NNS September 28th Episode: భాగీ మెడపై కత్తి పెట్టిన టెర్రరిస్ట్.. అమర్ మోసంపై జోకులు.. బాలకృష్ణ డైలాగ్ కొట్టిన అంజు
Nindu Noorella Saavasam September 28th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న భాగీ మెడపై టెర్రరిస్ట్ కత్తి పెట్టి బెదిరిస్తాడు. కానీ, అమర్ కాపాడుతాడు. తర్వాత అమర్ చేసిన మోసంపై మిస్సమ్మపై ఇంట్లోవాళ్లు జోకులు వేస్తారు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 28th September Episode) రాథోడ్ ద్వారా నిజం తెలుసుకుంటుంది భాగమతి. ఆ తర్వాత అమర్ దగ్గరకు వచ్చి గుర్రుగా చూస్తుంటుంది. ఏంటీ అలా చూస్తున్నావు అని అమర్ అడగుతాడు.
తడబడిన అమర్
నీ గురించి ఇప్పుడే నిజం తెలిసింది. నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ నన్ను చుడిదార్ వేసుకోమని ఎందుకు చెప్పారు అని అడుగుతుది భాగీ. దీంతో అమర్ తడబడుతూ రన్నింగ్, జంపింగ్ అన్నింటికి కంపర్ట్‌గా ఉంటుందని అమర్ అనడంతో భాగీ నేనేమైనా ఒలంపిక్స్‌కు వెళ్తున్నానా? అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి అంటుంది.
మరోవైపు భాగీకి ఎయిమ్ చేసిన అరవింద్ గన్ స్టక్ అవడంతో షాక్ అవుతాడు. ఇన్ని రోజులు లూజు లూజు అంటుంటే ఏమో అనుకున్న కానీ నిజంగా నేను లూజే అంటుంది భాగీ. నిజం తెలిస్తే నిదానంగా ఉటుందనుకుంటే ఇలా కారాలు మిరియాలు నూరుతుందేంటి? అనుకుంటుంది అరుంధతి.
మీకు చాలా పనులు ఉన్నట్లున్నాయి. మీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చేయండి. నేను వెళ్తున్నా.. అంటూ బయల్దేరిన భాగీని మిస్సమ్మ.. మిస్సమ్మ ఆగు.. అని ఆపుతాడు అమర్. సారీ చెప్పండి.. అని అడగ్గానే అమర్ సారీ చెప్పబోతుంటే అరవింద్ వచ్చి భాగీ మెడకు కత్తి పెట్టి దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తా.. అని బెదిరిస్తాడు.
ఆఖరుగా చెప్పు
రేయ్ నీకు కావాల్సింది నేను కదా? నేను వచ్చేస్తాను. మిస్సమ్మను వదిలిపెట్టు అంటాడు అమర్. నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు. నువ్వు ఏడవడం. నీ ఓటమి కావాలి అంటాడు అరవింద్. మిస్సమ్మ నీకేం కాదు నేనున్నాను అంటాడు అమర్. నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆఖరిగా చెప్పు అంటున్న అరవింద్‌తో చెప్పాల్సింది నేను కాదురా.. నీవాళ్లకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకో.. ఈరోజు నువ్వు చచ్చిపోతావు అంటూ అమర్ తన పక్కనే ఉన్న బకెట్‌ను తన్నగానే అది అరవింద్‌కు తగులుతుంది.
అరవింద్ కిందపడిపోతాడు. ఇంతలో అమర్, అరవింద్‌ను అతడి అనుచరుడిని కొడతాడు. అరవింద్ రాథోడ్‌ను బందీగా చేసుకుని పారిపోతాడు. సింగ్ వేషంలో ఉన్నది రాథోడ్ అని తెలుసుకున్న అమర్ కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో అందరూ చూస్తుంటే భాగీ నెత్తిన దుప్పటి కప్పుకుని కూర్చుని ఉంటుంది.
ఏయ్ ఎవ్వరూ నవ్వకండి. ఇది చాలా సీరియస్ మాటర్ అని బాలకృష్ణ డైలాగ్ కొట్టిన అంజు.. ఇలాంటి విషయాల్లో ఎవరైనా నవ్వుతారా? పాపం మిస్సమ్మ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అంటుంది. పాపాత్మురాలా? నువ్వే నవ్వుతూ మళ్లీ నువ్వే నవ్వొద్దని చెప్తావా? చూశావా మిస్సమ్మ దీని డబుల్ యాక్షన్ అని బ్రహ్మానందం డైలాగ్ కొడుతుంది అమ్ము.
