NNS October 8th Episode: అమ్ముకు అరుంధతి సీక్రెట్ చెప్పిన భాగీ- భయంతో రాథోడ్ పరుగు- ఆరు ఆత్మకు మానవరూపం? షాక్‌లో గుప్తా!-nindu noorella saavasam serial october 8th episode bhagi reveals secret to ammu nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 8th Episode: అమ్ముకు అరుంధతి సీక్రెట్ చెప్పిన భాగీ- భయంతో రాథోడ్ పరుగు- ఆరు ఆత్మకు మానవరూపం? షాక్‌లో గుప్తా!

NNS October 8th Episode: అమ్ముకు అరుంధతి సీక్రెట్ చెప్పిన భాగీ- భయంతో రాథోడ్ పరుగు- ఆరు ఆత్మకు మానవరూపం? షాక్‌లో గుప్తా!

Sanjiv Kumar HT Telugu
Oct 08, 2024 11:03 AM IST

Nindu Noorella Saavasam October 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌‌లో స్కూల్‌కు పెద్దవాళ్లను తీసుకెళ్లేందుకు కాకా పడుతుంటుంది అంజు. మరోవైపు అమ్ముకు అరుంధతి చెప్పిన సీక్రెట్ చెబుతుంది భాగీ. దాంతో అమ్ము షాక్ అవుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 8th October Episode)లో స్కూల్​కి పేరెంట్స్​ని తీసుకుని రావాలని ప్రిన్సిపల్​ చెప్పడంతో అంజు అందరినీ కాకా పడుతూ ఉంటుంది. శివరామ్​ కూడా స్కూల్​కి రానని చెప్పడంతో ఇక అంజుకి మిస్సమ్మే దిక్కు అనుకుంటారు పిల్లలు.

అమ్మ లేదనే బాధ

వెంటనే ముగ్గురు భాగీ దగ్గరకు వెళ్లి అంజు నీ దగ్గరకు హెల్ప్‌ అడగడానికి వస్తుంది. కానీ, నువ్వు ఒప్పుకోవద్దని చెప్తారు. నేను ఇంట్లో వాళ్ల ప్రేమను గెలవాలనుకుంటాను వాళ్లపై గెలవాలనుకోవట్లేదు. అలాంటప్పుడు నేను అంజుతో ఎలా పోట్లాడతా అని భాగీ చెప్పగానే పిల్లలు అందరూ ఎమోషన్‌ అవుతూ నిజంగా మా అమ్మలాగే ఉంటావు. మా అమ్మలాగే మాట్లాడతావు. నువ్వొచ్చాక అమ్మ లేదనే బాధ కొంచెం తగ్గింది అంటారు పిల్లలు.

సరే అమ్ము నువ్వు నేను కలిసి సండే ఎవరికీ తెలియకుండా పార్లర్‌కు వెళ్దామా..? అంటుంది భాగీ. పార్లర్‌ ఏంటి మిస్సమ్మ.. అని అడుగుతుంది అమ్ము. అదే సండే ఆప్టర్‌‌నూన్‌ ఈ లేజీ బాయ్స్‌ పడుకున్నాక.. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు అరుంధతి అక్కా పార్లర్‌‌కు వెళ్లే వారట కదా? అని భాగీ అనడంతో ఆ విషయం నీకెలా తెలుసు మిస్సమ్మ అంటుంది అమ్ము.

నాకు మా అమ్మకు తప్ప ఎవరికీ తెలియదు. ఆఖరికి డాడీ వాళ్లకు కూడా తెలియదు. అసలు ఎవరు చెప్పారు నీకు అంటుంది అమ్ము. పక్కింటి అక్క చెప్పింది అంటుంది భాగీ. ఆవిడకు ఎలా తెలిసింది అంటుంది అమ్ము. ఆవిడ ఆరు అక్క ఫ్రెండ్స్‌ అంట అమ్ము. ఎప్పుడో మాటల్లో చెప్పిందేమో అనగానే అమ్మ ఎవరికీ చెప్పే చాన్సే లేదు మిస్సమ్మ ఎందుకంటే అది మా ఇద్దరి సీక్రెట్‌ అని అమ్మే చెప్పేది అంటూ అసలు ఆ పక్కింటి అవిడ ఎలా ఉంటారని పిల్లలు అడుగుతారు.

