NNS 9th November Episode: భాగీని ఎగతాళి చేసిన మంగళ.. అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. కలకత్తా వెళ్లిపొమ్మన్న అమర్​!-zee telugu serial nindu noorella saavasam today 9th november episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 9th November Episode: భాగీని ఎగతాళి చేసిన మంగళ.. అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. కలకత్తా వెళ్లిపొమ్మన్న అమర్​!

NNS 9th November Episode: భాగీని ఎగతాళి చేసిన మంగళ.. అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. కలకత్తా వెళ్లిపొమ్మన్న అమర్​!

Hari Prasad S HT Telugu
Nov 09, 2024 06:00 AM IST

NNS 9thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (నవంబర్ 9) ఎపిసోడ్లో మనోహరి అడ్డంగా దొరికిపోతుంది. దీంతో ఆమెను కలకత్తా వెళ్లిపొమ్మని అమర్ చెబుతాడు. అటు భాగీని మంగళ హేళనగా మాట్లాడుతుంది.

భాగీని ఎగతాళి చేసిన మంగళ.. అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. కలకత్తా వెళ్లిపొమ్మన్న అమర్​!
భాగీని ఎగతాళి చేసిన మంగళ.. అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. కలకత్తా వెళ్లిపొమ్మన్న అమర్​!

NNS 9th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 9) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్​కి దగ్గరయ్యేందుకు బాబ్జీతో ఫోన్​ చేయించి మనోహరిని చంపేస్తానని బెదిరించమని చెబుతుంది. దాంతో అమర్​ బాబ్జీ, మనోహరి ఫోన్​ నెంబర్లు ట్రాక్​ చేయమని రాథోడ్​కి చెబుతాడు.

అడ్డంగా దొరికిపోయిన మనోహరి

అమర్​ ఫోన్​ చేయడంతో తన ప్లాన్ సక్సెస్​ అయ్యిందని సంబరపడిపోతూ మనోహరి ఇంటికి వెళ్తుంది. వెంటనే బాబ్జీని సిమ్‌ మార్చమని చెప్తుంది. సరేనని అలాగే చేస్తాడు. అమర్‌.. రాథోడ్‌కు ఫోన్‌ చేసి బాబ్జీ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో కనుక్కోమని చెప్తాడు.

అలాగే మనోహరి ఫోన్‌ కూడా ఇంటికి వెళ్లే వరకు అబ్జర్వ్‌ లో పెట్టమని చెప్తాడు. ఆఫీసుకు ఫోన్‌ చేసిన రాథోడ్ ఫోన్‌ మాట్లాడుతూ షాక్‌ అవుతాడు. ఫోన్‌ కట్‌ చేసి మనోహరి, బాబ్జీ ఒకే ప్లేస్ లో ఉన్నట్టు ట్రేస్‌ అయిందట సార్‌ అని చెప్తాడు. అమర్‌ ఆలోచనలో పడిపోతాడు.

భాగీకి ధైర్యం చెప్పిన రామ్మూర్తి

రామ్మూర్తి ఇంటికి వచ్చి ఓసే మంగళ.. మంగళ అని పిలుస్తాడు. అబ్బాబ్బా ఇదేమైనా లంకంత కొంపా ఉన్నది.. ఒకటే గది దానికెందుకు అంతలా అరుస్తావు అంటుంది మంగళ. ఇదిగో తీసుకో.. ఇక్కడ నిలబడి నా ముఖం చూస్తావేంటి..? వెళ్లి కడుగు అంటాడు రామ్మూర్తి. నీ ముఖం కూడా పక్కకు తిప్పి చూస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో నీకు అర్థం అవుతుంది అంటుంది మంగళ.

పక్కకు చూడగానే భాగీ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. రామ్మూర్తి షాక్‌ అవుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. భాగీ పలకదు. మొగుడు కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టాడు.. అది ఎలా చెప్తుంది అని మంగళ అంటుంది. భాగీ కూడా అవునని అంటుంది. భాగీ నువ్వేమి బాధపడకు అమ్మా.. అది నీ ఇల్లు, నీ కాపురం మనస్పర్థలు లేని కాపురాలు ఉండవమ్మా.. వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలి. ఈరోజు పొమ్మన్న బాబుగారే రేపు రమ్మంటారు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని ధైర్యం చెబుతాడు రామ్మూర్తి.

భాగీ కోసం ఏడ్చేసిన రామ్మూర్తి

సరే నాన్నా.. నాకు భయమేసింది నాన్నా.. అంటుంది భాగీ. నువ్వు ఏడ్చి ఈ నాన్నను కూడా ఏడ్పించావు. కొద్ది రోజులు పోతే అన్ని సర్ధుకుంటాయి అని రామ్మూర్తి చెప్తుండగానే భాగీ అనుమానంగా ఈ క్యారేజ్‌ కట్టుకుని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. అనుమానం రాకుండా సర్ది చెప్పి బయటకు వెళ్లిపోతాడు రామ్మూర్తి.

విషయం తెలియగానే ముసలోడు గుండె ఆగి చనిపోతాడు అనుకుంటే ఇంత హుషారుగా ఉన్నాడేంటి.. అని మనసులో అనుకుంటుంది మంగళ. బయటకు వెళ్లిన రామ్మూర్తి ఏడుస్తుంటాడు. భాగీ పరిస్థితి తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తాడు.

భాగీ లేక దిగాలుగా అమర్ కుటుంబం

గార్డెన్‌ లో కూర్చున్న గుప్త దగ్గరకు డల్లుగా వస్తుంది ఆరు. ఏమైనది బాలిక అంటాడు గుప్త. ఇల్లంతా బోసి పోయింది. మిస్సమ్మ ఉంటే ఇల్లంతా ఎంత హడావిడిగా ఉండేది గుప్త గారు. మిస్సమ్మ వెళ్లి 24 గంటలు కాలేదు. అప్పుడే మిస్సమ్మ లేని వెలితి అందరి ముఖాల్లోనూ కనిపిస్తుంది అంటుంది ఆరు.

నిజమే బాలిక. నీ కుటుంబము నీవు లేవన్న విషయం తెలిసిన క్షణములో ఎంత బాధపడ్డారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటాడు గుప్త. పిల్లలు పైన ఉన్నారు. అత్తయ్యోమే ఒంటరిగా కుస్తీ పడుతుంది. మిస్సమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందో.. ఏమో..? అంటుంది ఆరు.

మనోహరిని నిలదీసిన అమర్

ఇంతలో మనోహరి హ్యాపీగా ఇంటికి వస్తుంది. ఆరు కోపంగా మనోహరిని చూసి తిట్టుకుంటుంది. ఎవరు ఎంత ఎక్కువగా ఏడిస్తే దీనికి అంత ఆనందంగా ఉంటుంది గుప్త గారు అంటుంది. లోపలికి వెళ్లిన మనోహరిని చూసి భోజనం చేయమని అంజు చెప్తుంది. నిర్మల చేసిన వంట తినలేక అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో అమర్‌ ఇంటికి వస్తాడు. ఏమైంది ఈయనెందుకు అంత పాస్ట్‌ గా వెళ్తున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్లి ఏం చేస్తాను త్వరగా రండి గుప్త గారు అని ఇద్దరు కిటికీ దగ్గరకు వెళ్తారు.

ఇంట్లోకి వెళ్లిన అమర్‌ గట్టిగా మనోహరిని పిలుస్తాడు. మనోహరి హ్యాపీగా ఇంటికి రాగానే నన్నే పిలుస్తున్నాడు అంటే అనుకుంటూ బయటకు వస్తుంది. నువ్వు మధ్యాహ్నం బయటకు ఎందుకు వెళ్లావు. చెప్పు మనోహరి అంటాడు అమర్. అది.. అమర్‌.. ఫ్రెండ్‌ ను కలవడానికి అంటుంది మనోహరి. నిన్ను చంపడానికి బాబ్జీ నాకు ఫోన్‌ చేసినప్పుడు ఇద్దరు పక్కనే ఉన్నట్లు తెలిసింది అంటాడు అమర్​.

చెప్పండి మేడం సార్‌ అడుగుతున్నారు కదా..? బాబ్జీ గాడు సార్‌కు ఫోన్‌ చేసినప్పుడు మీరు వాడి పక్కన ఎలా ఉన్నారు అంటాడు రాథోడ్​. నేను వాడి పక్కన ఉండటమేంటి? ఎందుకు ఉంటాను అంటున్న మనోహరితో ఉన్నావు మనోహరి అది అర్థం కాకే నిన్ను అడుగుతున్నాను అంటాడు అమర్​.

అమర్‌ను కన్విన్స్ చేసిన మనోహరి

గుప్త గారు మిస్సమ్మను పంపించేశాక మా ఆయనకు దగ్గర కావడానికి ప్లాన్‌ చేసినట్టు ఉంది అంటుంది ఆరు. ఆ బాలిక నువ్వు అనుకున్నట్టు కాదు అంటాడు గుప్త. అంటే వాడు నా పక్కనే ఉండి నన్ను చంపేస్తానని నీకు ఫోన్‌ చేశాడేమో.. అంటుంది మనోహరి. నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్‌ కాదు. కలకత్తా వెళ్లిపో.. అంటాడు అమర్​. మనోహరి షాక్‌ అవుతుంది. వెంటనే తన మాటలతో అమర్‌ ను కన్వీన్స్‌ చేస్తుంది.

అమర్‌ సరే ఇక్కడే ఉండు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్తాడు. సరేనని లోపలికి వెళ్తుంది మనోహరి. భాగీని అమర్​ తిరిగి తీసుకొస్తాడా? మనోహరి ప్లాన్ బయటపడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner