NNS February 15th Episode: రివర్స్ అయిన అమర్.. భయపడిపోయిన మనోహరి.. సరస్వతి కాల్, అరుంధతికి టెన్షన్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్‌లో మిస్సమ్మే ఆర్జీ భాగీ అని తెలుసుకుంటాడు అమర్. అయితే ఆ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని రాథోడ్‌తో మనోహరి అంటుంది. అది విన్న అమర్ రివర్స్ అవుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 15th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 15th February Episode) మిస్సమ్మనే తాను ఎంతగానో అభిమానించే ఆర్జే భాగీ అని తెలుసుకున్న అరుంధతి సంతోషపడుతుంది. ఇన్ని రోజులు పక్కనే పెట్టుకొని ఎందుకు గుర్తించలేకపోయాను. నా బాధ తనకి ఎందుకు అర్థం అవుతుంది. తనకు వచ్చిన కష్టానికి నాకెందుకు కన్నీళ్లు వచ్చాయి అని అరుంధతి అనుకుంటుంది.
భాగీని కలిసారా
కనీసం సంబంధం లేని నేను ముఖ పరిచయం కూడా లేని నేను ఒకరి గురించి ఒకరు ఎందుకిలా ఆరాటపడుతున్నాము. ఈ ఇంటికి తనకి నాకు సంబంధం ఏమిటి. ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చినందుకు ఆనందపడాలా లేక కలవలేకపోయినందుకు బాధపడాలా అనుకుంటుంది అరుంధతి. పిల్లలు వచ్చి శివరాంని నాన్న వాళ్లు భాగిని కలిసారా అని అడుగుతారు. ఇంకా రాలేదు పిల్లలు అని చెప్తాడు శివరాం. మన ఇంట్లో ఉన్న మిస్సమ్మనే భాగి అని చెప్తుంది అరుంధతి.
ఈ ఇంట్లో నా స్థానంలో ఉండి పిల్లలని చూసుకునే మిస్సమ్మ భాగీ మామయ్య అని అంటుంది అరుంధతి. డాడీ వాళ్లు ఫోన్ చేశారా అని అడుగుతుంది అంజలి. ఇంకా ఫోన్ చేయలేదు నెట్‌వర్క్ ప్రాబ్లం అనుకుంటా అంటాడు శివరాం. నిరాశ పడకండి వెళ్లి చాలాసేపు అయింది కదా వస్తారు లెండి అంటుంది నిర్మల. భాగి అక్కని ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది. అమ్మ తనని ఎంత ఇష్టపడిందో తనకోసం ఎంత ఎదురు చూసిందో రాలేదు అని ఎంత బాధ పడిందో అంతా తనకి చెప్పాలి అంటుంది అమ్ము.
అవార్డ్ వచ్చిందని
భాగి కొడైకెనాల్‌కి వచ్చింది నన్ను చూడడం కోసం ఎంత కష్టపడినా కలవలేకపోయాను అని బాధ పడింది. కానీ కలవలేదని కక్ష పెట్టుకోలేదు అని అరుంధతి అనుకుంటుంది. మీ అమ్మ తనని కలవాలని ఎంతో ఆరాటపడింది. ఇవాళ మీ అమ్మ బతికి ఉంటే భాగి అవార్డు తీసుకోవడం చూసి ఎంతో ఆనందించేది అని అంటాడు శివరాం. నేను చూశాను మామయ్య. కానీ తనకి అవార్డు వచ్చిందని ఆనందించాలో భాగీనే మిస్సమ్మ అని ఆశ్చర్యపడలో అర్థం కాక అయోమయంలో ఉండిపోయాను అంటుంది అరుంధతి.
డాడీ భాగి అక్కని తీసుకొస్తాడు మనం ఇలా ఉండకూడదు. వెళ్లి రెడీ అవుదాం పదండి అని పిల్లలు వెళ్తారు. అమర్‌ని భాగమతితో మాట్లాడనివ్వకుండా చేసింది మనోహరి. భాగమతికి నిజం చెప్పలేను. మనోహరి తప్పుల మీద తప్పులు చేయకుండా ఆపలేను దేవుడా ఎందుకు ఇలాంటి పరిస్థితిలో పడేస్తావు అని అనుకుంటుంది అరుంధతి. మరోవైపు ముసలోళ్ళకి ఆ మిస్సమ్మ భాగమతి అని తెలిస్తే భాగమతి మీద ఉన్న ప్రేమకి దాన్ని తెచ్చి మళ్లీ ఇంట్లో పెట్టుకుంటారు అని అనుకుంటుంది మనోహరి.
కావాలనే విడదీశారు
ఈసారి అమర్ భాగమతికి దగ్గర అయితే దూరం చేయడం చాలా కష్టం. ఇంట్లో వాళ్లకి నిజం చెప్పకుండా అమర్‌ని ఆపాలి అనుకుంటుంది మనోహరి. రాథోడ్ మిస్సమ్మ భాగమతి అని ఇంట్లో వాళ్లకు చెప్పకు అంటుంది. అది విన్న అమర్ అక్కడ నిలబడి ఎందుకు చెప్పకూడదు మనోహరి. ఆరు మీద ఉన్న ప్రేమ వల్ల భాగమతి బాధపడుతుందని చెప్పకూడదన్నావు. కానీ ఇంట్లో వాళ్లకి ఎందుకు చెప్పకూడదు అంటున్నావు అంటాడు అమర్. ఎవరో కావాలనే ఆరుని భాగమతిని విడదీశారు అని అంటాడు అమర్.
అమర్ ఏంటి ఇలా రివర్స్ అయ్యాడు. ఎలాగైనా ఏదో ఒకటి చెప్పి ఆపాలి అని అనుకుంటుంది మనోహరి. పిల్లలకు తెలియకూడదు అని అంటుంది మనోహరి. మిస్సమ్మ భాగమతి ఒక్కరే అని తెలిస్తే పిల్లలకి వచ్చే నష్టం ఏంటి అని అడుగుతాడు అమర్. నాకు తెలిసి వాళ్లు ఇంకా ఆనందపడతారు అంటాడు అమర్. ఆ ఆనందమే నా భయం పెళ్లయి వెళ్లిపోయే అమ్మాయి మీద అంత ప్రేమ పెంచుకోవడం కరెక్ట్ కాదేమో. తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. కానీ తనకు అలవాటు పడిన పిల్లలు తను వస్తుందని ఆశపడతారు. పెళ్లయిపోయాక చెప్తే తను ఇంకా రాదులే అని ఎక్కువ టెన్షన్ పడరు అంటుంది మనోహరి.
అదే పని మీద ఉన్నా
నాకు పిల్లల సంతోషం ముఖ్యం అమర్ అంటుంది మనోహరి. శివరాం ఇంకా పిల్లలు బయటికి వచ్చి భాగిని కలిసావా అని అడుగుతారు. పిల్లల మొహంలో ఆనందం చూసి నిజం చెప్పలేక బాధపడతాడు అమర్.
భాగీ గురించి ఆలోచిస్తున్న అమర్‌కి సరస్వతి టీచర్ ఫోన్ చేస్తుంది. మనోహరి పెళ్లి విషయం మాట్లాడటానికే ఫోన్ చేశారనుకున్న అమర్ తాను అదే పని మీద ఉన్నానని చెబుతాడు అమర్. కానీ, తాను ఆ విషయం మాట్లాడటానికి చేయలేదని, మనోహరి చేస్తున్న కుట్ర గురించి చెప్పాలనుకుంటుంది టీచర్.
భయపడిన మనోహరి
అమర్ సరస్వతి టీచర్‌తో మాట్లాడటం గమనించిన నీల వెంటనే మనోహరికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. అమర్‌కి నిజం తెలిస్తే తనను వదిలేయడని భయపడుతుంది మనోహరి. సరస్వతి టీచర్ అమర్‌కి నిజం చెబుతుందా? నిజం తెలుసుకున్న అమర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!