NNS July 10th Episode: మిస్సమ్మనే ఆర్జే భాగీ- తెలిసిన నిజం- రాథోడ్‌ను సాయమడిగిన మనోహరి- బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ!
Nindu Noorella Saavasam July 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 10వ తేది ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన కరుణ ఆర్జే భాగీనే మీ కోడలు మిస్సమ్మ అని అమర్ తల్లిదండ్రులకు చెబుతుంది. తర్వాత రాథోడ్‌ను సహాయమడిగిన మనోహరి అతనిపై డౌట్ పడుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 10th July Episode) మిస్సమ్మను కలవడానికి కరుణ వస్తుంది. హాల్లో కూర్చున్న నిర్మల, శివరామ్ కరుణని పలకరించి మిస్సమ్మ పైన ఉందని చెబుతారు. త్వరగా వెళ్లాలి అంకుల్.. ఎఫ్ఎమ్ ఆఫీస్‌లో పనుంది అంటుంది కరుణ. దాంతో నువ్వు రేడియోలో పనిచేస్తావా అని అడుగుతాడు శివరామ్.
మీ కోడలే ఆర్జీ భాగీ
అవునంకుల్.. మీరు ఎఫ్ఎమ్ వింటారా? అంటుంది కరుణ. అన్ని ప్రోగ్రామ్‌లు కాదు గానీ ఆర్జే భాగీ ప్రోగ్రామ్ వినేవాళ్లం. మా పెద్ద కోడలు మాకు అలవాటు చేసింది. తనకి భాగీ అంటే చాలా అభిమానం. ఆ అమ్మాయి మా ఇంట్లో మనిషిలానే అంటుంది నిర్మల. ఇంట్లో మనిషి లాంటిదేంంటి ఆంటి.. ఇంట్లో మనిషే కదా? అంటుంది కరుణ. ఏం అర్థంకాక అయోమయంగా చూస్తారు నిర్మల, శివరామ్.
అవును ఆంటీ.. మీ కోడలే ఆర్జే భాగీ. రేడియోలో ఉద్యోగం మానేస్తేనే మీ ఇంట్లో పిల్లల్ని చూసుకోడానికి కేర్ టేకర్‌గా జాయిన్ అయింది కదా.. మీరు నన్ను ఆటపట్టిస్తున్నారనుకున్నా.. మీకు నిజంగా తెలియదా? అంటూ భాగీని కలవడానికి పైకి వెళ్తుంది కరుణ. ఒంటరిగా కూర్చుని అమర్ గురించి ఆలోచిస్తుంది భాగీ. తను వచ్చిన సంగతి కూడా గమనించకుండా ఉన్న భాగీని చూసి ఆటపట్టిస్తుంది కరుణ.
ఇదంతా ప్రేమేనా
అదంతా బాధ అనుకుని విడాకుల కోసం ఓ మంచి లాయర్ని మాట్లాడానని వెంటనే అప్లై చేద్దామని అంటుంది కరుణ. దాంతో కోపంగా నిన్ను నేను అడిగానా.. ఆయనతో విడాకులు కావాలని నీకు చెప్పానా అని కరుణను కొడుతుంది మిస్సమ్మ. అదేంటే.. అలా అంటున్నావు. ఆయన పేరెత్తితేనే చిర్రుబుర్రులాడేదానివి, ఆయన కనపడితేనే కస్సుబుస్సుమనేదానివి.. ఏంటి ప్రేమనా.. అంటుంది కరుణ.
అవునే.. అప్పుడంటే ఆయనంటే ఏంటో తెలియక అలా చేశాను. ఇప్పుడు ఆయన గురించి తెలిశాక ప్రేమించకుండా ఉండలేకపోతున్నా. ఆయనకు కూడా నామీద ప్రేమ పుట్టే మార్గం ఉంటే చెప్పవే అని కరుణను అడుగుతుంది మిస్సమ్మ. అదెంత పని.. నేను చేసే ప్రోగ్రామ్‌లో చాలా సలహాలు ఇచ్చి ఎంతోమంది ప్రేమికులను కలిపాను. నీ ప్రేమను కూడా సక్సెస్ చేసే బాధ్యత నాది అంటూ మిస్సమ్మ చెవిలో ప్లానేంటో చెబుతుంది కరుణ.
దిగాలుగా అమర్ పేరెంట్స్
సంతోషంతో ఇద్దరూ గంతులు వేస్తారు. నిర్మల, శివరామ్ హాల్లో కూర్చుని కరుణ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో.. అత్తయ్య, మామయ్య మిస్సమ్మతో నిజం చెప్పేస్తారేమో.. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు అనుకుంటుంది అరుంధతి. ఇంతలో అమర్ రావడంతో ఏవండీ.. మీరైనా మిస్సమ్మకు నిజం తెలియకుండా చూడండి అనుకుంటుంది అరుంధతి. దిగులుగా కూర్చున్న తల్లిదండ్రులను ఏమైందని అడుగుతాడు అమర్.
మిస్సమ్మనే ఆర్జే భాగీ అని తెలిసిందని చెబుతారు. తనకి ముందే తెలుసని, కావాలనే మిస్సమ్మకు అరుంధతి లేదనే విషయం చెప్పలేదని, చెబితే తాను తట్టుకోలేదని వాళ్లని కూడా చెప్పొద్దని నచ్చజెప్పుతాడు అమర్. అప్పుడే మిస్సమ్మ అక్కడకు రావడంతో కాఫీ కావాలని అక్కడ నుంచి పంపిస్తాడు అమర్. మిస్సమ్మ గురించి ఆలోచించి మనం కూడా అమర్ చెప్పినట్లే చేద్దామండి అంటుంది నిర్మల.
సహాయమడిగిన మనోహరి
గార్డెన్‌లో కూర్చుని ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతున్న రాథోడ్ దగ్గరకు వచ్చి తనకి ఓ సాయం చేయమని అడుగుతుంది మనోహరి. ఏంటో చెప్పండి మేడం అంటున్న రాథోడ్‌తో ఒక నెంబర్ నుంచి మెసెజ్ వచ్చిందని, ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవడం కుదురుతుందా అని అడుగుతుంది. తప్పకుండా కుదురుతుంది మేడమ్.. పది నిమిషాల్లో ఆ నెంబర్ ఎవరిదో, వాడి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి అంటాడు రాథోడ్.
అయితే వెంటనే తనకు ఆ పనిచేసి పెట్టమంటుంది. కానీ, అది తన వల్ల కాదని, సార్ చెబితేనే అవుతుందటాడు రాథోడ్. అమర్‌కి చెప్పాలా.. అయితే వద్దులే అంటూ కంగారు పడుతుంది మనోహరి. అదేంటి మేడమ్ సార్‌కి చెప్పాలంటే అలా కంగారు పడుతున్నారు. ఎవరైనా మెసేజ్‌లు, వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడుగుతాడు రాథోడ్.
అనుమానంతో అడిగా
నేను నీకు చెప్పలేదు కదా నీకెలా తెలిసింది అంటుంది మనోహరి. అంటే మామూలుగా ఓ నెంబర్ గురించి తెలుసుకోవాలని అడిగితే అదేనేమో అనే అనుమానంతో అడిగా అని రాథోడ్ అనగానే అసలు బ్లాక్మెయిల్ చేస్తుంది రాథోడ్ ఆ.. అని ఆలోచిస్తూ లోపలకు వెళ్తుంది మనోహరి. భాగీని బాగా ముస్తాబు చేస్తుంది కరుణ.
మరీ అతిగా ఉన్నట్లుందే అంటున్న భాగీని వారిస్తూ మొండోడైన నీ మొగుడ్ని పడేయాలంటే ఆ మాత్రం ఉండాలిలే అంటుంది కరుణ. భాగీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అమర్ భాగీ ప్రేమలో పడతాడా? అనే విషయాలు తెలియాలంటే జులై 11న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!