AP Pharmacy Counselling 2024 : ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే-ap eapcet pharmacy counselling dates 2024 released key dates check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Pharmacy Counselling 2024 : ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

AP Pharmacy Counselling 2024 : ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 28, 2024 01:39 PM IST

AP EAPCET Pharmacy Counselling 2024 : ఏపీలో ఫార్మసీ ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. నవంబర్ 29వ తేదీ నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. బైపీసీ వారికి డిసెంబరు 11న సీట్లు కేటాయించనున్నారు.

 ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌
ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌

ఏపీఈఏపీసెట్ లో భాగంగా ఫార్మసీ ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను పేర్కొంది.

నవంబర్ 29వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు…. ఈనెల 29 నుంచి 30 వరకు (ఎంపీసీ స్ట్రీమ్‌) ఆన్ లైన్ పేమెంట్ చేసుకోవాలి. ఇక నవంబర్ 30 నుంచి డిసెంబరు 5 వరకు బైపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహిస్తారు. ఇది కూడా ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఇక నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంది. సీట్లు పొందే విద్యార్థులు డిసెంబర్ 4వ తేదీ నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకు డిసెంబర్ 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. డిసెంబరు 3 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. బైపీసీ స్ట్రీమ్ వారికి డిసెంబరు 11న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు.

కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. నిర్ణయించిన దరఖాస్తు రుసుంను(బీసీ - Rs.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600) కూడా చెల్లించాలి.

కావాల్సిన పత్రాలు :

  1. APEAPCET-2024 ర్యాంక్ కార్డు
  2. APEAPCET-2024 హాల్ టికెట్.
  3. మార్కుల మెమోలు
  4. పుట్టిన తేదీ ధ్రువపత్రం
  5. టీసీ
  6. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
  7. ఈడబ్యూఎస్ సర్టిఫికెట్
  8. నివాస ధ్రువీకరణపత్రం
  9. ఆధార్ కార్డు
  10. ఆదాయపు ధ్రవీకరణపత్రం

AP EAPCET 2024 ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి?

Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.

Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం