OTT Telugu Movies: ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..-ott telugu movies ka lucky baskhar to stream on etv win netflix tomorrow 28th november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..

OTT Telugu Movies: ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..

Hari Prasad S HT Telugu
Nov 27, 2024 05:38 PM IST

OTT Telugu Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.

ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..
ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..

OTT Telugu Movies: దీపావళికి రిలీజై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాలు క, లక్కీ భాస్కర్. గత నెల 31న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన మూవీస్ ఇవి. ఇప్పుడీ సినిమాలు గురువారం (నవంబర్ 28) నుంచి ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి.

క ఓటీటీ రిలీజ్ డేట్

కిరణ్ అబ్బవరం నటించిన మూవీ క (KA). దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అమరన్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు పోటీగా రిలీజైనా.. వాటి ధాటిని తట్టుకొని నిలబడింది.

ఇప్పుడు గురువారం (నవంబర్ 28) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క సినిమా రూ.22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే చూసేవారు కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నయన్‌ సారిక నటించగా.. తన్వీ రామ్‌, అచ్యుత్‌కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే కీలక పాత్రలు పోషించారు. చింతా గోపాలకృష్ణ ఈ సినిమాని నిర్మించారు.

లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్

దుల్కర్ సల్మాన్ నటించిన మరో మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31నే రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ గురువారం (నవంబర్ 28) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

"ఇంకా ఒక్క రోజులో అదృష్టం భాస్కర్ తలుపు తడుతుంది. భాస్కర్ మీ తలుపు తడతాడు. రేపటి నుంచి లక్కీ భాస్కర్ మూవీని తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ, హిందీల్లో చూడండి" అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఓ ట్వీట్ చేసింది. లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్‌‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. మూవీ ఇప్పటికే థియేటర్ల నుంచి కనుమరుగు కావడంతో.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. లక్కీ భాస్కర్ సినిమా బడ్జెట్ రూ.56 కోట్లుకాగా.. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.109.82 కోట్లని వసూలు చేసింది.

కుటుంబం కోసం సాధారణ బ్యాంక్ ఉద్యోగి రిస్క్ చేయడాన్ని కథాంశంగా తీసుకుని.. దర్శకుడు వెంకీ అట్లూరి మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. భాస్కర్ కుమార్‌గా దుల్కర్ సల్మాన్ నటించగా.. సర్దుకుపోయే మధ్యతరగతి భార్య సుమతిగా మీనాక్షి చౌదరి నటించింది.

Whats_app_banner