అంటుంది.

ఇలా చూడలేకపోతున్నాను

అవును బాలిక ఆ బాలిక ఉన్నన్ని రోజులు నువ్వు ఇంట్లోకి వెళ్లుటకు భయపడితివి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరికి నువ్వు కనబడవు కదా..? ఇంకెందుకు ఇక్కడి నుంచి చూస్తున్నావు అంటాడు గుప్త. ఆవును కదా..? మిస్సమ్మ లేనప్పుడు నేను దర్జాగా ఇంట్లోకి వెళ్లొచ్చు కదా..? పదండి వెళ్దాం. మిస్సమ్మ వెళ్లిప్పటి నుంచి అత్తయ్య, మామయ్య చాలా బాధపడుతున్నారు. నేను వీళ్లను ఇలా చూడలేకపోతున్నాను అంటుంది ఆరు.

అయితే వెళ్లి చక్కిలిగింతలు పెట్టు.. అంటాడు గుప్త. గుప్త గారు నాకు స్పర్శ శక్తి ఉంది కదా..? ఇప్పుడే నేను మా ఆయన రూంలోకి వెళ్లి డైరీలో దీనికంతటికి కారణం మనోహరి అని రాస్తాను అని పైకి వెళ్తుంటే గుప్త వెనకాలే వెళ్లి అలా రాయోద్దని చెప్తాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. డల్లుగా కూర్చున్న శివరామ్, నిర్మలను చూసి పైకి పిలిచి ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడుగుతాడు.

మనోహరి కొత్త ప్లాన్

భాగీని ఇంటికి తీసుకురమ్మని నిర్మల గట్టిగా అడుగుతుంది. అది విన్న మనోహరి ఈ ముసలొళ్లకు ఏమైంది అని అనుకుంటుంది. పైన అమర్‌ సరేనని మిస్సమ్మను మీరే వెళ్లి తీసుకురండి అని చెప్తాడు. మేము కాదు నువ్వే వెళ్లి మాట్లాడి తీసుకురమ్మని చెప్తారు. ఇంతలో మనోహరి వచ్చి కిందపడిపోతుంది. భాగీని తీసుకురాకుండా ఉండేందుకు మనోహరి ఇలా కొత్త ప్లాన్ వేస్తుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner