NNS March 16th Episode: మనోహరిని బెదిరించిన హంతకుడు.. సీఐకి సైగలు.. ఘోరా నుంచి తప్పించుకున్న గుప్తా-nindu noorella saavasam march 16th episode manohari plan to escaping murderer nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nindu Noorella Saavasam March 16th Episode Manohari Plan To Escaping Murderer Nindu Noorella Saavasam Today Episode

NNS March 16th Episode: మనోహరిని బెదిరించిన హంతకుడు.. సీఐకి సైగలు.. ఘోరా నుంచి తప్పించుకున్న గుప్తా

Sanjiv Kumar HT Telugu
Mar 16, 2024 06:25 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌లో అరుంధతిని చంపిన హంతకుడిని పిల్లలు బతిమిలాడుతుంటారు. ఇంతలో మనోహరి వచ్చి టెన్షన్ పడుతుంది. అప్పుడే సీఐకు సైగలు చేస్తుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 16th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 16th March Episode) అరుంధతిని హత్య చేసిన హంతకుడిని పోలీస్ స్టేషన్‌లో పిల్లలు బతిమిలాడుతారు. చెప్పండి అంకుల్ అమ్మ లేకుండా బతకడం చాలా కష్టంగా ఉంది. మా అమ్మ ఎందుకు చచ్చిపోయిందో మేము తెలుసుకోవాలి అంటుంది అమృత. మా అమ్మ చంపే అంతా పాపం ఏం చేసిందో మేము తెలుసుకోవాలి తనని చంపే అంతా పగ ఎవరికి ఉందో మేము తెలుసుకోవాలి అంకుల్ అంటాడు ఆకాష్.

మనసు కరగట్లేదా

చెప్పండి అంకుల్ అని పిల్లలు నలుగురు ఏడుస్తారు. వాళ్ల కన్నీళ్లని బాధని చూసి పోలీస్ స్టేషన్‌లో ఉన్న వాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పటికైనా తెలిసిందా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో. తల్లి ప్రేమలో బతకాల్సిన వాళ్లని కన్నీళ్ల మధ్యలో పెరిగేలా చేస్తున్నావు. ఇప్పటికైనా చెప్పు నిన్ను ఇలా చేయమని చెప్పింది ఎవరో అంటాడు అమర్​. దానికి రౌడీ సైలెంట్‌గా ఉంటాడు. నీకు ఈ పిల్లల బాధ చూసి కూడా మనసు కరగట్లేదా ఎందుకు మేడని చంపాల్సి వచ్చిందో చెప్పు అంటాడు రాథోడ్.

అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతలో కంగారు పడిపోతూ మనోహరి పరిగెత్తుకొస్తుంది. అమర్​ కోపంగా అటు ఇటు తిరగడం చూసి అయిపోయింది అతను నిజం చెప్పేశాడు. నేను ఇంత ప్లాన్ చేసిన వేస్ట్ అయిపోయింది. అమర్ నన్ను చూస్తే చంపేస్తాడు అని మనోహరి వెళ్లిపోతూ ఉండగా రా మనోహరి అంటాడు అమర్​. ఇతను ఎవరో తెలుసా ఆరుని చంపిన అతను అంటాడు అమర్. అమర్.. అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని మనోహరి అంటూ ఉంటుంది.

సీఐకి మనోహరి సైగలు

కానీ మధ్యలోనే మనోహరి నువ్వైనా అడుగు ఆరుని ఎందుకు చంపాడో ఎవరు చంపమంటే చంపాడో అంటాడు అమర్​. ఇంకా అతను నిజం చెప్పలేదా అమర్ అంటుంది మనోహరి. చెప్పలేదు అంటాడు అమర్​. రేయ్ ఎందుకురా మా ఆరుని చంపావు నిజం చెప్పరా అంటుంది మనోహరి. హంతకునితో మాట్లాడుతూ సీఐకి సైగ చేస్తుంది మనోహరి. అది చూసిన సీఐ సర్ టైం అయిపోయింది ఇక మీరు వెళ్లండి అంటాడు.

అమర్​ పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతాడు. అమర్ మీరు వెళ్లండి. నేను నా కారులో వస్తాను అంటుంది మనోహరి. ఆ డ్రైవర్ నిజం చెప్పలేదని మేడం సంతోషిస్తున్నట్టున్నారు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు మనోహరికి ఉంటుంది అనుకుంటూ రాథోడ్ వెళ్లిపోతాడు. మనోహరి మళ్లీ స్టేషన్‌లోకి వెళుతుంది. నిజం చెప్పేసావేమోనని టెన్షన్ పడ్డాను. ఎవరు వచ్చి ఏమి అడిగినా ఇలాగే మౌనంగా ఉండు అంటుంది మనోహరి. మేడం ఇప్పుడు నిజం చెప్పలేదు. కానీ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లకపోతే కోర్టులో నిజం చెప్పేస్తాను శిక్ష తగ్గుతుంది అంటాడు హంతకుడు.

ఆలోచనలో అరుంధతి

వద్దు నేను నిన్ను బయటికి తీసుకువెళ్తాను నువ్వు మాత్రం నిజం చెప్పొద్దు అని మనోహరి సీఐ దగ్గరికి వెళ్లి అతన్ని ఈరోజు ఎలాగైనా బయటికి పంపించేసేయండి అంటుంది. కుదరదు మేడం ఆ మిలిట్రీ అతను పైనుంచి ఒత్తిడి చేపిస్తున్నాడు. కోర్టులో కేసు హాజరు పరచాలి. వెళ్లేదారిలో తప్పిస్తాను అంటాడు సీఐ. సరే ఎవరు వచ్చినా నాకు వెంటనే చెప్తూ ఉండు అంటూ మనోహరి వెళ్లిపోతుంది. పిల్లల్ని తీసుకొని వెళ్లి ఆయన ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదు. అంజలి అతనితో ఏం మాట్లాడాలనుకుంటుంది అని ఆలోచిస్తుంది అరుంధతి.

ఇంతలో భాగమతి వచ్చి అక్క ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. అదే ఆయన పిల్లల్ని తీసుకుని స్టేషన్‌కి వెళ్లాడు కదా ఇంకా రాలేదేంటని చూస్తున్నాను అంటుంది అరుంధతి. అసలు నువ్వు ఎవరు అక్క నీ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటావు నీ పిల్లలకంటే ఈ పిల్లల్ని ఎక్కువ బాగా చూసుకుంటావు నీకు పిల్లలు ఉన్నారంటావ్. కానీ, ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటావు వేసిన గేటు వేసినట్టే ఉంటుంది వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు. అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి అక్క అని అడుగుతుంది భాగమతి.

నాకు తెలియదు

నన్ను కన్న పేగు బంధం వదిలేస్తే నన్ను తాళి బంధంతో ఇంటిని పరిచయం చేసి నాకు ఆనందాన్ని పంచిన కుటుంబం అనుకుంటుంది అరుంధతి. నాకు ఈ ఇంట్లో కావలసిన వాళ్లు ఉన్నారు అంటుంది. ఎవరు సార్ వాళ్ల భార్య అంటుంది భాగమతి. అవును అని అంటుంది అరుంధతి. అక్క ఆవిడ గురించి వినడమే కానీ నాకు తెలియదు నువ్వు చెప్పవా ఆవిడ గురించి అంటుంది భాగమతి.

ఆవిడ మంచితనం గురించి తెలియదు కానీ అంత ఆవిడ వల్లే ఇలా జరుగుతుంది. ఆ మనోహరిని గుడ్డిగా నమ్మి తెచ్చి ఇంట్లో పెట్టింది అందుకే ఈ కష్టాలు వీళ్లకి వస్తున్నాయి. తప్పంతా నాదే తనని నమ్మకుండా ఉండాల్సింది అని అరుంధతి నోరు జారుతుంది. అక్క నువ్వు జాగ్రత్తగా ఉండడం ఏంటి అంటుంది భాగమతి. నేను కాదు ఆవిడ.. ఆవిడ జాగ్రత్తగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆ మనోహరి పిల్లల్ని ఆయనకు దూరం చేయాలనుకునేది కాదు కదా అంటుంది అరుంధతి.

గుప్తాగారు మాయమయ్యారు

నేనుండగా పిల్లలకి ఏమీ జరగనివ్వనక్క నేనుండగా మనోహరిని ఆయనకి భార్య కానివ్వను నేను చూసుకుంటాను అంటుంది భాగమతి. మాటల్లో పడి నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపోయాను నీళ్లు పట్టడానికి వచ్చాను అని భాగమతి నీళ్లు పడుతూ ఉంటుంది. నువ్వు నీళ్లు పట్టడం ఏంటి గుప్తా గారు ఏమయ్యారు అని అడుగుతుంది అరుంధతి. గుప్తా గారు ఉన్నట్టుండి పని మానేసి ఎటో వెళ్లిపోయారు అంటుంది భాగమతి.

ఆయన ఉంగరం నా దగ్గరే ఉంది. అసలు ఎక్కడికి వెళ్లినట్టు అని అరుంధతి ఆలోచిస్తుంది. ఘోరా గుప్తాని కట్టిపడేస్తాడు. నన్ను ఎందుకు కట్టి పడేసావ్ నీకేం కావాలి నావల్ల నీకు ఉపయోగం ఏంటి ఘోర అంటాడు గుప్తా. ఆ ఆత్మ నీతో ఎలా మాట్లాడగలుగుతుంది దశ దిన కర్మ అయిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలి. కానీ, ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది నీకు ఎలా కనిపిస్తుంది సమాధానం చెప్పు అంటాడు ఘోర.

పారిపోయిన గుప్తా

ఎందుకంటే తన చావుకి ఒక కారణం ఉంది ఘోరా తనను కన్న వాళ్లని దగ్గరికి చేరుస్తుందో తనని చంపిన స్నేహితురాలని పెళ్లి బంధంతో కుటుంబానికి దగ్గర చేస్తుందో అంతా ఆ భగవంతుడికే తెలియాలి. ఈ సృష్టిలో అతీతమైన శక్తి ఏదైనా ఉంది అంటే అది మంచితనమే. ఘోర నీ మంచి కోరి చెప్తున్నాను ఇంకెప్పుడూ తన జోలికి వెళ్లకు అని గుప్తా చేతుల కట్లు విప్పేసుకుని ఘోర కళ్లలో విభూతిని కొట్టి పారిపోతాడు.

మనోహరి నిజస్వరూపం బయటపెట్టేందుకు భాగమతి ఏం చేస్తుంది? హంతకుడిని సీఐ వదిలేస్తాడా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel