Sandeham Review: సందేహం రివ్యూ - హెబ్బాపటేల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Sandeham Review:దిల్‌రాజు ఫ్యామిలీ హీరో సుమన్‌తేజ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన సందేహం మూవీ శనివారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అంటే?
Sandeham Review: దిల్ రాజు బంధువు సుమన్ తేజ్ హీరోగా నటించిన సందేహం మూవీ శనివారం థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ మూవీలో హెబ్బాపటేల్ హీరోయిన్‌గా నటించింది. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్‌బాస్ శ్వేత వర్మ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా ఎలా ఉందంటే…
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ…
హర్షను (సుమన్ తేజ్) ప్రాణంగా ప్రేమిస్తుంది శృతి (హెబ్బాపటేల్). తమ పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పకుండా అరెంజ్ మ్యారేజీలా ప్లాన్ చేసి ఇద్దరు ఒక్కటవుతారు.పెళ్లి తర్వాత సడెన్‌గా శృతిలో మార్పు వస్తుంది. హర్షను దూరం పెడుతుంది. ఫస్ట్ నైట్‌కు ఒప్పుకోదు. అదే టైమ్‌లో శృతి మాజీ బాయ్‌ఫ్రెండ్‌నంటూ వారిద్దరి లైఫ్‌లోకి ఆర్య (సుమన్ తేజ్) వస్తాడు.
శృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. కరోనా బారిన పడి హర్ష చనిపోతాడు. హర్ష మరణంపై అతడి చెల్లెలికి ఓ క్లూ దొరకుతుంది. అదేమిటి? హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? హర్ష, ఆర్య ఒకే పోలికలతో ఉండటానికి కారణం ఏమిటి? హర్ష మర్డర్ కేసులో పోలీస్ ఆఫీసర్ (శ్వేతా వర్మ) శృతిని ఎందుకు అనుమానించింది? ఆర్య నిజంగానే శృతి బాయ్‌ఫ్రెండా? అన్నదే ఈ మూవీ కథ.
ప్రేమ కోసం అబద్ధం...
సందేహం ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీ. సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో ఎన్ని కష్టాలు ఎదురైన క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలవడం మాత్రం కామన్‌గా కనిపిస్తుంది. ఆ ప్రేమికుల ప్రయాణాన్ని తమ శైలికి తగ్గట్లుగా ఒక్కో దర్శకుడు ఒక్కోలా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుంటారు.
సందేహం సినిమాలో చనిపోయిన వ్యక్తి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నదే ఆసక్తిగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించారు. అతడు ఆడిన ఓ అబద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే ఈ మూవీ కథ.
బోల్డ్ లవ్ స్టోరీ...
ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు కథను రాసుకున్నాడు డైరెక్టర్ సతీష్ పరమవేద. హీరోహీరోయిన్ల ప్రేమకథను బోల్డ్‌గా చూపించారు. హీరోను డ్యూయల్ రోల్‌లో చూపించి హర్ష, ఆర్యలలో అసలు చనిపోయింది ఎవరు...బతికింది ఎవరు అనే ట్విస్ట్ చివరి వరకు రివీల్ కాకుండా స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. హీరో క్యారెక్టర్‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ కామెడీ...
శృతి, హర్ష ప్రేమాయణం, పెళ్లితో సందేహం సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వారి జీవితంలోకి అనుకోకుండా ఆర్య రావడం...అతడు హర్ష రూపురేఖలతోనే ఉన్నట్లుగా చూపించి ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. హర్ష ముందే ఆర్యతో శృతి క్లోజ్‌గా మూవ్ కావడం, వారిద్దరి అనుబంధాన్ని కామెడీగా చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు.
క్రైమ్ థ్రిల్లర్ వైపు టర్న్...
హర్ష చనిపోయినట్లుగా చూపించి సెకండాఫ్ లో సినిమా ను రొమాంటిక్ కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వైపు మలుపు తిప్పారు దర్శకుడు. హర్ష మరణం వెనుక శృతి, ఆర్య ఉన్నారని పోలీసులు అనుమానించడం, శ్వేతా వర్మ ఇన్వేస్టిగేషన్ చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. హర్ష ఆడిన అబద్ధం, అతడి క్యారెక్టర్‌కు సంబంధించి రివీలయ్యే నిజంతో ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
లాజిక్ లు మిస్…
టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా ఆద్యంతం అనేక సందేహాలతో సాగతుంది. చాలా లాజికల్‌లను వదిలివేశాడు డైరెక్టర్. హర్ష, శృతి లవ్‌స్టోరీ రొమాన్స్ పాళ్లే ఎక్కువయ్యాయి. శృతివర్మ ఇన్వేస్టిగేషన్‌లో థ్రిల్ మిస్సయింది.
డ్యూయల్ రోల్...
హర్షగా, ఆర్యగా రెండు పాత్రల్లో సుమన్ తేజ్ కనిపించాడు. ఒకటి మాస్, మరొకటి క్లాస్‌తో రెండు పాత్రల్లో అతడు చూపించిన వేరియేషన్ బాగుంది. హెబ్బాపటేల్ యాక్టింగ్ కంటే గ్లామర్‌తోనే ఎక్కువగా మెప్పించింది. పోలీస్ ఆఫీసర్‌గా బిగ్‌బాస్ శ్వేతా వర్మ యాక్టింగ్ ఒకే.
ఐడియా ఫ్రెష్ కానీ…
సందేహం మూవీ ఐడియా ఫ్రెష్‌గా ఉంది. కానీ కాన్సెప్ట్‌ను రొటీన్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ మూవీ కొంత వరకు మెప్పిస్తుంది.
రేటింగ్ :2.5/5