NNS November 10th Episode: శివరామ్‌ను చంపేస్తానన్న మనోహరి.. భయపడిన పిల్లలు.. భాగీని మిస్సయిన అమర్.. కొత్తగా కేర్ టేకర్!-nindu noorella saavasam serial november 10th episode manohari wants to kill shivaram zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 10th Episode: శివరామ్‌ను చంపేస్తానన్న మనోహరి.. భయపడిన పిల్లలు.. భాగీని మిస్సయిన అమర్.. కొత్తగా కేర్ టేకర్!

NNS November 10th Episode: శివరామ్‌ను చంపేస్తానన్న మనోహరి.. భయపడిన పిల్లలు.. భాగీని మిస్సయిన అమర్.. కొత్తగా కేర్ టేకర్!

Sanjiv Kumar HT Telugu
Nov 10, 2024 01:29 PM IST

Nindu Noorella Saavasam November 10th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 10 ఎపిసోడ్‌‌లో అమర్‌కు బురిడీ కొట్టించి ఇంట్లోనే ఉండిపోతుంది మనోహరి. ఇక్కడే సేఫ్ అని కన్నీళ్లు పెట్టుకునే సరికి అమర్ కరిగిపోతాడు. మిస్సమ్మ లేకపోవడంతో శివరామ్ డల్‌గా ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ కాఫీ అంటూ అమర్ అరుస్తాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 10th November Episode)లో బాబ్జీ, మనోహరి ఫోన్​ నెంబర్లు ఒకే చోట ట్రేస్​ అవడంతో ఇంటికి వచ్చి అడుగుతాడు అమర్​. దొరికిపోయానని భయపడిన మనోహరి ఆ బాబ్జీ తన పక్కన ఉండే చంపేస్తానని అన్నాడేమోనని అంటుంది మనోహరి.

ఇక్కడే సేఫ్‌గా ఉంటాను

మనోహరిని కలకతా వెళ్లమంటాడు అమర్. మనోహరి ఏడుస్తూ.. నేను ఇక్కడే ఉంటానని నేను ఎక్కడికి వెళ్లినా వాడు నన్ను బతకనివ్వడు.. ఇక్కడ ఉంటేనే సేఫ్‌గా ఉంటాను అమర్‌ అని మనోహరి అంటుంది. దీంతో అమర్‌ సరే ఇక్కడే ఉండు. కానీ, ఎట్టి పరిస్థుల్లోనూ బయటకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్తాడు అమర్. సరేనని లోపలికి వెళ్తుంది మనోహరి.

తర్వాత అమర్‌ను కాళ్లు కడుక్కుని రమ్మని, భోజనం పెడతానని చెప్తుంది నిర్మల. సరేనని అమర్‌ వెళ్తాడు. నిర్మలకు భాగీ ఫోన్‌ చేస్తుంది. పిల్లల గురించి, శివరామ్ గురించి ఆరా తీస్తుంది. దీంతో నిర్మల, శివరామ్ ఏమోషనల్ అవుతారు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. హలో అత్తయ్యా వినబడుతుందా..? అంటుంది భాగీ.

వినబడటం లేదు మిస్సమ్మ మా మీద నీకున్న ప్రేమ కనబడుతుంది. నీ మంచి మనసుకు ఈ ఇల్లు గుడి కట్టాల్సింది పోయి. నిన్ను అవమానించి ఇంట్లోంచి బయటకు పంపించింది. అంత ద్వేషిస్తున్నా.. ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావు మిస్సమ్మ అంటాడు శివరామ్.

మన అనుకుంటేనే కదా

అదేంటి మామయ్యా నేనేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నారు. నా కుటుంబం నాకేదో ఇస్తుందని ప్రేమిస్తామా..? ఒక మాట అన్నారని వదిలేస్తామా..? మన అనుకుంటేనే కదా మామయ్యా మనసు విప్పి మాట్లుకునేది. పిల్లలు తిన్నారా..? మామయ్య అంటుంది భాగీ. ఆ విషయం గురించి ఏం అడుగుతావులే మిస్సమ్మ అంటాడు శివరామ్.

నీ చేతి వంట తిన్న నాలుకకు నా వంట రుచించటం లేదు మిస్సమ్మ అంటుంది నిర్మల. మిస్సమ్మ నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి అంటాడు శివరామ్​. ఇంతలో అమర్‌ వచ్చి నిర్మలను పిలుస్తాడు. అమర్ వచ్చాడు మళ్లీ చేస్తానని నిర్మల చెప్పగానే ఫోన్‌ కట్‌ చేయోద్దని ఆయన మాటలైన వింటానని అంటుంది మిస్సమ్మ. సరేనని ఫోన్‌ తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంది నిర్మల.

