Telangana News Live November 27, 2024: Sangareddy Crime : ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 27 Nov 202404:10 PM IST
Sangareddy Crime : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఒక దొంగతనం చేయగా...అది మరో మూడు చోరీలకు దారితీసింది. చివరికి చోరీల విషయం ఊరిలో తెలిసి పంచాయితీకి పిలవగా.. భయంతో మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు దూకడం చూసి తల్లి సైతం నదిలో ఆత్మహత్యకు పాల్పడింది.
Wed, 27 Nov 202412:46 PM IST
Nirmal Ethanol Factory : నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్... ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు.
Wed, 27 Nov 202412:32 PM IST
Water Scarcity In Cities : నీతి ఆయోగ్ అధ్యయనాల ప్రకారం దేశంలోని 21 ప్రధాన నగరాల్లో 2025 నాటికి భూగర్భ జలవనరులు అంతరించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నీటి వనరులను భద్రపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కోణార్క్ మీటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘునందన్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
Wed, 27 Nov 202411:51 AM IST
- ఖమ్మం జిల్లాలో జంట హత్యల కలకలం సృష్టించింది. వృద్ధ దంపతులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇవి పక్కా ప్రణాళికతో జరిగిన హత్యలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలి నుంచి ఆధారాలను సేకరించింది. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు.
Wed, 27 Nov 202409:30 AM IST
- TG Pharmacist Grade II Recruitment : వైద్యారోగ్య శాఖలో732 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 30వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. https://mhsrb.telangana.gov.in/MHSRB/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
Wed, 27 Nov 202409:21 AM IST
- Adilabad Protests: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహించారు. దీంతో గ్రామస్థులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు.
Wed, 27 Nov 202409:15 AM IST
AP TG School Holidays : డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు రానున్నాయి. వచ్చే నెలలో దాదాపుగా 9 రోజులు హాలీడేస్ వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో 7 రోజులు ప్రభుత్వ సెలవులు కాగా...మిగిలినవి ఐచ్ఛిక సెలవులు. ఇక క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు భారీగా సెలవులు రానున్నాయి.
Wed, 27 Nov 202407:39 AM IST
- ఆపరేషన్ చబుత్ర తో నల్గొండ జిల్లా పోలీసులు ఆకతాయిల ఆటకట్టించారు.అర్థరాత్రి వేళ పకడ్బందీగా ఆపరేషన్ చబుత్రను చేపట్టారు. ఆవారా గా తిరుగుతున్న 84 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. 48 బైకులు, 5 కార్లు, 3 ఆటోలు, 80 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 24 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదయ్యాయి.
Wed, 27 Nov 202406:39 AM IST
- Telangana SET 2024 Updates : తెలంగాణ సెట్ - 2024 అభ్యర్థులకు అధికారులు ముఖ్య అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ఫలితాల్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ ఓయూ దూర విద్య కేంద్రంలో నిర్వహించనున్నారు.
Wed, 27 Nov 202406:00 AM IST
- భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల ప్రక్రియపై HMDA కీలక ప్రకనట చేసింది. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ఈ మేరకు పలు ముఖ్య వివరాలను ప్రస్తావించింది.
Wed, 27 Nov 202405:31 AM IST
- హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. దీంతో ఇంట్లో పార్కింగ్ చేసిన మరో ఎనిమిది బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 27 Nov 202405:11 AM IST
- TG DSC 2008 Jobs: తెలంగాణ డిఎస్సీ 2008 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరో వారం రోజుల్లో మరికొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. డిఎస్సీ 2008లో అర్హత సాధించిన వారిలో 1399మందికి కాంట్రాక్టు పద్ధతిలో కొలువులు కల్పించనున్నారు.
Wed, 27 Nov 202404:05 AM IST
- Warangal and Hanmakonda: వరంగల్ జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెరపడింది. హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గా కొనసాగింది. దీంతో ప్రజలు, ప్రజా ప్రతినిధులతో పాటు ఆఫీసర్లలో కూడా గందరగోళం నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Wed, 27 Nov 202404:05 AM IST
- Telangana Weather News : తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Wed, 27 Nov 202412:01 AM IST
- BRS VijayaDiwas: తెలంగాణ రాష్ట్ర సాధనకు చారిత్రాత్మకమైన దినం నవంబర్ 29. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనకు కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ నిరహార దీక్షకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అలుగునూర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు. కెసిఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్ర సాధన సాకారమైంది.