NNS August 16th Episode: హాల్లో అరుంధతి ఫొటో- మనోహరికి శివరామ్ వార్నింగ్- భాగీ పిచ్చిదనుకున్న ముత్తయిదువులు- పూజలో ఆరు
Nindu Noorella Saavasam August 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌లో హాల్లో అరుంధతి ఫొటో పెడుతుంది నిర్మల. చనిపోయిన వాళ్ల ఫొటో పూజ జరుగుతుండగా ఉండటం మంచిది కాదేమో అని మనోహరి అంటుంది. దాంతో శివరామ్ సీరియస్ అవుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 16th August Episode) అరుంధతి బతికి ఉండగా ప్రతి సంవత్సరం మంగళ గౌరీ వత్రం తప్పకుండా చేసేదని గుర్తు చేసుకుంటూ హాల్లో తన ఫొటో పెడుతుంది నిర్మల. అది చూసి పరుగున గుప్త దగ్గరకు వచ్చి ఎలాగైనా ఆ ఫొటోని భాగీ చూడకుండా చెయ్యమని కోరుతుంది అరుంధతి.
ఫొటో ఎవరు పెట్టారు
పిల్లలు బాధపడుతుంటే వాళ్లని ఓదారుస్తుంది నిర్మల. పూజ జరుగుతున్నంతసేపు మీ అమ్మ ఫొటో ఇక్కడ ఉంటే మీ అమ్మే ఉన్నట్లు అని నచ్చజెప్పుతుంది నిర్మల. మనోహరి కిందకి వచ్చి ఏంటి ఇంట్లో హడావుడి అని అడుగుతుంది. మిస్సమ్మ వ్రతం చేసుకుంటుందని చెబుతుంది నిర్మల. ఎదురుగా ఉన్న అరుంధతి ఫొటో చూసి ఈ ఫొటో ఇక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? అంటుంది మనోహరి.
ఎవరు పెడితే ఏంటమ్మా.. ఇంటి కోడలు ఫొటో పెట్టుకుంటే తప్పేముంది అంటుంది నిర్మల. పూజ జరుగుతున్న చోట చనిపోయిన ఆరు ఫొటో పెట్టడం మంచిది కాదేమో అంటుంది మనోహరి. ఇక చాలు.. ఆపు.. మా కోడలిని ఇంకోసారి అశుభం అంటే ఊరుకునేది లేదు అని గట్టిగా హెచ్చరిస్తాడు శివరామ్. ఇంకోసారి హద్దు దాటి ప్రవర్తించవద్దని అనడంతో కంగారు పడుతుంది మనోహరి.
అడ్డుగా మనోహరి
శివరామ్‌ని క్షమించమని కోరుతుంది మనోహరి. మిస్సమ్మ రాకముందు ఎలాగైనా ఆ ఫొటో అక్కడ నుంచి తీసేయించాలనుకుంటుంది మనోహరి. అప్పుడే మిస్సమ్మ ముత్తైదవులని తీసుకుని ఇంటికి వస్తుంది. తన ఫొటోని ఎలాగైనా తీసేలా చూడండని గుప్తని బతిమాలుతుంది అరుంధతి. మిస్సమ్మ ఇంట్లోకి రావడం చూసి అరుంధతి ఫొటోకి అడ్డుగా నిల్చుంటుంది మనోహరి.
ఇంటి బయట నిల్చున్న అరుంధతిని చూసి ఏంటక్కా.. ఇంట్లో ఉండకుండా బయటకి ఎందుకు వచ్చావు? అని అడుగుతుంది మిస్సమ్మ. కొడైకెనాల్ వాతావరణం అలవాటు కదా.. చాలా వేడిగా ఉంది అంటుంది అరుంధతి. వెంటనే గుప్త హెచ్చరించడంతో కవర్ చేస్తుంది. భాగీ ఎవరితో మాట్లాడుతుందో అర్థంకాక ముత్తైదువులు ఆశ్చర్యపోతారు.
గొవడ ఎందుకు
నిర్మలమ్మ కోడలు తెలివైందని చెబుతుంది మరి.. ఈ అమ్మాయిని చూస్తే చిప్ మిస్సింగ్ అనిపిస్తోంది అనుకుంటారు. అరుంధతిని అందరికీ పరిచయం చేస్తుంది మిస్సమ్మ. అందరూ అయోమయంగా చూస్తుంటారు. అరుంధతిని మీ పేరేంటక్కా.. ? అని అడుగుతుంది భాగీ. ముత్తైదవులందరూ భాగీకి పిచ్చి అనుకుంటారు. ఎందుకు గొడవ అని నమస్కారం చెబుతారు. అందరూ ఇంట్లోకి వెళ్తారు.
ఇంట్లోకి వచ్చి అత్తయ్యా.. మీరు చెప్పినట్లే అయిదుగురు ముత్తైదువులను తీసుకొచ్చాను అంటుంది మిస్సమ్మ. నలుగురే ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతారు. మనోహరిని అయిదో ముత్తైదవంటుందని పెళ్లి కాకుండా ఎలా ముత్తైదువు అవుతుంది అంటుంది నిర్మల. కానీ, మిస్సమ్మ అరుంధతి గురించి మాట్లాడుతుందనుకుంటుంది మనోహరి.
నాకెందుకు ఈ శిక్ష
అందరూ అయోమయంగా చూస్తుండగా ఏం అనుకోవద్దక్కా.. అంటూ అరుంధతిని పూజలో కూర్చోమంటుంది మిస్సమ్మ. అరుంధతి తన పక్కనే ఉందని అర్థం చేసుకున్న మనోహరి భయంతో వణికిపోతుంది. అమర్ ఆఫీస్‌కి వెళ్లాడని, వెంటనే ఫోన్ చేసి పిలుస్తానని లోపలకు వెళ్తుంది నిర్మల. ఉన్నవి సరిపోవని కొత్తగా అతన్ని కూడా పిలిపిస్తున్నారా ప్రభు.. ఎందుకు నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు అంటాడు చిత్రగుప్త.
ఫొటోకి అడ్డంగా నిల్చున్న అరుంధతిని కూర్చోమంటుంది మిస్సమ్మ. అరుంధతి పక్కనే ఉందని మాట్లాడుతున్న మనోహరిని చూసి ఆంటీ.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అమ్ము. మిస్సమ్మ అరుంధతి ఫొటో చూస్తుందా? నిజం బయటపడబోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!