జోకర్‌లా అనిపిస్తుంది
మీ అందరికీ నేను లోకువై పోయాను కదా? ఆయనేమో నా ప్రాణాన్ని పణంగా పెట్టారు. అంజుకేమో నన్ను చూస్తే జోకర్‌లా అనిపిస్తుంది. అంతే కదా? అంటుంది మిస్సమ్మ. ప్లీజ్ మిస్సమ్మా నీ ఫేస్ కాస్త వేరే సైడుకు తిప్పుకోవా? నాకు నవ్వు ఆగడం లేదు. అడగకుండా డాడ్ నిన్ను బయటకు తీసుకెళ్తా అన్నప్పుడే నీకు డౌట్ రాలేదా అంటూ ఏడిపిస్తుంది అంజు.
బయటకు వెళ్దాం. చుడీదార్ వేసుకో అనగానే భూమ్మీద ఆగావా మిస్సమ్మ. ఎంత బిల్డప్ ఇచ్చావు. ఎన్ని మాటలు మాట్లాడావు అంటుంది మనోహరి. మిస్సమ్మ మా డాడ్ ఓవర్ టైం డ్యూటీ చేస్తారు. కానీ, ఆఫీస్ వదిలేసి ఔటింగ్‌కు వెళ్లరమ్మా.. ముందు అది తెలుసుకో అమ్మా.. అంటున్న అంజుని చాల్లే ఆపండి పాపం మిస్సమ్మ అసలే హడలిపోయి ఉంటే మీ మాటలతో ఇంకా బాధపెడుతున్నారు అంటాడు శివరామ్.
ఏయ్ పొట్టి నువ్వు మిస్సమ్మను ఓదార్చకపోయినా పర్వాలేదు. బాధపెట్టకుండా ఉండు చాలు. ముందు నువ్వు లోపలకి వెళ్లు అంటుంది నిర్మల. ఓ.. ఇది ఓదార్పు యాత్రా నాకు తెలియక జాయిన్ అయిపోయానే అంటుంది అంజు. అయ్యో అప్పటికీ అందరూ అన్నారు. అంజలిని నెత్తిన ఎక్కించుకోవద్దని. కోతిలా తయారవుతుందని అనుకుంటుంది అరుంధతి.
ప్రాణత్యాగం చేయాలనుకుంది
అంజు పాప దయచేసి నువ్వు లోపలికి వెళ్లవా? ఇవాళ జరిగింది నువ్వు చూసి ఉంటే ఇలా మాట్లాడి ఉండేదానివి కాదు. మిస్సమ్మ దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసేందుకు కూడా సిద్దపడింది. మీరందరూ తనని చూసి గర్వపడాలి అంటాడు రాథోడ్. మిస్సమ్మ ప్రాణ త్యాగం చేయాలనుకోలేదు. మీరు బలవంతంవగా లాక్కోవాలనుకున్నారు అని అందరూ నవ్వుకుంటారు.
మిస్సమ్మ ఛాలెంజ్ చేసి అమర్ రూంలోకి వెళ్తుంది. కోపంలో స్పీడుగా వస్తున్న మిస్సమ్మ జారి కిందపడబోతుంటే అమర్ పట్టుకుంటాడు. ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇంతలో అరుంధతి వచ్చి చూసి సిగ్గుపడుతుంది. భాగీ మాత్రం అమర్ మీద నుంచి లేచి తిడుతూ అక్కలా నేను చనిపోతే అని అంటుండగానే అమర్ భాగీ నోరు మూస్తాడు. పక్కనే ఉండి చూస్తున్న ఆరు ఎమోషన్ అవుతుంది.
మాట వరసకు కూడా ఇంకోసారి ఆ మాట అనకు మిస్సమ్మ. నీకేం కాదు కాకూడదు. కానివ్వను అంటాడు అమర్. భాగీపై అమర్ది ప్రేమా.. బాధ్యతా..? మనోహరి తరువాతి ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!