TG SET 2024 Updates : టీజీసెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల, కావాల్సిన పత్రాలివే-tg set 2024 qualified candidates certificate verification is scheduled from 30 november 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Set 2024 Updates : టీజీసెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల, కావాల్సిన పత్రాలివే

TG SET 2024 Updates : టీజీసెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల, కావాల్సిన పత్రాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 27, 2024 12:09 PM IST

Telangana SET 2024 Updates : తెలంగాణ సెట్ - 2024 అభ్యర్థులకు అధికారులు ముఖ్య అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ఫలితాల్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ ఓయూ దూర విద్య కేంద్రంలో నిర్వహించనున్నారు.

తెలంగాణ సెట్ 2024
తెలంగాణ సెట్ 2024

టీజీసెట్‌- 2024 ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అర్హత సాధించిన అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు. నవంబర్ 30వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుండగా… డిసెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

టీజీసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఫలితాలను ఉంచారు. టీజీసెట్‌ ఫలితాల్లో 1,884 మంది అర్హత సాధించారు. ఫలితాలను http://telanganaset.org/ ద్వారా చూసుకోవచ్చు. మొత్తం 29 సబ్జెక్టుల్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను రెండో సెషన్లలో వెరిఫికేషన్ చేయనున్నారు.

కావాల్సిన ధ్రువపత్రాలు

  • టీజీసెట్ - 2024 స్కోర్ కార్డు
  • పదో తరగతి మెమో
  • పీజీ మార్కుల మెమో
  • పీజీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఆధార్ కార్డు
  • రెండు సెట్ల జిరాక్స్ కాపీలు
  • ఈడబ్యూఎస్ కోటా వారు సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • దివ్యాంగ అభ్యర్థులు కూడా సర్టిఫికెట్ సమర్పించాలి.

ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ - 2024 పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో నిర్వహించారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. ఇక పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష ఉంటుంది.

జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ -పేపర్-1 గా ఉంటుంది. పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.

ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు. ఈ పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. పీహెచ్డీ ప్రవేశాల్లో కూడా సెట్ ను పరిగణనలోకి తీసుకుంటారు. 

Whats_app_banner