అమర్‌ మాట్లాడుతుంటే భాగీ వింటుంది. అమర్‌ పిల్లలను పిలిచి ఎందుకు భోజనం చేయలేదు అంటూ అందరూ ఇవాళ బయట తిందామని చెప్తాడు. మరుసటి రోజు పిల్లలకు టిఫిన్‌ బాక్స్‌ రెడీ చేస్తుంది భాగీ. రామ్మూర్తికి ఇచ్చి పంపిస్తుంది. రాథోడ్‌కు భాగీ ఫోన్‌ చేస్తుంది. చెప్పు మిస్సమ్మ.. అనగానే రాథోడ్‌ పిల్లలు స్కూల్‌‌కు బయలుదేరారా..? అని అడుగుతుంది భాగీ. ఇంకా లేదు మిస్సమ్మ ఇప్పుడే తినడానికి కూర్చున్నారు అంటాడు రాథోడ్​.

పిల్లలు తిన్నాకే తింటా

పరిస్థితి ఏంటి..? అంటున్న భాగీతో అసలు వర్కవుట్‌ అయ్యేలా లేదు మిస్సమ్మ.. అంటాడు. అవునా.. నాన్నతో టిఫిన్‌ పంపిస్తున్నాను. వాళ్లు బయట ఎక్కడ తినకుండా స్కూల్‌‌కు వచ్చేలా చూడు అని చెబుతుంది భాగీ. సరే మిస్సమ్మ.. అంటాడు రాథోడ్​. నాన్నా.. పిల్లలు ఇంట్లో కూడా తినేలా లేరు. వాళ్లతో మొత్తం తినిపించండి అంటుంది భాగీ. వాళ్లకు నేను తినిపిస్తాను. నువ్వు రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడైనా కొంచెం తిను తల్లి అంటాడు రామ్మూర్తి.

లేదు నాన్నా.. పిల్లలు తిన్నాకే నేను తింటాను నాన్నా.. నా గురించి ఆలోచించకండి. ముందు బయలుదేరండి అంటుంది భాగీ. ఇంట్లో తినడానికి తిండి లేదు. కానీ, బయట వాళ్లకు పెడుతున్నావా..? అని మంగళ అడ్డు పడగానే రామ్మూర్తి తిట్టి వెళ్లిపోతాడు. వాకింగ్‌‌కు వెళ్లి ఇంటికి వచ్చిన శివరామ్ భాగీని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. రాథోడ్ డల్లుగా వచ్చి పేపర్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ఇంతలో రూంలోకి వచ్చిన మనోహరి.. అనుమానంగా శివరామ్‌ను చూస్తూ ఒక్కరోజుకే అది లేకుండా ఉండలేకపోతున్నాడు టైం వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాను అని మనసులో అనుకుంటుంది మనోహరి. శివరామ్ మాత్రం డల్లుగా లోపలికి వెళ్తాడు. మరోవైపు హాల్లోకి వచ్చిన అమర్‌ గట్టిగా మిస్సమ్మ కాఫీ.. అంటూ అడుగుతాడు. తర్వాత మిస్సమ్మ ఇంట్లోంచి వెళ్లిపోయిందని గుర్తు చేసుకుని ఆగిపోతాడు.

మిస్సమ్మ విలువ ఎలా తెలుస్తుంది

నిర్మలను పిలుస్తాడు. నిర్మల వెళ్తుంటే.. ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అబ్బాయి కాఫీ అడుగుతున్నాడు కదండి అంటుంది నిర్మల. అడిగిందల్లా నువ్వు ఇంస్తుంటే వాడికి మిస్సమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుంది. నీ తల్లి మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నిర్మల. కానీ, కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెప్పి హాల్‌లోకి వస్తాడు శివరామ్.

శివరామ్‌ను చూసి అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడగ్గానే పడుకుందని చెప్తాడు. ఇంతలో రాథోడ్‌ రాగానే.. మన ఇంట్లో మిస్సమ్మ లేదు కదా..? ఒక వంట మనిషి కావాలి. అలాగే ఒక పనిమనిషి కావాలి. పిల్లలకు ఒక కేర్‌ టేకర్ కూడా కావాలి. మంచి వాళ్లను చూడు అంటాడు శివరామ్. అవునవును సార్‌ అలాగే.. కానీ కష్టమే సార్‌. కానీ, ట్రై చేస్తాను అంటాడు రాథోడ్​.

నాకు, నా భార్యకు వయసైపోయింది కదా..? మమ్మల్ని చూసుకోవడానికి ఒక కేర్‌ టేకర్‌‌ను చూడు రాథోడ్​ అంటాడు శివరామ్. ఓకే సార్‌ ఒక్క మిస్సమ్మ లేకపోతే ఇంత మంది అవసరం ఉందని బయటపడింది సార్‌ అంటాడు రాథోడ్​. ఇన్ని రోజులు తను ఈ ఇంటిని పట్టించుకుంది కాబట్టి. మనం పట్టించుకునే అవసరం రాలేదు అంటూ శివరామ్ చెప్తుంటే.. రాథోడ్‌ నవ్వుతుంటాడు.

భయపడిన పిల్లలు

ఇంతలో అమర్‌ లేచి పిల్లలను రెడీ చేయమని చెప్పి స్కూల్‌‌లో డ్రాప్‌ చేసి వెళ్దామని అంటాడు. రాథోడ్ సరే అంటాడు. పిల్లలు టిఫిన్‌ చేయడానికి వచ్చి టిఫిన్స్‌ చూసి భయపడుతుంటారు. అక్కడితే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner