NNS March 25th Episode: అరుంధతిని చూసిన అమర్.. లెటర్ మార్చిన మనోహరి.. ఓడిన మిస్సమ్మ- రాథోడ్‌కు వార్నింగ్-nindu noorella saavasam march 25th episode manohari changed amar children latter nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 25th Episode: అరుంధతిని చూసిన అమర్.. లెటర్ మార్చిన మనోహరి.. ఓడిన మిస్సమ్మ- రాథోడ్‌కు వార్నింగ్

NNS March 25th Episode: అరుంధతిని చూసిన అమర్.. లెటర్ మార్చిన మనోహరి.. ఓడిన మిస్సమ్మ- రాథోడ్‌కు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 12:58 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌లో తనకు విరుద్ధంగా పిల్లలు లెటర్ రాసినట్లు తెలుసుకున్న మనోహరి దాన్ని మార్చేస్తుంది. మరోవైపు తన భార్యను చూస్తాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 25th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 25th March Episode) పిల్లలు తన పెళ్లి చెడగొట్టడానికి లెటర్‌ రాసారని తెలుసుకుని మనోహరి కోప్పడుతుంది. ఇంతలో రూంలో రెడీ అవుతున్న అమర్‌ పిల్లలు రాసిన లెటర్‌ చూస్తాడు. ఏంటోనని తీసుకుని చదువుతాడు. మరోవైపు పిల్లలు మిస్సమ్మ దగ్గరకు వెళ్లి తాము లెటర్‌ రాసిన విషయం చెప్తారు.

పిల్లలు ఏదో తెలియక

దీంతో మిస్సమ్మ ఎందుకు లెటర్‌ రాశారని ఈ విషయం తెలిస్తే మీ డాడీ ఎంత కొప్పడతాడో అని అంటుంది భాగమతి. మా డాడీ మమ్మల్ని తిట్టినా, కొట్టినా సరే మేమైతే మా అభిప్రాయం చెప్పాం అంటారు. ఇంతలో అమర్‌ పిల్లలను కిందకు పిలుస్తాడు. ఎంటిది? అమ్ము మీతోనే మాట్లాడుతున్నాను. ఏంటిది? అసలు ఈ లెటర్‌ ఎవరు రాశారు అని అడుగుతాడు. సార్‌.. అది పిల్లలు ఏదో తెలియక.. అని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది మిస్సమ్మ.

నువ్వాగు మిస్సమ్మ.. మీతోనే మాట్లాడుతున్నాను ఎవరు రాశారు అంటాడు అమర్​. గట్టిగా అడిగే సరికి పిల్లలు మేము అందరం కలిసే రాశామని మా మనసులో మాట మీకు చెప్పాలని రాశాము అనగానే మీరు ఏ విషయమైనా నాతో షేర్‌ చేసుకునే స్వేచ్చ ఉంది. ఇంత చిన్న విషయం నేను అర్థం చేసుకోలేనా? అనగానే పిల్లలు మా మీద మీకు కోపం లేదా డాడ్‌ అనగానే కోపం ఏం లేదని మీరు సమ్మర్‌ క్యాంపుకు ముందుగా వెళ్లాలని ఉందని చెప్తే నేను ఎందుకు వద్దంటాను అంటాడు అమర్.

మేము రాసిన లెటర్ కాదు

దాంతో పిల్లలు, భాగమతి షాక్ అవుతారు. మీకు ఏమైనా కావాలంటే రాథోడ్‌ చూసుకుంటాడని చెప్పి అమర్‌ వెళ్లిపోతుంటే మిస్సమ్మ లెటర్‌ అడిగి తీసుకుని చదువుతుంది. హాయ్‌ డాడ్‌ మేం సమ్మర్‌ మొత్తం క్యాంపులోనే ఉండాలనుకుంటున్నాం. మాకు కూడా కొన్ని రోజులు మా ఫ్రెండ్స్‌‌తో ఎంజాయ్‌ చేయాలని ఉంది. అందుకే మేము రేపే క్యాంపుకు వెళ్తున్నాం అని లెటర్​లో ఉంటుంది. ఇది మేము రాసిన లెటర్‌ కాదు మిస్సమ్మ. ఇది ఎవరో రాసి అక్కడ పెట్టారు అంటారు.

ఎన్ని రోజులు అయినా ఇంకెన్ని రోజులులే పిల్లలు మీరు సమ్మర్‌ క్యాంపుకు వెళ్లిపోతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? అంటుంది మనోహరి. ఏయ్‌ అసలు మనిషివేనా నువ్వు. తల్లిని పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న పిల్లలకి ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేస్తున్నావా? అంటూ మిస్సమ్మ తిడుతుంటే నువ్వు కాసేపు ఆగు అంటూ రాథోడ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయే వాళ్లను నమ్ముకుంటే నువ్వు కూడా మధ్యలోనే వెళ్లిపోతావు అని రాథోడ్‌కు మనోహరి వార్నింగ్ ఇస్తుంది.

అనుమానంగా అమర్

దాంతో రాథోడ్‌ వెళ్లిపోతాడు. తర్వాత మిస్సమ్మకు కూడా వార్నింగ్ ఇస్తుంది మనోహరి. అరుంధతి కోపంగా గుప్తను తిడుతుంది. మనోహరి పిల్లలను క్యాంపుకు పంపుతుందని మీరు ఏదైనా చేయండని చెబితే ఎందుకు చేయడం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంటి బాల్కనీ లోంచి అమర్‌ గమనిస్తాడు. అక్కడ ఎవ్వరూ లేరని ఎవరిని చూసి మాట్లాడుతున్నాడని అనుమానంగా కిందకు వస్తాడు. అమర్‌ రావడాన్ని చూసిన అరుంధతి గుప్తకు చెప్తుంది.

అయ్యో గుప్త గారు వెనక్కి చూడండి అంటుంది. నేను చూడను.. చూడను గాక చూడను. ముందు నువ్వు నా అంగుళీకము ఇవ్వుము అంటాడు గుప్త. గుప్త గారు మా ఆయన వస్తున్నారు చూడండి అంటుంది అరుంధతి. అయినను నీ పతిదేవుడు వచ్చినచో నాకెందుకు భయం అంటాడు గుప్త. ఎవరితో మాట్లాడుతున్నావు. నీ ముందు ఎవరు లేరు కదా? ఇందాకట్నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అమర్​. టెన్షన్‌ పడకుండా ఏదో ఒకటి చెప్పి కవర్‌ చేయండి అని అరుంధతి అంటుంది.

బాలిక కనిపిస్తుందా?

అలా అనగానే నేను మా బామ్మతో మాట్లాడుతున్నాను అని గుప్తా అంటాడు. దానికి ఇక్కడ ఎవరూ లేరు కదా అనగానే మనసుతో చూస్తే ఎవరైనా కనిపిస్తారని గుప్త చెప్పగానే అమర్‌ వెంటనే అక్కడే కూర్చుని కళ్లు మూసుకుని ఏకాగ్రతగా కళ్లు తెరిచి చూడగానే అరుంధతి కనిపిస్తుంది. దీంతో ఏడుస్తూ అరుంధతిని చూస్తుండిపోతాడు. ఇంతలో గుప్త మీకు ఆ బాలిక కనిపిస్తుందా అని అడగ్గానే అవునని చెప్పి లేచి వెళ్లిపోతాడు అమర్‌.

అరుంధతిని చూసిన అమర్​ ఏం చేయబోతున్నాడు? పిల్లలను కాపాడేందుకు మిస్సమ్మ ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే మార్చి 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!