NNS February 29th Episode: అంజలి దగ్గర సీక్రెట్ ఫోన్.. నిజం తెలుసుకున్న రాథోడ్.. ఆగిపోనున్న మిస్సమ్మ పెళ్లి!
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 29వ తేది ఎపిసోడ్‌లో మనోహరి ప్లాన్ బెడిసికొడుతుంది. అంజలి దగ్గర ఉన్న సీక్రెట్ ఫోన్ ద్వారా వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుంటాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 29th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 29th February Episode) మిస్సమ్మ పెళ్లి బాగా జరగాలని వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని రా అమ్మ అంటుంది నిర్మల. ఈ పెళ్లి మా నాన్న కోసం చేసుకుంటున్న పెళ్లి ఆంటీ ఆయన లేకుండా సంతోషంగా ఎలా ఉంటాను అని బాధపడుతుంది భాగమతి. వెళ్లమ్మా వెళ్లు వెళ్లి దండం పెట్టుకొని రా దేవుడికి అని పంపిస్తుంది మంగళ. రాథోడ్ మెకానిక్‌ను తీసుకొని కారు దగ్గరికి వస్తాడు. ఇదే కారు చూడవయ్యా ఏమైందో అని అంటాడు రాథోడ్.
జరిగిన విషయం
అక్కడ అంతా చూస్తాడు. కానీ, మనోహరి పిల్లలు కనిపించలేక కంగారు పడిపోయిన రాథోడ్ వెంటనే మనోహరికి ఫోన్ చేస్తాడు. కానీ, మనోహరి ఫోను ఎత్తదు. ఈవిడ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి సార్‌కి చెప్పాలి అని అమర్‌కి ఫోన్ చేస్తాడు. ఏంటి రాథోడ్ ఇంకా రాలేదు ఏమైంది అని అడుగుతాడు అమర్. రాథోడ్ జరిగిన విషయం అంతా చెబుతాడు. మనోహరికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు సార్ ఎక్కడున్నారో తెలియదు అంటాడు. ఫోన్ ఎత్తట్లేదా.. నేను ట్రై చేస్తాను అని మనోహరికి ఫోన్ చేస్తాడు అమర్.
భాగీ పెళ్లి అయ్యేదాకా నీ ఫోను లిఫ్ట్ చేయను అమర్ అని ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఏంటి అని అనుకుంటాడు అమర్. ఇంతలో మళ్లీ ఫోను రింగ్ అవుతుంది. నీ ఫోను మొగట్లేదు, నాకు ఫోన్ రావట్లేదు కానీ సౌండ్ వస్తుంది ఎక్కడినుంచి అంటుంది మనోహరి. నా దగ్గర నుంచి ఆంటీ అని అంజలి ఫోను లిఫ్ట్ చేస్తుంది. హలో అంజు ఎక్కడున్నారమ్మ మనోహరి ఆంటీ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని అంటాడు అమర్. ఆంటీ డాడీ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అంట ఎందుకు అని అంజలి అడుగుతుంది.
లైవ్ లొకేషన్
సైలెన్స్‌లో పడింది చూసుకోలేదు అని చెబుతుంది మనోహరి. హలో డాడీ చెప్పండి అని అంటుంది అంజలి. ఇప్పుడు ఎక్కడున్నారమ్మ అని అమర్ అడగడంతో.. రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం డాడీ లెఫ్ట్ తీసుకుంటే గుడి దగ్గరికి వస్తాము 15 నిమిషాల్లో అక్కడ ఉంటాం, డాడీ నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నాను చూడండి అంటుంది అంజలి. త్వరగా వచ్చేయండి అని అంటాడు అమర్. అంజలి నీ దగ్గర ఫోన్ ఎక్కడిది అని మనోహరి అడుగుతుంది.
అమ్మ, నాన్న దగ్గర లేనప్పుడు ఈ ఫోన్ యూజ్ చేసుకోమని డాడీ చెప్పాడు ఆంటీ. నాన్న ఇప్పుడు మా దగ్గర లేడు కాబట్టి ఈ ఫోన్ నేను తీసుకొచ్చాను అని అంజలి చెబుతుంది. అది సరే నీకు లైవ్ లొకేషన్ పెట్టడం ఎలా వచ్చు అని మనోహరి అడుగుతుంది. మా అమ్మ నేర్పించింది ఆంటీ అని అంజలి చెబుతుంది. నేను ఎప్పుడో నేర్పిస్తే ఇంకా గుర్తుపెట్టుకున్నావా నా బంగారు తల్లి అని అరుంధతి అనుకుంటుంది. మనోహరి మంగళకి ఫోన్ చేస్తుంది.
15 నిమిషాల్లో గుడిలోకి
హలో మేడం పెళ్లికి ఆ అమ్మాయి రావట్లేదు కదా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అంటుంది మంగళ. నన్ను హలో అని కూడా అననివ్వరా 15 నిమిషాల్లో గుడికి వచ్చేస్తాం ఆలోగా ఏం చేయాలో మీరే చూసుకోండి అని అంటుంది మనోహరి. అంజలి పాప పెళ్లికి వస్తుందా అని కంగారు పడుతుంది మంగళ. తొందరగా రాకుండా ఉండేందుకు ప్రయత్నించామండి. కానీ కుదరలేదు అర్థం చేసుకోండి అని మనోహరి అంటుంది.
ఈ అంజలి ఇప్పుడు పెళ్లికి వస్తే నా తమ్ముని చూసేస్తుంది. వాడి పెళ్లి కాదుగాని తద్దినం ఇక్కడే అవుతుంది అని మంగళ పరిగెత్తికెళ్లి పంతులుగారు ఇంకా ఎంతసేపు మంత్రం చదువుతారు పెళ్లి చేసేయండి అని అంటుంది. పెళ్లికి ఇంకా టైం ఉందమ్మా అని పంతులుగారు అంటారు. పెళ్లి చేసుకునే వాడికి లేని బాధ నీకెందుకండీ తొందరగా పెళ్లి చేయండి అని మంగళ తొందర పెడుతుంది. అన్నీ సక్రమంగా చేస్తేనే పెళ్లి చేసుకున్న జంట బాగుంటారమ్మా అని పంతులుగారు చెబుతారు.
ఏమైనా సమస్యా
ఏమైనా ప్రాబ్లమా అని అమర్ అడుగుతాడు. ఏమీ లేదు అంటుంది మంగళ. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులు కాదండి మనస్ఫూర్తిగా చేసుకొని అన్ని సక్రమంగా పూజలు చేసి అందరి సమక్షంలో ఒకటయ్యే జంట ఆనందంగా ఉంటారు. అలాంటి పెళ్లిని తూతూ మంత్రంగా జరిపించమంటారేంటి అంటాడు అమర్. పంతులుగారు ఏం పర్వాలేదు పెళ్లి సవ్యంగా జరిపించండి అని చెబుతాడు. పంతులుగారు భజంత్రీలు మోగించమంటాడు.
రామ్మూర్తి రోడ్డు మీద అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అటుగా వస్తూ ఉంటే రామ్మూర్తి వెళ్లి కారు మీద పడతాడు. ఎవరు అయ్యా నువ్వు చావడానికి నా కారే దొరికిందా అంటాడు రాథోడ్. అతన్ని చూసేసరికి వాచ్‌మెన్ అని కనిపెట్టి ఏంటి సార్ మీరు ఇక్కడ ఏమైంది మీకు అని అంటాడు. సార్ మీకు ఆరోగ్యం బాగోలేనట్టుంది మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అంటాడు. వద్దు నా కూతురు పెళ్లి ఇక్కడ జరుగుతుంది ఆపాలి అంటాడు రామ్మూర్తి.
భాగీ నా కూతురే
మీ కూతురు పెళ్లి ఆపడం ఏంటి సార్ అంటాడు రాథోడ్. ఇక్కడ అమ్మవారి టెంపుల్‌లో భాగీ పెళ్లి జరుగుతుంది అని రాథోడ్ అంటాడు. ఆ భాగి నాకు కూతురు, తన పెళ్లి ఆపాలి తొందరగా తీసుకువెళ్లు అంటాడు రామ్మూర్తి. భాగి మీ కూతురా? ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా అసలు ఏం జరుగుతుంది అంటాడు రాథోడ్. భాగి నా కూతురే తన పెళ్లి ఎలాగైనా ఆపాలి అని రామ్మూర్తి మాట్లాడలేక మాట్లాడుతాడు. ఈ విషయం వెంటనే సార్ కు చెప్పాలి అని రాథోడ్ అమర్‌కి ఫోన్ చేస్తాడు.
భజంత్రీలు మోగుతూ ఉండడంతో అమరేంద్రకి ఫోను వినపడక ఫోన్ ఎత్తడు. సార్ ఫోన్ ఎత్తట్లేదు ముందు మనం గుడి దగ్గరికి వెళ్దాం పదండి అని రాథోడ్ రామ్మూర్తిని కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు. పిల్లలు కారు దిగి గబగబా గుళ్లోకి పరిగెడతారు. మనోహరి మంగళకి ఫోన్ చేసి పిల్లలు వచ్చేస్తున్నారు నువ్వే చూసుకో అని అంటుంది. పిల్లల్ని ఎలాగు ఆపలేను మా తమ్ముడిని బయటికి పంపిస్తాను అని మంగళ కాళీ దగ్గరికి వెళ్లి రేయ్ అంజలి వస్తుందంట నువ్వు అర్జెంటుగా బయటకి వెళ్లిపో అని చెబుతుంది.
పెళ్లి ఎలా జరుగుతుంది
పంతులుగారు నాకు అర్జెంట్‌గా వాష్ రూమ్ వస్తుంది వెళ్లొస్తాను అని కాళీ వెళ్లిపోతాడు. పెళ్లి అని రాత్రి బిర్యానీ తిన్నాడండి అందుకే పొద్దున్నుంచి బాత్రూం పోతూనే ఉన్నాడు అని మంగళ సర్దిచెబుతుంది. పిల్లలు పరిగెత్తుకొచ్చి డాడీ ఇంకా పెళ్లి అవ్వలేదా.. పెళ్లి అయిపోతుందని టెన్షన్ పడ్డాం అంటారు. మీరు రాకుండా మిస్సమ్మ పెళ్లి ఎలా జరుగుతుంది పిల్లలు అంటుంది నిర్మల. మిస్సమ్మ ఎక్కడ అని అంజలి అడుగుతుంది. తన రూమ్ లో ఉంది వెళ్లండి అని అమర్ అంటాడు.
పిల్లలు భాగమతి దగ్గరికి వెళ్తారు. మీ తమ్ముడు ఎక్కడ అని మనోహరి అడుగుతుంది. అంజలిని ఆపలేనని మా తమ్ముని బయటికి పంపించాను అని మంగళ చెబుతుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగకూడదు అని మనోహరి అంటుంది. ఏం చేయాలమ్మా అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ పెళ్లి కొడుకు వస్తే కానీ పెళ్లి కూతుర్ని తీసుకురాలేము ముందు అబ్బాయిని తీసుకురండి అని పంతులు చెబుతారు. మా తమ్ముని నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది.
అడ్డుకుంటారా
ఏ మను ఏం చేయాలనుకుంటున్నావే భాగికి, కాళీకి పెళ్లి చేయడానికి నీకు ఏంటే సంబంధం అసలేం జరుగుతుంది అని అరుంధతి గుడిలోకి రాలేక బయట నిలబడి చూస్తూ ఉంటుంది. భాగీ పెళ్లి కాళీతో జరగకుండా ఎవరు అడ్డుపడతారు? కాళీ గురించి తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే మార్చి 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!