NNS 3rd September Episode: అబద్ధం చెప్పిన అమర్.. నిరాశలో రామ్మూర్తి.. సంబరాల్లో మనోహరి.. అయోమయంగా అరుంధతి!
NNS 3rd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ లో రామ్మూర్తికి అమర్ అబద్ధం చెబుతాడు. దీంతో అతడు తీవ్ర నిరాశకు లోనవగా.. మనోహరి సంబరపడిపోతుంది. అటు అరుంధతికి ఏమీ అర్థం కాక అయోమయానికి గురవుతుంది.
NNS 3rd September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇంట్లోకి రాకుండా సాయంత్రం నుంచీ అమర్ కోసం గార్డెన్లోనే ఎదురుచూస్తున్న రామ్మూర్తి దగ్గరకు మిస్సమ్మ వచ్చి.. ఇంతదూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా? మీరు లోపలికి రండి అని పిలుస్తుంది. అల్లుడు గారు వచ్చాక నేను వస్తాను నువ్వు వెళ్లు తల్లి అని రామ్మూర్తి చెప్పడంతో మిస్సమ్మ వెళ్లిపోతుంది.
అమర్‌ను పట్టుకొని ఏడ్చిన రామ్మూర్తి
పైనుంచి చూస్తున్న మనోహరి ఈ ముసలోడు కచ్చితంగా నిజాన్ని బయటపెట్టేవరకు వదిలేలా లేడు అని టెన్షన్ పడుతుంది. రాత్రి అయినా రామ్మూర్తి లోపలికి వెళ్లకుండా అక్కడే ఎదురు చూస్తుంటాడు. ఇంతలో అమర్ వస్తాడు. అమర్ ను పట్టుకుని రామ్మూర్తి ఏడుస్తుంటాడు. ఏమైందండి.. ఇంతసేపు బయట ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అమర్.
మీకోసమే ఎదురుచూస్తున్నాను అంటాడు రామ్మూర్తి. మిస్సమ్మ లోపలి నుంచి పరుగెత్తుకొచ్చి సాయంత్రం నుంచి మీతో ఏదో మాట్లాడాలని బయటే ఉన్నారు ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు అంటుంది. ఇదేంటి వీడియో తప్ప ఆడియో వినిపించడం లేదు. ఇప్పుడెలాగా? అనుకుంటుంది అరుంధతి.
అబద్ధం చెప్పిన అమర్
అమర్ ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాడు. అయిపోయింది అంతా అయిపోయింది అని టెన్షన్ పడుతుంది మనోహరి. నాతో మాట్లాడాల్సిన అర్జెంట్ ఏంటండి.. అంటాడు అమర్. ఆ పంచె మీకు ఎక్కడిది బాబు అని రామ్మూర్తి అడగ్గానే అమర్ షాక్ అవుతాడు. పైనుంచి చూస్తున్న మనోహరి షాక్ అవుతుంది. మంగళ హ్యాపీగా ఫీలవుతుంది. ఆ పంచె గురించి ఎంత అడుగుతున్నా మీరెందుకు ఏం చెప్పడం లేదు అని మిస్సమ్మ అడుగుతుంది.
రామ్మూర్తి ఎమోషనల్ గా ఆరు దూరమయిన విషయం గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ కూడా ఎమోషనల్ అవుతూ మీరు చెప్పేది నిజమా నాన్నా అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి అవునని నిజం చెప్తాడు. చెప్పండి బాబు ఆ పంచె ఎక్కడిది అనగానే ఆ పంచె మీదే అంకుల్ అంటాడు అమర్. అసలు ఏమౌతుంది అక్కడ ఏమీ అర్థం కావడం లేదు అనుకుంటుంది అరుంధతి. మీరు చెప్తున్నది నిజమా? అని అడుగుతుంది మిస్సమ్మ. నిజం మిస్సమ్మ నేను ఆరు పేరెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ పంచె దొరికింది అని అబద్ధం చెబుతాడు అమర్.
ఆరు గుర్తు అదొక్కటే అన్న అమర్
బాబుగారు నా కూతురు ఎక్కడుందో చెప్పండి. నా కూతురు కనిపిస్తే కాళ్లు కడిగి నా పాపం కడేసుకుంటాను అంటాడు రామ్మూర్తి. చెప్పండి మా అక్క ఎక్కడుంది. వెంటనే వెళ్లి కలుస్తాను అంటుంది మిస్సమ్మ. కుదరదు మిస్సమ్మ.. అంటాడు అమర్. ఎందుకు కుదరదు అంటుంది మిస్సమ్మ. ఎందుకంటే మీ అక్క గురించి నాకే సమాచారం తెలియదు అని అమర్ చెప్పగానే రామ్మూర్తి, మిస్సమ్మ ఎమోషనల్ అవుతారు.
మరి ఆ పంచె ఎలా వచ్చిందని రామ్మూర్తి అడుగుతాడు. మరోవైపు పై నుంచి చూస్తున్న మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. రామ్మూర్తి ఏడుస్తుంటే.. అమర్ ఓదారుస్తాడు. త్వరలోనే మీ కూతురు గురించి నిజం తెలుస్తుందని చెబుతాడు. ఆ పంచె తనకు ఇవ్వమని రామ్మూర్తి అడగ్గానే తన గుర్తు నా దగ్గర ఉన్నది అదొక్కటే అని చెప్పగానే.. మిస్సమ్మ మా అక్క గుర్తు మీ దగ్గర ఉండటమేంటి అని అడుగుతుంది.
అంటే మీ అక్క దొరికే వరకు గుర్తు కోసం ఆ పంచె ఉండాలి కదా అని మాట మారుస్తాడు అమర్. దీంతో రామ్మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మా నాన్న చాలా బాధపడుతున్నారండి అంటుంది మిస్సమ్మ. ఇలా జరుగుతుందనే నేను నిజం చెప్పలేదు అని అమర్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అయోమయంలో అరుంధతి
మరోవైపు తనకు ఏమీ వినిపించకపోవడంతో ఆరు అయోమయానికి గురవుతుంది. తర్వాత మరునాటి ఉదయం ఆరు.. రామ్మూర్తి ఏడుస్తూ వెళ్లిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇంతలో గుప్త రావడంతో రాత్రి జరిగిన విషయం గుప్తకు చెప్తుంది. అసలు ఆయన మా ఆయనతో ఏం మాట్లాడారు. మిస్సమ్మ ఉండటంతో నేను వినలేకపోయాను అంటుంది.
దీంతో గుప్త వాళ్లు మాట్లాడుకుంది నీ గురించే అని నోరు జారి తర్వాత జోక్ చేశానని అంటాడు. ఇంతలో అమర్ బయటి నుంచి రావడంతో ఆరు వెళ్లి పిల్లల్ని పిక్నిక్ కు తీసుకెళ్లండని అని చెప్తుంది. ఏదో వినబడినట్లు అమర్ కొద్దిసేపు ఆగి వెళ్లిపోతాడు. అరుంధతికి నిజం ఎలా తెలుస్తుంది? మనోహరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!