ఓవర్ కంపెన్సీట్ చేద్దాం

మిస్సమ్మ పోలికలు చెప్పగానే మేము అడిగింది పక్కింటి ఆవిడ పోలికలు మా అమ్మ పోలికలు కాదని అంటారు. ఇంతలో బయట అంజు ఏం చేస్తుందో చేద్దాం పదండి అని బయటకు వస్తారు. బయట అంజు తన మాటలతో అమర్‌ను కాకా పడుతుంది. తన యాక్టింగ్‌‌తో అదరగొడుతుంది. మిస్సమ్మ ఇది ఓవర్‌‌గా మాట్లాడుతుంది అంటుంది అమ్ము. దీనికంతటికి ఓవర్‌ కంపెన్సీట్‌ చేద్దాం అమ్ము అంటుంది భాగీ.

డాడ్‌ కాళ్లు నొప్పిగా ఉన్నాయా..? పట్టమంటావా? అని అమర్​ని అడగగానే అంజు వద్దు అమ్మా.. అంటాడు అమర్​. ఒళ్లు నొప్పిగా ఉందా డాడ్‌.. పడతాను ఏమీ అనొద్దు డాడ్‌. అమ్మో నా మాటలు వినేసినట్టున్నారు.. బెటాలియన్‌ అంతా వచ్చారు అంటే నా ప్లాన్‌ అంతా ప్లాప్‌ చేస్తారు అని మనసులో అనుకుంటుంది.

పిల్లలు.. అంజు పాపను చూసి ఎలా రెస్పాన్స్‌బులుగా ఉండాలో నేర్చుకోండి. పొద్దునే లేచినప్పటి నుంచి ఎంత పని చేస్తుంది అంటుంది భాగీ. అంత చేసింది అంటే ఎంత అవసరం ఉందో అంటుంది అమ్ము. ఏంటి అమ్ము ఏదో అంటున్నావు అని అమర్​ అడగ్గానే డాడ్‌ నన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నది. అంటే లైక్‌ ఓవర్‌ హ్యపీనెస్‌ డాడ్‌ . అంతే కదా అమ్ము అని కవర్​ చేస్తుంది అంజు. అంతే అంతే చాలా ఓవర్‌ గానే ఉంది అంటూ పిల్లలు ముగ్గురు కలిసి అమర్‌ దగ్గర అంజును ఇరికిస్తారు.

రెండు సార్లు బాల్ రావడంతో

ఏం చెప్పాలో తెలియక అంజు తల బాదుకుంటుంది. ఏడుస్తుంది. ఇంట్లో ఉంటే డాడ్‌ తిడతాడు. స్కూల్‌‌కు వెళ్దామంటే ఆ రాక్షసి రానివ్వదు అని బాధపడుతుంటే అందరూ వెళ్లిపోతారు.

కారు తుడుస్తూ ఉన్న రాథోడ్‌కు బాల్‌ వచ్చి తగులుతుంది. పిల్లలు బాల్‌ అడగ్గానే తిడుతూ ఆ బాల్‌ ఇస్తాడు. అలాగే రెండు సార్లు బాల్‌ రాథోడ్ మీదకు రాగానే మూడోసారి బాల్‌‌ను అరుంధతి ఉన్నవైపు విసిరుతాడు.

ఆరు ఆ బాల్​ని పట్టుకుంటుంది. దీంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు. బాల్‌ గాల్లో ఆగిందేంటి అనుకుంటాడు. ఆరు కూడా షాక్‌ అవుతుంది. బాల్‌ తిరిగి రాథోడ్‌కు విసురుతుంది. భయంతో రాథోడ్‌ కారు లోపలికి వెళ్లి కూర్చుంటాడు. గుప్త ఆలోచిస్తుంటాడు. ఇంతలో అరుంధతి వచ్చి అనుమానంతో నేను బాల్‌ ఎలా పట్టుకోగలిగాను అని గుప్తను అడుగుతుంది.

మానవరూపం వస్తుందా?

అరుంధతికి మళ్లీ మానవరూపం వస్తుందా? ఆత్మకు ఎలాంటి శక్తులు రానున్నాయి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner