OTT Romantic Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ-ott telugu romantic thriller movie sandeham hebah patel movie now streaming in etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

OTT Romantic Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Published Nov 28, 2024 02:54 PM IST

OTT Telugu Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా జూన్ లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు థ్రిల్లర్ మూవీ

OTT Telugu Thriller Movie: హెబ్బా పటేల్ నటించిన సందేహం మూవీ మొత్తానికి ఓటీటీలో అడుగుపెట్టింది. జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. సుమన్ వూట్కుర్ డ్యుయల్ రోల్లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ కొవిడ్-19 నేపథ్యంలో జరిగిన కథగా తెరకెక్కించారు. ఈ తెలుగు థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉండటం విశేషం.

సందేహం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్

హెబ్బా పటేల్ నటించిన థ్రిల్లర్ మూవీ సందేహం. ఈ సినిమా గురువారం (నవంబర్ 18) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ప్రేమ, నమ్మకం, ఊహించని ట్విస్టులు.

సందేహం ఈటీవీ విన్ లో చూడండి" అంటూ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. ఈటీవీ విన్ నవంబర్ రిలీజెస్ లో ఈ సందేహం కూడా ఒకటి. అటు కిరణ్ అబ్బవరం నటించిన బ్లాక్ బస్టర్ మూవీ క స్ట్రీమింగ్ అయిన రోజునే ఈ సందేహం కూడా రావడం విశేషం.

సందేహం స్టోరీ ఏంటంటే?

సందేహం మూవీ కొవిడ్ -19 నేపథ్యంలో జరిగిన కథగా తెరకెక్కింది. ఇది ఓ భార్య, భర్త, ఆ భార్య మాజీ లవర్ చుట్టూ తిరిగే కథ. ఇందులో హెబ్బా పటేల్ శృతి పాత్రలో నటించింది. ఆమె భర్త హర్ష, మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆర్యగా డ్యుయల్ రోల్లో సుమన్ వూట్కూర్ నటించాడు.

శృతి, హర్ష పెళ్లి చేసుకుంటారు. కానీ శృతి మాత్రం అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆర్య వాళ్లు ఉండే బిల్డింగ్ లోకే వస్తాడు. తనతో శారీరక సంబంధానికి అంగీకరించని భార్యపై హర్షలో సందేహాలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తాను లేకుంటే భార్య ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటూ హర్ష బెంగళూరు వెళ్తాడు.

సడెన్ గా అక్కడే అతడు కొవిడ్ బారిన పడి చనిపోయినట్లు శృతికి సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హర్ష నిజంగా చనిపోతాడా? ఇందులో శృతి పాత్ర ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సందేహం మూవీ చూడాల్సిందే.

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి క‌థ‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్ స‌తీష్ ప‌ర‌మ‌వేద‌. హీరోహీరోయిన్ల ప్రేమ‌క‌థ‌ను బోల్డ్‌గా చూపించారు. హీరోను డ్యూయ‌ల్ రోల్‌లో చూపించి హ‌ర్ష‌, ఆర్య‌ల‌లో అస‌లు చ‌నిపోయింది ఎవ‌రు...బ‌తికింది ఎవ‌రు అనే ట్విస్ట్ చివ‌రి వ‌ర‌కు రివీల్ కాకుండా స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. హీరో క్యారెక్ట‌ర్‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వ‌చ్చే మ‌లుపు ఆక‌ట్టుకుంటుంది.

భర్త, మాజీ బాయ్‌ఫ్రెండ్ పాత్రలో ఒకే నటుడు నటించడం ఈ సందేహం మూవీని ఇంట్రెస్టింగా మారుస్తుంది. పైగా మధ్యలో వచ్చే ఊహించని ట్విస్టులు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతాయి. ఈ సందేహం మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం (నవంబర్ 28) నుంచి చూడొచ్చు.

Whats_app_banner