ETV Win Upcoming Releases: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్-etv win ott november releases 7 telugu movies to release pothugadda sandeham telisinavallu usha parinayam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Upcoming Releases: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్

ETV Win Upcoming Releases: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Nov 04, 2024 04:48 PM IST

ETV Win Upcoming Releases: ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల సినిమాల జాతర ఉండనుంది. తొలి వారం నుంచి చివరి వారం వరకు నవంబర్ నెల మొత్తం ఏడు ఒరిజినల్ మూవీస్ రాబోతుండటం విశేషం.

ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్
ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్

ETV Win Upcoming Releases: ఈటీవీ విన్ ఓటీటీ నవంబర్ రిలీజెస్ పై అప్డేట్ వచ్చేసింది. సోమవారం (నవంబర్ 4) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈటీవీ విన్ ఈ నెలలో తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోతున్న మూవీస్ గురించి వెల్లడించింది. ఈ నెలలో 7వ తేదీ నుంచి 28 వరకు ఏకంగా ఏడు మూవీస్ ఈ ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. వాటి స్ట్రీమింగ్ డేట్స్ కూడా ఈటీవీ విన్ రివీల్ చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీ రిలీజెస్

ఈటీవీ విన్ కేవలం తెలుగు కంటెంట్ అందించే ఓటీటీల్లో ఒకటి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతోపాటు ఒరిజినల్స్ పైనా దృష్టి సారించింది.

ప్రతి నెలలో ఒకటో రెండో తన సొంత సినిమాలను తీసుకొచ్చే ఈ ఓటీటీ.. నవంబర్ లో మాత్రం కాస్త ఎక్కువగానే మూవీస్ ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆ సినిమాల పోస్టర్లను రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీలను కూడా సదరు ఓటీటీ వెల్లడించింది. మరి ఏ సినిమా ఎప్పుడు రాబోతోందో ఒకసారి చూద్దాం.

ఈటీవీ విన్ నవంబర్ రిలీజెస్

#లైఫ్ స్టోరీస్ - నవంబర్ 7

వచ్చే గురువారం (నవంబర్ 7) ఈటీవీ విన్ ఓటీటీలోకి #లైఫ్ స్టోరీస్ అనే మూవీ రాబోతోంది. ఈ మూవీ సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజైంది. ఆరు కథల ఆంథాలజీకి వచ్చిన లైఫ్ స్టోరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఈటీవీ విన్ లోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.

తెలిసినవాళ్లు - నవంబర్ 7

గురువారమే (నవంబర్ 7) మరో సినిమాను కూడా ఈటీవీ విన్ తీసుకొస్తోంది. దీనిపేరు తెలిసినవాళ్లు. హెబ్బా పటేల్ నటించిన ఈ మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జానర్లలో వస్తున్న ఈ తెలిసినవాళ్లు మూవీ పోస్టర్ కూడా భిన్నంగా ఉంది.

ఉషాపరిణయం - నవంబర్ 14

మూడు నెలల తర్వాత ఉషాపరిణయం అనే మూవీ కూడా ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో నవంబర్ 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అతని తనయుడే హీరోగా నటించాడు.

పోతుగడ్డ - నవంబర్ 14

ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా వస్తున్న పోతుగడ్డ కూడా నవంబర్ 14న వస్తోంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను కొన్నాళ్లుగా ఈటీవీ విన్ రిలీజ్ చేస్తోంది. ఓ ప్రేమజంట, వాళ్లు చుట్టూ తిరిగే రాజకీయాలతో ఈ మూవీ ఆసక్తి రేపుతోంది.

ఐ హేట్ లవ్ - నవంబర్ 21

ఈటీవీ విన్ ఓటీటీలోకి సుమారు 9 నెలల తర్వాత వస్తున్న మూవీ ఐ హేట్ లవ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నవంబర్ 21 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజు రేపటి వెలుగు అనే మరో ఒరిజినల్ మూవీని కూడా ఆ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

సందేహం - నవంబర్ 28

హెబ్బా పటేల్ నటించిన మరో మూవీ సందేహం. సుమారు ఐదు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఈ సందేహం సినిమా నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner