Rajamouli | మార్వెల్ సినిమాకు దర్శకత్వం...రాజమౌళి సమాధానం ఏమిటంటే…
‘ఆర్ఆర్ఆర్’ తో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు రాజమౌళి. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. మార్వెల్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. దానిపై రాజమౌళి ఏమన్నారంటే
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చక్కటి ఆదరణతో దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం పద్నాలుగు రోజుల్లో 967 కోట్ల వసూళ్లు సాధించింది. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మూడో స్థానానికి చేరుకున్నది.
చారిత్రక వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు ఫిక్షనల్ అంశాలను జోడించి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు లభిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయడం, వారిపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ పడించిన తీరు అద్భుతమంటూ కొనియాడుతున్నారు.
‘బాహుబలి’ తర్వాత ఈ సినిమాతో మరోమారు అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ సినిమా సత్తాను చాటిచెప్పారు రాజమౌళి. మార్వెల్ సినిమాలతో ‘ఆర్ఆర్ఆర్’ పోలుస్తున్నారు. మార్వెల్ సినిమాలకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించారు. ‘చిన్నతనం నుంచి భారతీయ పురాణాలు, ఇక్కడి సూపర్ హీరోలు, చరిత్రకారులు, పోరాటయోధులు గురించి తెలుసుకుంటూ పెరిగాను. వీటిపై నాకు మంచి అవగాహన ఉంది ఈ సెన్సిబిలిటీస్‌ను చక్కగా వెండితెరపై ఆవిష్కరించగలిగే సామర్థ్యాలున్నాయి. మార్వెల్ మూవీస్ అంటే నాకు ఇష్టం. ఐరన్ మ్యాన్ తో పాటు మార్వెల్ సినిమాలన్నీ చూశా. భారతీయ సూపర్ హీరో సినిమాలతో పోలిస్తే మార్వెల్ సెన్సిబిలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే మార్వెల్ సినిమాకు దర్శకత్వం వహించడం కష్టమని అనుకుంటున్నా. భవిష్యత్తులో మన పురాణాల్ని, సూపర్‌హీరో కథలకు మార్వెల్ సినిమాలకు ధీటుగా ప్రపంచస్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలన్నదే దర్శకుడిగా నా లక్ష్యం’ అని రాజమౌళి అన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో సెట్స్‌పైకిరానున్నది.
సంబంధిత కథనం